
శత్రు దేశంలో కోహ్లీ; వైరల్ వీడియో
భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ ‘పాకిస్తాన్‌లో ఉన్నాడంటూ’ సోషల్ మీడియాలో కలకలం రేగింది.
కరాచీ: భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇంగ్లాడ్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఆడుతుండగా, ‘కోహ్లీ పాకిస్తాన్‌లో ఉన్నాడంటూ’ సోషల్ మీడియాలో కలకలం రేగింది. పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన ఓ వ్యక్తి అచ్చం కోహ్లీని పోలిఉండటంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.
ప్రస్తుతం ‘పాకిస్తాన్ కోహ్లీ’గా నెటిజన్లు పిలుస్తోన్న ఆ వ్యక్తి కరాచీలోని ఓ పిజ్జా సెంటర్‌లో పనిచేస్తున్నాడు. పేరు.. షహీద్-ఎ-మిలత్. తనపని తాను చేసుకుంటున్న షహీద్‌ను వీడియోతీసి ‘జస్ట్ పాకిస్తానీ థింగ్స్’ ఫేస్‌బుక్ పేజీలో అప్‌లోడ్‌చేశారు. కోహ్లీ అంటే పాకిస్తాన్‌లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ‘శత్రు దేశంలో కోహ్లీ..’ అంటూ భారత అభిమానులు సరదాగా కామెంట్ చేశారు.
ప్రస్తుత చాంపియన్స ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ జట్లు రెండూ సెమీస్‌లోకి అడుగుపెట్టాయి. జూన్ 14న పాక్-ఇంగ్లాడ్‌తో తలపడనుండగా, జూన్ 15న ఇండియా- బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ దాయాది జట్లే గెలిస్తే ఆదివారం జరగనున్న ఫైనల్స్ మరింత రసవత్తరంగా సాగుతుందనడంలో సందేహంలేదు. చాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్‌ను భారీ తేడాతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే.