
Mohammad Rizwan First Batsman Complete 1000 Runs One Year T20I Histrory.. పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టి20 ప్రపంచకప్ 2021లో రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నాడు. ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో చోటు సంపాదించిన రిజ్వాన్ మరో రికార్డుతో మెరిశాడు. తాజాగా ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్‌లో అర్థశతకంతో మెరిశాడు. తనశైలికి విరుద్దంగా ఆడిన రిజ్వాన్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 67 పరుగుల చేశాడు.
ఈ నేపథ్యంలో రిజ్వాన్ ఒక మైలురాయిని చేరుకున్నాడు. టి20 చరిత్రలో ఒక ఏడాదిలో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా మహ్మద్ రిజ్వాన్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా మహ్మద్ రిజ్వాన్ 49 టి20ల్లో 1367 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment