ఇంగ్లండ్ ఘనవిజయం | England v Pakistan: Hosts win third Test by 141 runs to take 2-1 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ ఘనవిజయం

Published Mon, Aug 8 2016 2:53 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

ఇంగ్లండ్ ఘనవిజయం

ఇంగ్లండ్ ఘనవిజయం

పాక్‌తో మూడో టెస్టు
బర్మింగ్‌హామ్: పాకిస్తాన్‌తో జరిగిన మూడో టెస్టులోనూ ఇంగ్లండ్ విజయం సాధించింది. చివరి రోజు ఆదివారం 343 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 70.5 ఓవర్లలో 201 పరుగులకే కుప్పకూలింది. దీంతో 141 పరుగులతో ఇంగ్లండ్ నెగ్గి నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించింది. సమీ అస్లాం (70), అజహర్ అలీ (38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అండర్సన్, బ్రాడ్, వోక్స్, ఫిన్, అలీలకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 129 ఓవర్లలో 6 వికెట్లకు 445 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement