
పట్టపగలే దౌత్యవేత కాల్చివేత!
పట్టపగలే అఫ్గానిస్థాన్ దౌత్యవేతను కాల్చిచంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీలో పట్టపగలే అఫ్గానిస్థాన్ దౌత్యవేతను కాల్చిచంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కరాచీలో ఉన్న అఫ్గానిస్థాన్ రాయబార కార్యాలయంలో థర్డ్ సెక్రటరీగా పనిచేస్తున్న జకీ అదూను సోమవారం ప్రైవేటు గార్డు కాల్చిచంపాడు. వెంటనే నిందితుడైన గార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వ్యక్తిగత గొడవలతోనే హయాతుల్లా అనే గార్డు దౌత్యవేతను కాల్చిచంపినట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ హత్య వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు అధికారి షకిబ్ ఇస్మాయిల్ తెలిపారు. దౌత్యవేత్తను చంపిన గార్డు కూడా అఫ్గాన్ పౌరుడేనని తెలిపారు. ఇది ఉగ్రవాద ఘటన అయి ఉండకపోవచ్చునని, ప్రస్తుతం అఫ్ఘాన్ దౌత్యకార్యాలయం వద్ద పరిస్థితి అదుపులో ఉందని స్థానిక డీఐజీ తెలిపారు.