లార్డ్స్ : మొన్ననే విశ్వవిజేతకు ముచ్చెమటలు పట్టించి అందరి మన్ననలు పొందిన ఐర్లాండ్.. నేడు దారుణ ప్రదర్శనతో అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగురోజుల టెస్ట్‌లో తొలి రోజు అతిథ్య జట్టును 85 పరుగులకే కుప్పకూల్చి ఔరా అనిపించింది. బ్యాటింగ్‌లో 207 పరుగులతో ఫర్వాలేదనిపించింది. కానీ తొలి రోజు రెచ్చిపోయిన ఐర్లాండ్ బౌలర్లు రెండో రోజు పట్టు విడిచారు. తొలి ఇన్నింగ్స్‌లో దెబ్బతిని తీవ్ర అవమానానికి గురైన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జూలు విధిల్చారు.
రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులు చేసి 182 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. అయితే తొలి రోజు ఐర్లాండ్ ఆటను చూసిన వారందరికీ ఈ లక్ష్యం అంత పెద్దదేం కాదనిపించింది. ఐర్లాండ్ చరిత్ర సృష్టిస్తోందని, కనీసం గట్టిపోటీనైనా ఇస్తుందనిపించింది. కానీ ప్చ్.. కేవలం 35 పరుగులకే ఆలౌటై అందరినీ నిరాశపరిచింది. 15.4 ఓవర్లలోనే చాపచుట్టేయడం గమనార్హం. దీంతో ఆతిథ్య జట్టు 143 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 6 వికెట్లతో చెలరేగగా.. స్టువర్ట్ బ్రాడ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో జేమ్స్ మెక్‌కలమ్ (11) ఒక్కడే రెండంకలే స్కోర్ చేయడం గమనార్హం. ఇక అంతర్జాతీయ టెస్ట్‌ల్లో ఇది ఏడో అత్యల్ప స్కోర్‌గా నమోదుకాగా.. ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్న మూడో దేశంగా ఐర్లాండ్ నిలిచింది.
26 న్యూజిలాండ్- ఇంగ్లండ్ 1955
30 దక్షిణాఫ్రి- ఇంగ్లండ్ 1896
30 దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్ 1924
35 దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ 1899
36 దక్షిణాఫ్రికా- ఇంగ్లండ్ 1902
36 దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా 1932
38 ఐర్లాండ్ -ఇంగ్లండ్ 2019
Comments
Please login to add a commentAdd a comment