T20 World Cup 2021: Yuvraj Singh Posts Hilarious Memes Him And Virat Kohli - Sakshi
Sakshi News home page

Yuvraj Singh-Anushka Sharma: 'యువీ నువ్వుంటే బాగుండేది'': కోహ్లి.. అనుష్క రియాక్షన్‌ వైరల్‌

Published Sat, Nov 13 2021 4:58 PM | Last Updated on Sat, Nov 13 2021 6:49 PM

T20 World Cup 2021: Yuvraj Singh Posts Hilarious Meme Him And Virat Kohli - Sakshi

టీమిండియా డాషింగ్‌ ఆల్‌రౌండర్‌గా యువరాజ్‌ సింగ్‌ సేవలు ఎప్పటికి మరిచిపోము. తొలి టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం ఎప్పుడు మరిచిపోలేము. అంతేకాదు టీమిండియా తొలి టి20 ప్రపంచకప్‌ను ఎగురేసుకుపోవడంలో యువీ పాత్ర మరువలేనిది. వీటితో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్‌ సాధించడంలోనూ యువరాజ్‌ ముఖ్యపాత్ర పోషించాడు. ఆ తర్వాత క్యాన్సర్‌ బారీన పడి కోలుకున్న అతను క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక 2019లో యువరాజ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

చదవండి: T20 WC 2021: కోహ్లి.. టాస్‌ కోసం ఏమైనా టిప్స్‌ ఇస్తావా: కేన్‌ విలియమ్సన్‌

 తాజాగా టి20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా సూపర్‌ 12 దశలో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత అభిమాని ఒకరు.. యువరాజ్‌ ఉంటే బాగుండేదని..టీమిండియా మరోసారి ఫైనల్‌ కు వెళ్లేదని.. కోహ్లి యువీ కోసం ఆలోచిస్తున్నట్లుగా ఒక ఫోటోను షేర్‌ చేశాడు. దీనిని యువరాజ్‌ తనదైన శైలిలో ట్రోల్‌ చేశాడు. కోహ్లి యువరాజ్‌ గురించి ఆలోచిస్తుంటే.. పక్కనే ఉన్న అనుష్క కోహ్లి కచ్చితంగా నన్ను కాదని వేరే అమ్మాయిల గురించి ఆలోచిస్తున్నాడనుకొని ఊహిస్తుంది.. ఇదే సమయంలో కోహ్లి మాత్రం.. అరె యార్‌.. యువీ ఈ సమయంలో నువ్వు ఉంటే మిడిలార్డర్‌ మరింత స్ట్రాంగ్‌గా ఉండేది. యువీ నిన్ను చాలా మిస్సవుతున్నాం అంటూ ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. తాజాగా యువీ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక యువీ తన 17 ఏళ్ల కెరీర్‌లో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు చేశాడు. వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌ సెంచరీలు, టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 హాఫ్‌ సెంచరీలు, టి20ల్లో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

చదవండి: T20 Wc 2021: హమ్మయ్య.. మొత్తానికి గంభీర్‌ కల నెరవేరింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement