విరాట్ కోహ్లి, ఆర్‌సీబీ మాజీ కెప్టెన్(ఐపీఎల్ 2021)
ఐపీఎల్ 15వ సీజన్‌కు ఇంకా 25 రోజులే మిగిలి ఉంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ మే 29 వరకు జరగనుంది. కాగా ఆర్‌సీబీ ఇంతవరకు జట్టు కెప్టెన్ ఎవరనేది ప్రకటించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అన్ని జట్లు తమ కెప్టెన్ ఎవరనేది దాదాపు ప్రకటించేశాయి. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి తదుపరి కెప్టెన్సీ ఎవరనే దానిపై ఆర్‌సీబీ నాన్చుతూనే వస్తుంది. మెగావేలానికి ముందు ఆర్‌సీబీ కోహ్లితో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను రిటైన్ చేసుకుంది.
గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆర్‌సీబీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆర్‌సీబీ స్పందించలేదు. ఆ తర్వాత జరిగిన మెగావేలంలో ఆర్‌సీబీ డుప్లెసిస్, దినేష్ కార్తిక్ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. డుప్లెసిస్, దినేష్ కార్తిక్‌లకు గతంలో కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. దీంతో ఈ ఇద్దరిలో ఆర్‌సీబీ ఎవరో ఒకరిని కెప్టెన్ చేస్తుందని అంతా భావించారు. ఈ విషయంలోనూ ఆర్‌సీబీ తన నిర్ణయాన్ని వెల్లడించకపోవడంతో అసలు ఫ్రాంచైజీ వైఖరి ఏంటనేది ఎవరికి అంతుచిక్కడం లేదు.
ఇక పాకిస్తాన్‌తో సిరీస్ ఉండడంతో మ్యాక్స్‌వెల్ ఆరంభ పోటీలకు దూరంగా ఉండనున్నాడు. దీంతో మ్యాక్సీ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నట్లే. ఇక కార్తిక్, డుప్లెసిస్‌లలో ఎవరో ఒకరు ఆర్‌సీబీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీసారి ఐపీఎల్‌లో మంచి అంచనాలతో బరిలోకి దిగే ఆర్‌సీబీ బరిలోకి దిగాకా నిరాశపరుస్తుంది. మరి ఈసారైనా ఐపీఎల్ కప్పు కొడుతుందో లేక మరోసారి చతికిలపడుతుందో చూడాలి.
చదవండి: Russia-Ukraine Crisis: దేశం కోసం కీలక మ్యాచ్‌ను వదిలేసుకున్న టెన్నిస్ స్టార్
IPL 2022: గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం
Comments
Please login to add a commentAdd a comment