Reason Why New Zeland Proving Worlds Best Team Again And Again.. టి20 ప్రపంచకప్ 2021లో న్యూజిలాండ్ ఇంగ్లండ్‌ను సెమీఫైనల్లో ఓడించి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. 2016 టి20 ప్రపంచకప్‌లో సెమీస్, 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలోనే ఓడిపోయింది. తాజాగా కివీస్ ఇంగ్లండ్‌పై విజయం అందుకోవడంతో పాటు ప్రతీకారం తీర్చుకుంది. అయితే కివీస్‌కు ఇంగ్లండ్‌పై విజయం అంత సులువుగా రాలేదు. కివీస్ ఇన్నింగ్స్‌లో 15వ ఓవర్ వరకు ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. జేమ్స్ నీషమ్ రాకతో ఆట స్వరూపమే మారిపోయింది. ఓపెనర్ డారిల్ మిచెల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన నీషమ్ చివర్లో ఔటైనప్పటికీ మిగతా పనిని మిచెల్ పూర్తి చేశాడు.
కాగా గత మూడేళ్లలో చూసుకుంటే న్యూజిలాండ్ ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. వరుసగా మూడు ఐసీసీ ఫార్మాట్స్‌లో ఫైనల్‌కు చేరడం.. అందులో న్యూజిలాండ్ ఒకసారి విజేతగా నిలవడం జరిగింది. 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్.. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్.. తాజాగా టి20 ప్రపంచకప్ 2021లో ఫైనల్.. ఇలా ఏది చూసుకున్నా ఆ జట్టు కఠోర శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది. కివీస్ జట్టులో ఉండాల్సిన ఐదు లక్షణాలు పక్కాగా ఉండడంతో ఈసారి కివీస్ కప్ కొట్టబోతుందంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. మరి ఆ ఐదు లక్షణాలపై ఒక లుక్కేద్దాం.
చదవండి: T20 WC 2021: వారెవ్వా న్యూజిలాండ్.. దెబ్బకు దెబ్బ తీసింది
అన్ని ఫార్మాట్స్‌లో స్థిరమైన ప్రదర్శన:
ఇటీవలీ కాలంలో న్యూజిలాండ్ అన్ని ఫార్మాట్స్‌లోనూ అదరగొడుతుంది. వరుసగా మూడు ఐసీసీ మేజర్ టోర్నీల్లో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ మరింత బలంగా తయారైంది. 2019 వన్డే వరల్డ్‌కప్‌ను బౌండరీ కౌంట్ ద్వారా తృటిలో ఇంగ్లండ్‌కు చేజార్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం బెబ్బులిలా గర్జించింది. దాని ఫలితమే ఐసీసీ తొలిసారి నిర్వహించిన టెస్టు చాంపియన్‌షిప్‌లో కివీస్ విజేతగా నిలిచింది. ఇక టి20 ప్రపంచకప్ 2021లో సూపర్ 12ను ఓటమితో ఆరంభించినప్పటికీ.. ఆ తర్వాత ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి సెమీస్ చేరుకుంది. ఇక ఇంగ్లండ్‌పై నెగ్గి ఫైనల్లో ప్రవేశించిన కివీస్ కప్ కొట్టడానికి ఒక్క అడుగుదూరంలో నిలిచింది.
చదవండి: Eng Vs Nz: ఆ రెండు జట్లే మమ్మల్ని ఓడించగలవు..
బెస్ట్ ఫీల్డింగ్ :
క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డింగ్ అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది బ్లాక్‌క్యాప్స్. తమ అద్భుత ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్లకు పొదుపుగా పరుగులు ఇవ్వడం కివీస్‌కు బాగా అలవాటు. కేన్ విలియమ్సన్, మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, డెవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వరల్డ్‌క్లాస్ ఫీల్డర్స్ ఉండడం ఆ జట్టుకు బలంగా మారింది. ఇక అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ సందర్భంగా డారిల్ మిచెల్ చేసిన ఫీట్ కొంతకాలం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. ఇక టోర్నీలో సూపర్‌క్యాచ్‌లు ఎక్కువగా అందుకున్న జాబితాలో కివీస్ ప్లేయర్లు ఎక్కువగా ఉండడం విశేషం.
బెస్ట్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్:
న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ ఉండడం ఆ జట్టుకు సగం బలం అని చెప్పొచ్చు. కేన్ మామ కెప్టెన్‌గా వచ్చిన తర్వాత న్యూజిలాండ్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఇక ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ అనే దానికి న్యూజిలాండ్ పూర్తిగా వ్యతిరేకం. కేన్ విలియమ్సన్‌ను అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన కివీస్ బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్ తర్వాత కెప్టెన్‌గా ఎంపికైన కేన్ విలియమ్సన్ 2019 వన్డే వరల్డ్‌కప్‌లో జట్టును ఫైనల్ చేర్చాడు. ఆ తర్వాత తన కూల్ కెప్టెన్సీతో జట్టును నడిపిస్తూ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌లో తొలిసారి విజేతగా నిలిపాడు. ఇక ప్రస్తుతం టి20 ప్రపంచకప్ సాధించాలన్న కేన్ మామ కోరిక నెరవేరాలని కోరుకుందాం.
చదవండి: T20 WC 2021 ENG vs NZ Semi Final-1: మిచెల్ మెరుపులు.. ఫైనల్‌కు తొలిసారిగా న్యూజిలాండ్
బెస్ట్ బౌలింగ్ యూనిట్:
ప్రస్తుతం న్యూజిలాండ్ బౌలింగ్ లైనఫ్ బలంగా తయారైంది. సౌథీ, ట్రెంట్ బౌల్ట్ లాంటి సీనియర్ ఆటగాళ్లకు తోడూ నీల్ వాగ్నర్ జత కావడంతో బౌలింగ్ విభాగం బలంగా తయారైంది. ఇక ఇష్ సోధీ, మిచెల్ సాంట్నర్‌లు అంచనాలుకు మించి రాణించడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. కైల్ జేమిసన్, లోకీ ఫెర్గూసన్ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉండడం న్యూజిలాండ్‌కు మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఫైనల్లో ఈ బౌలింగ్ యూనిట్ మెరిస్తే న్యూజిలాండ్ కప్ కొట్టడం ఖాయం.
అందరూ మెచ్చుకునే టీమ్.. వివాదాలకు దూరంగా
కేన్ విలియమ్సన్ లాంటి కూల్ కెప్టెన్ ఉన్నంతకాలం న్యూజిలాండ్ జట్టులో గొడవలు రావు.. వివాదాలు జోలికి వెళ్లరు. క్రికెట్ ప్రపంచంలో క్లీన్ జట్టు అని న్యూజిలాండ్‌కు కొన్ని దశాబ్దాల నుంచి పేరు ఉంది. ఆ జట్టు మ్యాచ్ ఓడినా.. గెలిచినా.. తమ సంతోషాన్ని, భావోద్వేగాలను ఒకేరీతిలో వ్యక్తపరుస్తుంది. అనవసర గొడవలకు పోకుండా తమ పనేదో అని చూసుకుంటుంది. ఇక జట్టుగా కలిసికట్టుగా ఆడే న్యూజిలాండ్ ప్రతీ మ్యాచ్‌లోనూ చిరునవ్వుతోనే బరిలోకి దిగడం వారికున్న ప్రత్యేకత. ఈ అంశం వారిని క్రికెట్‌లో మంచి పేరు ఉండేలా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment