
Ajinkya Rahane May Lead Team India In Test Series.. టి20 ప్రపంచకప్ 2021లో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ టోర్నీ పూర్తవ్వగానే టీమిండియాతో సిరీస్ ఆడనుంది. అలా ప్రపంచకప్ ఫైనల్ ముగస్తుందో లేదో.. నవంబర్ 17 నుంచి టీమిండియా, న్యూజిలాండ్ మధ్య టి20 సిరీస్ మొదలుకానుంది. టి20 కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోవడంతో ఆ బాధ్యతలు రోహిత్ శర్మకు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. ఈ టి20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు కోహ్లి రెస్ట్ తీసుకోనున్నాడు. దీంతో తొలి టెస్టు బాధ్యతలు రోహిత్‌కే ఇస్తారని వార్తలు వచ్చాయి. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రహానే విఫలం కావడంతో రోహిత్‌వైపే మొగ్గుచూపినట్లు తెలిసింది.
చదవండి: Rohit Sharma: టీ20కి ఓకే.. మరి టెస్టు కెప్టెన్‌గా రోహిత్ లేదంటే రహానే? బీసీసీఐ మల్లగుల్లాలు!
కానీ ఆ వార్తల్లో నిజం లేదని.. తాజాగా అందిన సమాచారం ప్రకారం రోహిత్ శర్మకు న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. వరుస సిరీస్‌లతో రోహిత్ అలసటకు గురికాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. రోహిత్‌తో పాటు షమీ, బుమ్రా, శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్‌లకు కూడా విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ స్థానంలో తొలి టెస్టుకు అజింక్యా రహానేకే నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ తొలి టెస్టు తర్వాత కూడా కోహ్లి రాకపోతే మాత్రం రహానేకు కివీస్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిస్థాయి కెప్టెన్ బాధ్యతలు అప్పజెప్పాలనే ప్రతిపాధన కూడా బీసీసీఐకి ఉన్నట్లు సమాచారం.
గతేడాది ఆసీస్ పర్యటనలో విరాట్ కోహ్లి తొలి టెస్టు అనంతరం స్వదేశానికి తిరిగి రావడంతో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రహానే జట్టును విజయపథంలో నడిపించాడు. ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి చారిత్రక టెస్టు సిరీస్‌ను గెలడంలో కెప్టెన్‌గా రహానే కీలకపాత్ర పోషించాడు. అయితే ఇప్పటికైతే ఈ విషయంపై స్పష్టత లేకపోయినప్పటికి వచ్చే శుక్రవారం టెస్టు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం తొలి టెస్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. టి20 సిరీస్ ముగిసిన అనంతరం ఇరు జట్ల మధ్య నవంబర్ 25-29 వరకు కాన్పూర్ వేదికగా తొలి టెస్టు, డిసెంబర్ 3-7 వరకు ముంబై వేదికగా రెండో టెస్టు జరగనుంది.
చదవండి: T20 WC 2021: ఐదు లక్షణాలు పక్కాగా.. ఈసారి న్యూజిలాండ్‌దే కప్