ధోనిని తలపించిన అర్జున్‌! | Arjun Tendulkar does an MS Dhoni | Sakshi
Sakshi News home page

ధోనిని తలపించిన అర్జున్‌!

Published Mon, Aug 13 2018 11:16 AM | Last Updated on Mon, Aug 13 2018 3:30 PM

Arjun Tendulkar does an MS Dhoni - Sakshi

ఆనాటి ఫొటోలను, వీడియోలను ట్వీట్ చేస్తూ.. ధోనికి, అర్జున్ టెండుల్కర్‌కు నెటిజన్లు ముడిపెడుతున్నారు.

లండన్‌: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఇంగ్లండ్ టూర్‌లో బిజీబిజీగా ఉన్నాడు. ఒకరోజు నెట్స్ లో భారత బ్యాట్స్‌మెన్లకు బౌలింగ్ వేస్తే.. రెండో టెస్టు రెండో రోజు స్టేడియం బయట రేడియోలు అమ్ముతూ కనిపించాడు.

అయితే లార్డ్స్ టెస్ట్‌ మూడో రోజు ఆటలో అర్జున్ టెండూల్కర్‌ కాసేపు విరామం తీసుకున్నాడు. బౌండరీ లైన్ అవతల ఫీల్డ్ పై పడుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలోవైరల్ అవుతున్నాయి. ఇది టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని తలపించిందంటున్నారు నెటిజన్లు. 2017నాటి శ్రీలంక టూర్‌లో ఎంఎస్‌ ధోని కూడా ఇలాగే నేలపై కునుకు తీశాడు. ప్రేక్షకులు వాటర్ బాటిళ్లు విసిరి... అల్లరి చేస్తుంటే ఆటకు అంతరాయం కలిగింది. ఆ గ్యాప్‌లో ధోనీ నేలపై పడుకుని చిన్నపాటి కునుకు తీశాడు. ఆనాటి ఫొటోలను, వీడియోలను ట్వీట్ చేస్తూ.. ధోనికి, అర్జున్ టెండుల్కర్‌కు నెటిజన్లు ముడిపెడుతున్నారు.

చదవండి: మైదానంలో నిద్రపోయిన ధోని!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement