ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి అరుదైన ఘనత సాధించిన న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌ను తర్వాత సిరీస్ నుంచే తప్పించారు. బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో అతనికి చోటు దక్కలేదు. ఇది బాధ కలిగించేదే అయినా స్వదేశంలో జరిగే సిరీస్‌లో తమ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌కు చోటు లేదని, ఘనతలను బట్టి కాకుండా టీమ్ అవసరాలను బట్టే ఆటగాళ్లను ఎంపిక చేస్తామని కివీస్ సెలక్టర్లు ప్రకటించారు.
కాగా, ముంబై వేదికగా భారత్‌తో జరిగిన టెస్ట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అజాజ్ పటేల్ 10 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సిరీస్‌కు కెప్టెన్ విలియమ్సన్‌కు సెలక్టర్లు విశ్రాంతిని కల్పించారు. అతడి స్ధానంలో టామ్ లాథమ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
న్యూజిలాండ్ జట్టు: టామ్ లాథమ్ (సి), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వారం), రచిన్ రవీంద్ర, కైల్ జేమీసన్, టిమ్ సౌతీ, నీల్ వాగ్నర్, ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ, డెవాన్ కాన్వే
చదవండి: Ashwin-Steve Smith: 'స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసేందుకు ఆరు నెలలు రీసెర్చ్ చేశా'
Comments
Please login to add a commentAdd a comment