ఇంగ్లండ్‌దే టి20 సిరీస్‌ | England beat Pakistan 3rd t20 match series | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌దే టి20 సిరీస్‌

Published Thu, Jul 22 2021 5:54 AM | Last Updated on Thu, Jul 22 2021 5:54 AM

England beat Pakistan 3rd t20 match series - Sakshi

మాంచెస్టర్‌: పాకిస్తాన్‌తో జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ జట్టు 2–1తో సొంతం చేసుకుంది. చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్‌ రిజ్వాన్‌ (57 బంతుల్లో 76 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ 35 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లండ్‌ జట్టు 19.4 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (36 బంతుల్లో 64; 12 ఫోర్లు, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మలాన్‌ (31; 2 ఫోర్లు), మోర్గాన్‌ (12 బంతుల్లో 21; ఫోర్, 2 సిక్స్‌లు) కూడా రాణించారు. పాక్‌ స్పిన్నర్‌ హఫీజ్‌ 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement