ఘోర రైలు ప్రమాదం: 15 మంది మృతి | 15 killed, 40 injured as trains collide in Pakistan | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 3 2016 12:16 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గడ్డాఫి పట్టణం లంధి ప్రాంతంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తప్పుడు సిగ్నల్ కారణంగా ఫరీద్ ఎక్స్‌ప్రెస్, జకారియా ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో జకారియా ఎక్స్‌ప్రెస్ మూడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement