ప్రపంచకప్ సమరం మొదలైందో లేదో అప్పుడే ప్రేక్షకులకు కావాల్సిన మజా దొరుకుతుంది. కళ్లు చెదిరే క్యాచ్‌లు.. ఔరా అనిపించే బౌండరీలు.. నోరెళ్లబెట్టే బంతులు.. ఆరంభ మ్యాచ్‌లోనే క్రికెట్ ప్రపంచాన్ని రంజింపచేశాయి. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అద్భుత ప్రదర్శనతో సఫారీల ఓటమిని శాసించాడు.