లండన్: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మూడో రోజు లంచ్ విరామం ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి వచ్చిన జార్వో అనే ఒక అభిమాని టీమిండియా ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు. ‘బైజూస్’ లోగో సహా సరిగ్గా భారత జట్టును పోలిన జెర్సీని అతను ధరించడంతో ముందుగా ఎవరూ గుర్తించలేకపోయారు.
— Ravi_cricfreak (@ravi_cricfreak) August 14, 2021
అయితే ఆ తర్వాత తేరుకున్న భద్రతా సిబ్బంది అతడి వద్దకు వెళ్లి బయటకు పంపే ప్రయత్నం చేస్తుండగా... తన జెర్సీని చూపిస్తూ నేనూ భారత ఆటగాడినే అన్నట్లుగా సైగ చేస్తూ దాదాపుగా సిబ్బందిని ఒప్పించినంతగా ప్రయత్నించాడు. చివరకు అతడిని మైదానం బయటకు లాక్కుపోతుండగా భారత బృందంలో నవ్వులు విరిశాయి. తొలి సెషన్‌లో భారత బౌలింగ్ విఫలమవడం చూసి సోషల్ మీడియాలో కొందరు కోహ్లి... ‘జార్వోతో రెండు ఓవర్లు బౌలింగ్ చేయించాల్సింది’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు విసరడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment