
ఢాకా: కుర్రాళ్ల బౌలింగ్ ప్రదర్శనతో అనూహ్యంగా భారత జట్టు ఆసియాకప్ అండర్–19 టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. తక్కువ స్కోర్ల ఈ మ్యాచ్‌లో మోహిత్ జాంగ్రా (3/25), సిద్ధార్థ్ దేశాయ్ (3/35), హర్‡్ష త్యాగి (2/29) అద్భుతంగా రాణించడంతో సెమీస్‌లో భారత్ 2 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. మొదట భారత్ 49.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (37), అనుజ్ (35), సమీర్ (36), ఆయుశ్ బదోని (28) ఫర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో షరిఫుల్ ఇస్లామ్ 3, మృత్యుంజయ్ చౌదరి, రిషద్, తౌహిద్ తలా 2 వికెట్లు తీశారు.
తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 46.2 ఓవర్లలో 170 పరుగుల వద్ద ఆలౌటైంది. 65 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినా... షమీమ్ (59), అక్బర్ అలీ (45)ల పోరాటంతో కాసేపు గెలుపుదారిలో నడిచింది. అయితే స్పిన్నర్ త్యాగి 139 స్కోరు వద్ద అక్బర్‌ను, 147 పరుగుల వద్ద మృత్యుంజయ్ (2)ను ఔట్ చేసి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పేశాడు. షమీమ్‌ను అజయ్ ఔట్ చేయడంతో బంగ్లాకు ఓటమి ఖాయమైంది. చివరి ఐదు వికెట్లను బంగ్లాదేశ్ 31 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment