ఆ బంతికి బిత్తరపోయిన కోహ్లి | Virat Kohli Says Stunned by Rashid Ball | Sakshi
Sakshi News home page

Jul 18 2018 9:32 AM | Updated on Jul 18 2018 11:01 AM

Virat Kohli Says Stunned by Rashid Ball - Sakshi

విరాట్‌ కోహ్లి

లీడ్స్‌: సుధీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత్‌కు ఇంగ్లండ్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో 8 వికెట్ల తేడాతో నెగ్గి ఇంగ్లండ్‌ సిరీస్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ బంతికి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి షాక్‌కు గురయ్యాడు. ఈ విషయం మ్యాచ్‌ అనంతరం అతనే తెలిపాడు. 

ఓ వైపు వికెట్లు పడుతున్నా కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని దూకుడు మీద ఉన్నాడు. ఈ దశలో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ స్పెల్‌ టీమిండియాను దెబ్బ తీసింది. ముందుగా కార్తీక్‌ను బౌల్డ్‌ చేసిన రషీద్‌ ఇన్నింగ్స్‌ 31వ ఓవర్లో చెలరేగాడు. అతను వేసిన అద్భుతమైన లెగ్‌ బ్రేక్‌ కోహ్లి బ్యాట్‌ను ఛేదించి వికెట్లను కూల్చింది. అనూహ్యమైన ఈ బంతికి బిత్తరపోయిన కోహ్లి కొద్దిసేపు పిచ్‌ను, బౌలర్‌ను చూస్తూ షాక్‌లో నిలిచిపోయాడు! అదే ఓవర్‌ చివరి బంతికి రైనా (1) కూడా ఔట్‌ కావడంతో భారత్‌ కష్టాలు పెరిగాయి. దీంతో భారత​స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ప్రస్తుతం కోహ్లి వికెట్‌ వీడియో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. 

చదవండి: సిరీస్‌ పోయింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement