
ఘోర రైలు ప్రమాదం..
కరాచి: పాకిస్తాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. గడ్డాఫి పట్టణం లంధి ప్రాంతంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తప్పుడు సిగ్నల్ కారణంగా ఫరీద్ ఎక్స్‌ప్రెస్, జకారియా ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో జకారియా ఎక్స్‌ప్రెస్ మూడు బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
గాయపడిన వారిని సహాయక బృందాలు సమీపంలోని జిన్నా, అబ్బాసీ ఆసుపత్రులకు తరలించాయి. సెప్టెంబర్‌లో పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 150 మంది గాయపడిన విషయం తెలిసిందే.