ఇంగ్లండ్‌ ఘన విజయం | Pakistan beaten by an innings as England level series | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ ఘన విజయం

Published Mon, Jun 4 2018 5:21 AM | Last Updated on Mon, Jun 4 2018 5:21 AM

Pakistan beaten by an innings as England level series - Sakshi

ట్రోఫీతో పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్, ఇంగ్లండ్‌ సారథి రూట్‌

హెడింగ్లే: పాకిస్తాన్‌తో తొలి టెస్టులో ఎదురైన పరాజయానికి ఇంగ్లండ్‌ బదులు తీర్చుకుంది. రెండో టెస్టులో కేవలం మూడు రోజుల్లోనే విజయాన్ని సొంతం చేసుకొని సిరీస్‌ను 1–1తో ముగించింది. ఆతిథ్య జట్టు పేసర్లు బ్రాడ్‌ (3/28), బెస్‌ (3/33) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో పాక్‌ 134 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బట్లర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... అబ్బాస్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

పాక్‌ బ్యాట్స్‌మెన్‌లో ఇమాముల్‌ హక్‌ (34; 5 ఫోర్లు), ఉస్మాన్‌ (33) ఫర్వాలేదనిపించగా... అజహర్‌ అలీ (11), హరీస్‌ సోహైల్‌ (8), అసద్‌ షఫీక్‌ (5), కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (8), షాదాబ్‌ ఖాన్‌ (4) విఫలమయ్యారు. అంతకుముందు 302/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 363 పరుగులకు ఆలౌటై 189 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది.  సంక్షిప్త స్కోర్లు: పాక్‌ తొలి ఇన్నింగ్స్‌: 174; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 363  (బట్లర్‌ 80, బెస్‌ 49; అష్రఫ్‌ 3/60), పాక్‌ రెండో ఇన్నింగ్స్‌: 134 (ఇమాముల్‌ హక్‌ 34; బ్రాడ్‌ 3/28, బెస్‌ 3/33). 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement