Haseeb Hameed
-
ఐదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు.. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు
లండన్: టీమిండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ ధాటికి ఐదేళ్ల తర్వాత ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆటగాడు హసీబ్ హమీద్ బెంబేలెత్తిపోయాడు. టెప్ట్ క్రికెట్లో 1717 రోజు తర్వాత తానెదుర్కొన్న తొలి బంతికే గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్‌ను లక్ష్యంగా చేసుకుని సిరాజ్ విసిరిన ఫుల్ లెంగ్త్ డెలివరి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన హమీద్.. క్లీన్ బౌల్డయ్యాడు. ఐదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడుతుండటం.. హమీద్ తడబాటుకు కారణమైనట్లు స్పష్టమైంది. హమీద్ చివరిసారి 2016 నవంబర్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. Two in two balls for India as Siraj takes out Sibley and Hameed right after tea Tune into Sony Six (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/AwcwLCPFGm ) now! 📺#ENGvINDOnlyOnSonyTen #BackOurBoys #Siraj pic.twitter.com/ERCbf3Ttk1 — Sony Sports (@SonySportsIndia) August 13, 2021 కాగా, ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సిరాజ్ వరుస బంతుల్లో వికెట్లు తీసాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతికి ఓపెనర్ డొమినిక్ సిబ్లే(11)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపిన సిరాజ్.. ఆమరుసటి బంతికే హసీబ్ హమీద్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ వరుస బంతుల్లో వికెట్లు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే, ఓవర్‌నైట్ స్కోరు 276/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (250 బంతుల్లో 129; 12 ఫోర్లు, సిక్స్) మరో 2 పరుగులు మాత్రమే జోడించి ఔటవ్వగా.. మిగితా జట్టంతా పేకమేడలా కూలింది. 86 పరుగుల వ్యవధిలో భారత్.. తమ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 5 వికెట్లతో చెలరేగగా, రాబిన్సన్, మార్క్ వుడ్ తలో 2 వికెట్లు, మొయిన్ అలీ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలో సిరాజ్(2/34) దెబ్బతీయగా, బర్న్స్(49), రూట్(48 బ్యాటింగ్) ఆదుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బి) అండర్సన్ 83; రాహుల్ (సి) సిబ్లీ (బి) రాబిన్సన్ 129; పుజారా (సి) బెయిర్‌స్టో (బి) అండర్సన్ 9; కోహ్లి (సి) రూట్ (బి) రాబిన్సన్ 42; రహానే (సి) రూట్ (బి) అండర్సన్ 1; పంత్ (సి) బట్లర్ (బి) వుడ్ 37; జడేజా (సి) అండర్సన్ (బి) వుడ్ 40; షమీ (సి) బర్న్స్ (బి) అలీ 0; ఇషాంత్ (ఎల్బీ) (బి) అండర్సన్ 8; బుమ్రా (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (126.1 ఓవర్లలో ఆలౌట్) 364. వికెట్ల పతనం: 1–126, 2–150, 3–267, 4–278, 5–282, 6–331, 7–336, 8–362, 9–364, 10–364. బౌలింగ్: అండర్సన్ 29–7–62–5, రాబిన్సన్ 33–10–73–2, స్యామ్ కరన్ 22–2–72–0, మార్క్ వుడ్ 24.1–2–91–2, మొయిన్ అలీ 18–1–53–1. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) (బి) షమీ 49; సిబ్లీ (సి) రాహుల్ (బి) సిరాజ్ 11; హమీద్ (బి) సిరాజ్ 0; రూట్ (బ్యాటింగ్) 48; బెయిర్‌స్టో (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45 ఓవర్లలో 3 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1–23, 2–23, 3–108. బౌలింగ్: ఇషాంత్ శర్మ 11–2–32–0, బుమ్రా 9–3–23–0, షమీ 8–2–22–1, సిరాజ్ 13–4–34–2, జడేజా 4–1–6–0. -
ఓపెనర్ దొరికాడా?
రాజ్‌కోట్:ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టుకు సరైన ఓపెనర్ కావాలి. దాదాపు నాలుగేళ్లుగా ఇంగ్లండ్ నిరీక్షణ ఇది. ఆండ్రూ స్ట్రాస్ వీడ్కోలు తరువాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సరైన ఓపెనింగ్ భాగస్వామ్యం లేక తంటాలు పడుతుంది. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ తో ఎంతో మంది జత కట్టినా వారు అంతగా విజయవంతం కాలేదు. తాజాగా దానికి పుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. ఇంగ్లండ్ జట్టు సుదీర్ఘ అన్వేషణకు దాదాపు ముగింపు దొరికినట్లుగానే ఉంది. భారత్ తో జరుగుతున్న రాజ్ కోట్ టెస్టు ద్వారా ఇంగ్లండ్ జట్టులో అరంగేట్రం చేసిన హసీబ్ హమీద్.. అలెస్టర్ కుక్ సరైన జోడి అవుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత లేకపోయినా, హమీద్ ఆడిన ఇన్నింగ్స్ తో ఒక అంచనాకు వచ్చారు. తొలి ఇన్నింగ్స్ లో 82 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసిన హమీద్.. రెండో ఇన్నింగ్స్ లో మరింత ఆకట్టుకున్నాడు. 177 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 82 పరుగులు చేశాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లోనే రాణించిన హమీద్.. ఇంగ్లండ్ భవిష్య ఆశాకిరణంగా పేర్కొంటున్నారు. అలెస్టర్ కుక్ కు 10వ భాగస్వామిగా తెరపైకి వచ్చిన ఈ 19 ఏళ్ల హమీద్‌ను ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్ కాట్ తో పోలుస్తున్నారు. అతని బ్యాటింగ్ శైలి బాయ్ కాట్ ను పోలి ఉండటంతో హమీద్ ను బేబీ బాయ్ కాట్ గా పిలుచుకుంటున్నారు. సచిన్ స్ఫూర్తితోనే.. భారత్ తో బుధవారం ఆరంభమైన తొలి టెస్టు ద్వారా హసీబ్ హమిద్ అంతర్జాతీయ కెరీర్ ను ఆరంభించాడు. అయితే భారత్ మూలాలున్న ఈ క్రికెటర్ కు మాస్టర్ బ్లాస్టర్ సచినే స్ఫూర్తి అట. 2004లో ముంబైకు వచ్చినప్పుడు ఎంఐజీ క్లబ్లో సచిన్‌ను తొలిసారి చూశాడట. అప్పుడే సచిన్ గురించి అడిగి తెలుసుకున్న హమిద్.. తాను కూడా ఏదొక రోజు ఇంగ్లండ్ జట్టుకు ఆడాలని భావించినట్లు అతని తండ్రి ఇస్మాయిల్ హమీద్ తెలిపాడు. ఆ సమయంలో సచిన్ గురించి అడగ్గా, అతనొక ప్రపంచం గర్వించే ఆటగాడని చెప్పినట్లు తెలిపాడు. ఈ రోజు కుమారుడు ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్‌గా వెళుతున్నప్పుడు తాను ఒకింత ఉద్వేగానికి లోనైనట్లు హసిబ్ తండ్రి పేర్కొన్నాడు. క్రీజ్‌లోకి వెళ్లి కుమారుడు కుదురుకున్నాక కానీ తన మనసులో ఆందోళన తగ్గలేదన్నాడు. అయితే హమిద్ కుటుంబం ఏనాడో భారత్ నుంచి ఇంగ్లండ్ కు వెళ్లిపోయింది. గుజరాత్ నుంచి ఇంగ్లండ్‌కు వలస వెళ్లి అక్కడ పౌరసత్వాన్ని పొందింది. అయితే కుమారున్ని క్రికెటర్ గా చూడాలని తండ్రికి కోరిక ఉండటంతో అతన్ని అదే దిశలో నడిపించాడు. ఈ క్రమంలోనే అక్కడ లీగ్‌ల్లో అనేక మ్యాచ్‌లు ఆడిన హమీద్.. ఈ సీజన్ లో లాంక్ షైర్ తరపున ఆడి తన సత్తా చాటుకున్నాడు. 16 మ్యాచ్‌ల్లో 49.91 సగటుతో 1,198 పరుగులు చేశాడు. ప్రత్యేకంగా యార్క్‌షైర్‌పై అతను సాధించిన పలు సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. ఇదే హమిద్ అత్యంత చిన్నవయసులో ఇంగ్లండ్ తరపున ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మరొకవైపు ఇంగ్లండ్ తరపున పిన్న వయసులో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన రెండో క్రికెటర్ హమీద్. -
బేబీ బాయ్ కాట్‌కు సచినే స్ఫూర్తి!
ముంబై: నిన్న ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విపరీతమైన ఆసక్తిని రేపితే... క్రికెటర్ హసీబ్ హమీద్ అంతర్జాతీయ అరంగేట్రంపై అతని కుటుంబం అదే స్థాయిలో ఎదురుచూసింది. భారత్ తో రాజ్‌కోట్‌లో బుధవారం ఆరంభమైన తొలి టెస్టు ద్వారా హసీబ్ హమిద్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే భారత్ మూలాలున్న ఈ క్రికెటర్ కు మాస్టర్ బ్లాస్టర్ సచినే స్ఫూర్తి అట. 2004లో ముంబైకు వచ్చినప్పుడు ఎంఐజీ క్లబ్లో సచిన్‌ను తొలిసారి చూశాడట. అప్పుడే సచిన్ గురించి అడిగి తెలుసుకున్న హమిద్.. తాను కూడా ఏదొక రోజు ఇంగ్లండ్ జట్టుకు ఆడాలని భావించినట్లు అతని తండ్రి ఇస్మాయిల్ హమీద్ తెలిపాడు. ఆ సమయంలో సచిన్ గురించి అడగ్గా, అతనొక ప్రపంచం గర్వించే ఆటగాడని చెప్పినట్లు తెలిపాడు. ఈ రోజు కుమారుడు ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్‌గా వెళుతున్నప్పుడు తాను ఒకింత ఉద్వేగానికి లోనైనట్లు హసిబ్ తండ్రి పేర్కొన్నాడు. క్రీజ్‌లోకి వెళ్లి కుమారుడు కుదురుకున్నాక కానీ తన మనసులో ఆందోళన తగ్గలేదన్నాడు. అయితే హమిద్ కుటుంబం ఏనాడో భారత్ నుంచి ఇంగ్లండ్ కు వెళ్లిపోయింది. గుజరాత్ నుంచి ఇంగ్లండ్‌కు వలస వెళ్లి అక్కడ పౌరసత్వాన్ని పొందింది. అయితే కుమారున్ని క్రికెటర్ గా చూడాలని తండ్రికి కోరిక ఉండటంతో అతన్ని అదే దిశలో నడిపించాడు. ఈ క్రమంలోనే అక్కడ లీగ్‌ల్లో అనేక మ్యాచ్‌లు ఆడిన హమీద్.. ఈ సీజన్ లో లాంక్ షైర్ తరపున ఆడి తన సత్తా చాటుకున్నాడు. 16 మ్యాచ్‌ల్లో 49.91 సగటుతో 1,198 పరుగులు చేశాడు. ప్రత్యేకంగా యార్క్‌షైర్‌పై అతను సాధించిన పలు సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. ఇదే హమిద్ అత్యంత చిన్నవయసులో ఇంగ్లండ్ తరపున ఓపెనర్‌గా అరంగేట్రం చేయడానికి దోహదం చేసింది. ఆ క్రికెటర్ బ్యాటింగ్ శైలి దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్‌కాట్‌ను పోలి ఉండటంతో హమీద్‌ను బేబీ బాయ్కాట్గా ముద్దుగా పిలుచుకుంటారు. భారత్ తో తొలి ఇన్నింగ్స్ లో హమీద్ 82 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేశాడు.