కటౌట్‌తో సహజీవనం
లండన్: హాలీవుడ్ నటుడు బ్రాడ్లీ కూపర్ అంటే డానియెల్లీ అనే మహిళకు పిచ్చి అభిమానం. ఎంత అభిమానమంటే.. ఆ నటుడి నిలువెత్తు కటౌట్‌ను కార్డ్‌బోర్డుతో తయారు చేయించుకుని.. భర్త, ఇద్దరు పిల్లలతో పాటు ఆ కటౌట్‌నీ తమ కుటుంబంలో ఒక భాగంగా భావించేంత. ఆమె భర్త ఎడ్డీ సహా ఆమె కుటుంబమంతా బ్రాడ్లీని (ఆ కటౌట్‌ని) ప్రాణమున్న వ్యక్తిలానే భావిస్తుంటారు. జాగింగ్, తోటపని, వంటపని, షాపింగ్ లాంటి రోజువారీ పనులు కూడా వారంతా కలిసే చేసుకుంటుంటారు. బ్రాడ్లీకి డానియెల్లీ పుస్తకాలు కూడా చదివి వినిపిస్తుంటుంది. ఇంకా వివరాలు కావాలంటే mylifewithbradleycooper.com చూడండి.