Natural Star Nani 63 Feet Huge Cutout In Hyderabad- Sakshi
Sakshi News home page

Shyam Singha Roy Movie: థియేటర్‌ ముందు నాని 63 అడుగుల భారీ కటౌట్‌.. ఫొటోలు వైరల్‌

Published Wed, Dec 22 2021 11:36 AM | Last Updated on Wed, Dec 22 2021 4:19 PM

Natural Star Nani 63 Feet Huge Cutout In Hyderabad - Sakshi

Natural Star Nani 63 Feet Huge Cutout In Hyderabad: సినిమా హీరోలను అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు. ఎవరిమీద చూపినంచా ప్రేమ ఒలకబోస్తారు. తమ ఫేవరెట్‌ హీరోలను 'అన్న' అని పిలుస్తూ ఇంట్లో మనిషిలా భావిస్తారు. అలాంటిది వారి అభిమాన హీరో సినిమా రిలీజ్‌ అంటే ఊగిపోతారు. అది పెద్ద పండగలా జరుపుకుంటారు. కటౌట్‌లు, పాలాభిషేకాలతో తమ అభిమానాన్ని చాటుతారు. తాజాగా నేచురల్‌ స్టార్‌ నాని ఫ్యాన్స్‌ తమ అభిమానాన్ని భారీ కటౌట్‌  రూపంలో ప్రదర్శించారు. నాని ద్విపాత్రాభినయం చేసిన తాజా సినిమా 'శ్యామ్‌ సింగరాయ్‌'. సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిసెంబర్‌ 24న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా నాని హార్ట్‌కోర్‌ ఫ్యాన్స్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని ఓ థియేటర్‌ ముందు నాని భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. 63 అడుగులతో 'శ్యామ్‌ సింగరాయ్‌' పాత్రలో ఉన్న నాని కటౌట్‌ను పెట్టి తమ అభిమానాన్ని అంత ఎత్తులో చూపించారు. ఇప్పటివరకు చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్ వంటి బడా హీరోల అభిమానులు మాత్రమే ఇలా కటౌట్‌లు ఏర్పాటు చేసేవారు. తాజాగా చిన్న స్థాయి నుంచి ఎదిగిన నాని భారీ కటౌట్‌ను ఫ్యాన్స్‌ ఏర్పాటు చేయడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను పునర్జన్మ నేపథ్యంలో రూపొందించారు. 

సాయి పల్లవి దేవదాసిగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్‌ దర్వకత్వం వహించగా జంగా సత్యదేవ్‌ కథను అందించారు. డిసెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ తమిళ వెర్షన్‌కు నాని సొంతగా డబ్బింగ్‌ చెప్పుకోవడం విశేషం. 
 

ఇదీ చదవండి: పునర్జన్మపై నమ్మకం ఉందన్న సాయి పల్లవి.. అదెలా అంటే ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement