న్యూజిలాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్‌.. | Bangladesh vs New Zealand: Mahmudul Joy, Najmul Shanto lead Bangladeshs strong response on Day 2 | Sakshi
Sakshi News home page

NZ vs BAN: న్యూజిలాండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన బంగ్లాదేశ్‌..

Published Mon, Jan 3 2022 7:38 AM | Last Updated on Mon, Jan 3 2022 2:45 PM

Bangladesh vs New Zealand:  Mahmudul Joy, Najmul Shanto lead Bangladeshs strong response on Day 2  - Sakshi

మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రెండో రోజు బంగ్లాదేశ్‌ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ముందుగా బంగ్లాదేశ్‌ బౌలర్లు 70 పరుగుల వ్యవధిలో న్యూజిలాండ్‌ చివరి ఐదు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత బ్యాటర్లు నిలకడగా రాణించారు. ఫలితంగా ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 67 ఓవర్లలో 2 వికెట్లకు 175 పరుగులు సాధించింది.

ఓపెనర్‌ మహముదుల్‌ హసన్‌ జాయ్‌ (70 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), వన్‌డౌన్‌ బ్యాటర్‌ నజ్మూల్‌ హొసెన్‌ షాంతో (64; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 258/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ 328 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో షోరిఫుల్‌ ఇస్లాం, మెహదీ హసన్‌ మిరాజ్‌ మూడేసి వికెట్లు తీశారు.

చదవండి: ఇది గెలిస్తే... ప్రపంచాన్నే గెలిచినట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement