
న్యూఢిల్లీ: వచ్చే నెలలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఫిబ్రవరి 24నుంచి 13 మార్చి వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య 2 టి20 మ్యాచ్‌లు, 5 వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను గురువారం అధికారికంగా ప్రకటించారు. వన్డే ప్రపంచ కప్‌కు ముందు ఈ పోరు జరుగుతుండటంతో ఇరు జట్లు కూడా తమ వరల్డ్ కప్ టీమ్‌ల ఎంపిక, సన్నాహకాల కోసం వన్డే సిరీస్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. షెడ్యూల్‌లో భాగంగా ఫిబ్రవరి 27న విశాఖపట్నంలో రెండో టి20 మ్యాచ్... మార్చి 2న హైదరాబాద్‌లో తొలి వన్డే జరుగుతాయి.