
Guatam Gambhir Prediction Successfull First Time.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఫైనల్లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే మ్యాచ్‌కు ముందు మాజీ ఆటగాళ్లు ఎవరు ఫెవరెట్ అని చెప్పడం చూస్తుంటాం. కొన్నిసార్లు వారి అంచనాలు నిజమైతే.. మరికొన్నిసార్లు తప్పాయి. టి20 ప్రపంచకప్ 2021లో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఏ జట్టు గెలుస్తుందని అంచనా వేసిన ప్రతీసారి అతనికి ఎదురుదెబ్బే తగిలింది.
చదవండి: ఆ క్యాచ్ వదిలేయడం మా కొంప ముంచింది.. ఒక్క చిన్న తప్పు
టీమిండియా- పాకిస్తాన్, న్యూజిలాండ్- టీమిండియా, పాకిస్తాన్-న్యూజిలాండ్, ఇక తొలి సెమీఫైనల్ ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్.. ఇలా ఏది చూసుకున్నా అతను గెలుస్తుందని చెప్పిన ప్రతీ టీమ్ ఓడిపోతూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం గంభీర్ కల నెరవేరింది. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధిస్తుందని.. ఫైనల్ ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతుందని గంభీర్ అంచనా వేశాడు. అతను అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో అభిమానులు గంభీర్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. మొత్తానికి గంభీర్ అనుకున్నది సాధించాడు.. ఆర్య సినిమాలో బన్నీ క్లైమాక్స్‌లో తన లవ్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది కోక్ బాటిల్‌లో రాయి వేసి పరీక్షించినట్టుగా గంభీర్‌లా మార్పింగ్ చేసి పెట్టిన ఫోటో తెగ వైరల్ అవుతుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.
Comments
Please login to add a commentAdd a comment