
కోహ్లి, ధోనిలను పోల్చకండి: కిర్‌స్టెన్
కెప్టెన్సీ విషయంలో ధోని, కోహ్లిలను పోల్చవద్దని భారత జట్టు మాజీ కోచ్ కిర్‌స్టెన్ సూచించారు. ఇద్దరూ భిన్నమైన వ్యక్తులని, ఆలోచనా ధోరణి కూడా వేరుగా ఉంటుందని, ఎవరికి వారే గొప్ప కెప్టెన్ అంటూ ప్రశంసించారు. ‘కెప్టెన్‌గా ధోని సహచరులకు ఆదర్శంగా నిలుస్తాడు. కోహ్లి జట్టులో స్ఫూర్తిని పెంచుతాడు. ఇద్దరూ గొప్ప నాయకులే’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కిర్‌స్టెన్ రాజస్తాన్ క్రికెట్ అకాడమీలో పది రోజుల పాటు ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నారు.