T20 World Cup 2021: Hardik Pandya Says Thanks Fans for Constant Faith and Support: టీ20 ప్రపంచకప్-2021 నుంచి భారత జట్టు నిష్క్రమించిన తర్వాత తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు హార్ధిక్ పాండ్యా కృతజ్ఞతలు తెలిపాడు. మా పై మీరు పెట్టుకున్న నమ్మకానికి మరిన్ని రెట్లు మా జట్టు కష్టపడతుందని హార్ధిక్ తెలిపాడు. కాగా ఈ మెగా టోర్నీలో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది.
మరో వైపు ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ చేతిలో భారత్ తొలి సారిగా ఓటమి చెంది ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది. కాగా భారత జట్టు ఐసీసీ మెగా ఈవెంట్‌లో ట్రోపిని కైవసం చేసుకుని ఎనిమిదేళ్లైంది. దీంతో టీమిండియాపై కొంతమంది విమర్శలు కురిపిస్తుంటే.. మరి కొంత మంది మద్దతుగా నిలుస్తున్నారు.
"టీ20 ప్రపంచకప్‌లో భారత ప్రస్థానం ఇలా ముగిస్తుందని ఊహించలేదు. ఈ టోర్నమెంట్‌లో మేము మా స్ధాయికి తగ్గట్లు ఆడలేకపోయాం. అయినప్పటికీ మాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ ధన్యవాదాలు. మా పై మీరు పెట్టుకున్న నమ్మకానికి మరింత రెట్లు మా జట్టు కష్టపడతుంది" అని హార్ధిక్ ట్విటర్‌లో పేర్కొన్నాడు. కాగా స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
చదవండి: Virat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్ యూ భాయ్!
This wasn’t how we wanted our World Cup campaign to go. We fell short but we will work twice as hard to repay the faith and support shown to us by our fans. Thank you to everyone who cheered us on at the stadiums and everyone back home 🙏 🇮🇳 pic.twitter.com/n8ZnHhEm6H
— hardik pandya (@hardikpandya7) November 9, 2021
Comments
Please login to add a commentAdd a comment