బేబీ బాయ్ కాట్కు సచినే స్ఫూర్తి! | Sachin's net session in 2004 inspired Haseeb | Sakshi
Sakshi News home page

బేబీ బాయ్ కాట్కు సచినే స్ఫూర్తి!

Published Thu, Nov 10 2016 3:00 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

బేబీ బాయ్ కాట్కు సచినే స్ఫూర్తి!

బేబీ బాయ్ కాట్కు సచినే స్ఫూర్తి!

ముంబై: నిన్న ప్రపంచ వ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విపరీతమైన ఆసక్తిని రేపితే... క్రికెటర్ హసీబ్ హమీద్ అంతర్జాతీయ అరంగేట్రంపై అతని కుటుంబం అదే స్థాయిలో ఎదురుచూసింది. భారత్ తో రాజ్కోట్లో బుధవారం ఆరంభమైన తొలి టెస్టు ద్వారా హసీబ్  హమిద్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అయితే భారత్ మూలాలున్న ఈ క్రికెటర్ కు మాస్టర్ బ్లాస్టర్ సచినే స్ఫూర్తి అట. 2004లో ముంబైకు వచ్చినప్పుడు ఎంఐజీ క్లబ్లో సచిన్ను తొలిసారి చూశాడట.

అప్పుడే సచిన్ గురించి అడిగి తెలుసుకున్న హమిద్.. తాను కూడా ఏదొక రోజు ఇంగ్లండ్ జట్టుకు ఆడాలని భావించినట్లు అతని తండ్రి ఇస్మాయిల్ హమీద్ తెలిపాడు. ఆ సమయంలో సచిన్ గురించి అడగ్గా, అతనొక ప్రపంచం గర్వించే ఆటగాడని చెప్పినట్లు తెలిపాడు. ఈ రోజు కుమారుడు ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్గా వెళుతున్నప్పుడు తాను ఒకింత ఉద్వేగానికి లోనైనట్లు హసిబ్ తండ్రి పేర్కొన్నాడు. క్రీజ్లోకి వెళ్లి కుమారుడు కుదురుకున్నాక కానీ తన మనసులో ఆందోళన తగ్గలేదన్నాడు.

అయితే హమిద్  కుటుంబం ఏనాడో భారత్ నుంచి ఇంగ్లండ్ కు వెళ్లిపోయింది. గుజరాత్ నుంచి ఇంగ్లండ్కు వలస వెళ్లి అక్కడ పౌరసత్వాన్ని పొందింది.  అయితే కుమారున్ని క్రికెటర్ గా చూడాలని తండ్రికి  కోరిక ఉండటంతో అతన్ని అదే దిశలో నడిపించాడు. ఈ క్రమంలోనే అక్కడ లీగ్ల్లో అనేక మ్యాచ్లు ఆడిన హమీద్.. ఈ సీజన్ లో లాంక్ షైర్ తరపున ఆడి తన సత్తా చాటుకున్నాడు. 16 మ్యాచ్ల్లో 49.91 సగటుతో 1,198 పరుగులు చేశాడు.  ప్రత్యేకంగా యార్క్షైర్పై అతను సాధించిన పలు సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. ఇదే  హమిద్ అత్యంత చిన్నవయసులో  ఇంగ్లండ్ తరపున ఓపెనర్గా అరంగేట్రం చేయడానికి దోహదం చేసింది. ఆ క్రికెటర్ బ్యాటింగ్ శైలి దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్కాట్ను పోలి ఉండటంతో హమీద్ను బేబీ బాయ్కాట్గా ముద్దుగా పిలుచుకుంటారు.  భారత్ తో  తొలి ఇన్నింగ్స్ లో హమీద్ 82 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement