
పాకిస్తాన్ చేరిన చైనా యుద్ధ నౌకలు
మూడు చైనా యుద్ధ నౌకలు చాంగ్ చున్, జింగ్ ఝౌ, చ్యౌ హులు కరాచీ తీరానికి చేరుకున్నాయి.
కరాచీ: చైనా, పాకిస్తాన్‌ల మధ్య సద్భావన పెంపుదల, నేవీ సిబ్బందికి అవగాహన కల్పించే ఉద్దేశంతో మూడు చైనా యుద్ధ నౌకలు చాంగ్ చున్, జింగ్ ఝౌ, చ్యౌ హులు కరాచీ తీరానికి చేరుకున్నాయి. ఇవి నాలుగు రోజులపాటు ఇక్కడ ఉంటాయి. రెండు దేశాలు, వాటి ప్రజల మధ్య పరస్పర నమ్మకం పెంపొందడానికి ఈ నౌకాయాత్ర ఉపయోగపడుతుందని చైనా నేవి అధికారి పేర్కొన్నారు.
రెండు దేశాల నౌకాదళాల మధ్య సహకారం, సమాచార పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ప్రాంతీయ స్థిరత్వం, ప్రపంచ శాంతిని కాపాడేందుకు ఈ నౌకాయాత్ర దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. పాక్‌లోని ప్రధాన ఓడరేవుల్లో కరాచీ ఒకటి కాగా రెండోది గ్వదర్ నౌకాశ్రయం. బలూచిస్తాన్‌లోని గ్వదర్ నౌకాశ్రయం ఇంకా నిర్మాణదశలో ఉంది. చైనా సాయంతో పాక్ దీనిని నిర్మిస్తోంది. చైనా–పాక్ ఆర్థిక కారిడార్‌లో ఈ పోర్టు నిర్మాణం ఓ భాగం.