Bradley Cooper
-
తానే స్టార్‌హీరోనంటూ డూప్ హల్చల్!!
ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెప్తారు. ఇక సినిమా స్టార్లతో పోలికలున్న ఉన్న వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లలాగా నటించి, డైలాగులు చెప్పి, డ్యాన్సులు చేసి టీవీ షోల్లో ఈ పోలికలున్న డూప్ వ్యక్తులు అప్పుడప్పుడు అలరిస్తు ఉంటారు. ఇందులో ఏ సమస్య లేదు. కానీ అచ్చుగుద్దినట్టు పోలికలుండటంతో తానే అసలు స్టార్ హీరోనంటూ ఓ డూప్ వ్యక్తి ప్రజలను మభ్యపెట్టి బోల్తా కొట్టిస్తే ఎలా ఉంటుంది. అచ్చంగా ఇలాంటి సమస్య హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్లే కూపర్‌కు ఎదురైంది. అచ్చుగుద్దినట్టు కూపర్ పోలికల్లో ఉండే ఓ వ్యక్తి.. ఇటీవల జరిగిన 2016 సండాన్స్ ఫిలిం ఫెస్టివల్లో హల్చల్ చేశాడు. తానే కూపర్ నంటూ సెక్యూరిటీని మభ్యపెట్టి యథేచ్ఛగా ఈ చిత్రోత్సవంలోకి ప్రవేశించిన అతను.. కూపర్ అభిమానులతో ఫొటోలకు పోజులు కూడా ఇచ్చాడు. ఈ ఫొటోలు చూసి అసలు కూపర్‌కు దిమ్మదిరిగినంత పనయిందట. అంతేకాదు కూపర్‌కు జీరాక్స్ కాపీలా ఉండే ఆ వ్యక్తి తరచూ ఆయన పేరు వాడుకొని సెలబ్రిటీ పార్టీల్లోకి చొరబడుతున్నాడట. తానే కూపర్లా పోజు కొడుతూ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నాడు. ఉటాలో సండాన్స్ చిత్రోత్సవం జరిగే సమయంలో కూపర్ న్యూయార్క్ లో ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన నకిలీ కూపర్ ఈ వేడుకల్లోకి చొరబడ్డాడని భావిస్తున్నారు. అమెరికన్ యాక్టర్ అయిన కూపర్ 'బర్న్ట్', 'అమెరికన్ స్నిపర్', 'సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్' వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. -
ఎంత ఇష్టమైతే మాత్రం...?!
విచిత్రం సినిమా హీరోలను ఇష్టపడటం, పిచ్చిగా ఆరాధించడం చాలామంది చేస్తారు. కానీ డానియెల్లె డేవిస్ అంతటితో ఆగి పోలేదు. తన అభిమాన నటుడితో కలిసి బతకాలను కుంది. అందుకో విచిత్రమైన మార్గం ఎంచుకుంది. న్యూజెర్సీకి చెందిన డానియెల్లె (39)కి హాలీవుడ్ నటుడు బ్రాడ్లీ కూపర్ అంటే చచ్చేంత ఇష్టం. ఎంత ఇష్టమంటే... అతడితో కలిసి జీవించాలని నిర్ణయించుకునేంత! అయితే అది కుదరదని తనకూ తెలుసు కాబట్టి అతడి బొమ్మతో కాపురం మొదలుపెట్టింది. కార్డ బోర్డుతో డానియెల్లె నిలువెత్తు బొమ్మను తయారు చేయించుకుంది. ఎక్కడికి వెళ్లినా దాన్ని తీసుకుని వెళ్తుంది. తినేటప్పుడు, తాగేటప్పుడు, వంట చేసేటప్పుడు, చివరకు నిద్రపోయేటప్పుడు కూడా పక్కన అతగాడి బొమ్మ ఉండాల్సిందే. ఇవన్నీ చదివి డ్యానియెల్లె పెళ్లి కాని అమ్మాయి అయి ఉంటుంది అనుకునేరు. ఆమెకి పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వాళ్లెవరికీ ఈమె ఇలా చేయడంలో అభ్యంతరం లేదట. తనకు అలా ఉండటం ఇష్టం, మనమేం చేయగలం అంటూ లైట్‌గా తీసిపారేస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. చివరికి కూపర్ బొమ్మని మంచం మీద తన పక్కనే ఉంచుకుని నిద్రపోతున్నా అభ్యంతరం చెప్పడం లేదు. అలా ఎలా ఉంటారు అని అంటే... ‘‘మా వాళ్లందరికీ నేనంటే చాలా ప్రేమ. నాకు కూపర్ అంటే ఎంత ఇష్టమో వాళ్లకు తెలుసు. నాకిష్టమైనదాన్ని వాళ్లు కాదనరు’ అంటోంది నవ్వుతూ. కూపర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ మరీ ఇంత వెర్రి ఏమిటి అని అంటున్నారు కొందరు. కాని డానియెల్లెకి మాత్రం అవేమీ బుర్రకెక్కడం లేదు! -
కటౌట్‌తో సహజీవనం
లండన్: హాలీవుడ్ నటుడు బ్రాడ్లీ కూపర్ అంటే డానియెల్లీ అనే మహిళకు పిచ్చి అభిమానం. ఎంత అభిమానమంటే.. ఆ నటుడి నిలువెత్తు కటౌట్‌ను కార్డ్‌బోర్డుతో తయారు చేయించుకుని.. భర్త, ఇద్దరు పిల్లలతో పాటు ఆ కటౌట్‌నీ తమ కుటుంబంలో ఒక భాగంగా భావించేంత. ఆమె భర్త ఎడ్డీ సహా ఆమె కుటుంబమంతా బ్రాడ్లీని (ఆ కటౌట్‌ని) ప్రాణమున్న వ్యక్తిలానే భావిస్తుంటారు. జాగింగ్, తోటపని, వంటపని, షాపింగ్ లాంటి రోజువారీ పనులు కూడా వారంతా కలిసే చేసుకుంటుంటారు. బ్రాడ్లీకి డానియెల్లీ పుస్తకాలు కూడా చదివి వినిపిస్తుంటుంది. ఇంకా వివరాలు కావాలంటే mylifewithbradleycooper.com చూడండి. -
కటౌట్‌తో సహజీవనం
లండన్: హాలీవుడ్ నటుడు బ్రాడ్లీ కూపర్ అంటే డానియెల్లీ అనే మహిళకు పిచ్చి అభిమానం. ఎంత అభిమానమంటే.. ఆ నటుడి నిలువెత్తు కటౌట్‌ను కార్డ్‌బోర్డుతో తయారు చేయించుకుని.. భర్త, ఇద్దరు పిల్లలతో పాటు ఆ కటౌట్‌నీ తమ కుటుంబంలో ఒక భాగంగా భావించేంత. ఆమె భర్త ఎడ్డీ సహా ఆమె కుటుంబమంతా బ్రాడ్లీని (ఆ కటౌట్‌ని) ప్రాణమున్న వ్యక్తిలానే భావిస్తుంటారు. జాగింగ్, తోటపని, వంటపని, షాపింగ్ లాంటి రోజువారీ పనులు కూడా వారంతా కలిసే చేసుకుంటుంటారు. బ్రాడ్లీకి డానియెల్లీ పుస్తకాలు కూడా చదివి వినిపిస్తుంటుంది. ఇంకా వివరాలు కావాలంటే mylifewithbradleycooper.com చూడండి.