కరాచీ : కరాచీ విమాన ప్రమాదంలో మొత్తం ప్రయాణీకులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని భావిస్తున్న తరుణంలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారన్న భారీ ఊరట నిస్తోంది. బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్, ప్రభుత్వ రంగ సంస్థ అర్బన్ యూనిట్ సీఈవో ఖాలిద్ షెర్డిల్ క్షేమంగా బయడపడ్డారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు తెలిపారు. అలాగే అమర్ రషీద్ అనే మరో యువకుడు కూడా ఈ ప్రమాదంనుంచి బయటపడడం మిరాకిల్. ఈ విషయాన్ని రషీద్ బంధువులు సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. (కుప్పకూలడానికి ముందు.. భయంకరమైన క్షణాలు)
పాకిస్తాన్ జియో న్యూస్ ప్రకారం, ప్రాణాలతో బయటపడిన వారిలో జాఫర్ మసూద్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం స్థలంనుంచి ఇప్పటికి 34 మృతదేహాలను వెలికితీయగా, వీరిలో ఇద్దరు పైలట్ల మృతదేహాలను గుర్తించారు. ఇంకా 24 న్యూస్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు అన్సార్ నఖ్వీ ఈ ప్రమాదంలో అసువులు బాసారు. వీరితో పాటు స్థానికులు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.సెకండ్ లెఫ్టినెంట్ హమ్జా యూసుఫ్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. పరేడ్ ముగిసిన తరువాత హంజా మొదటిసారి ఈద్ పర్వదినం సందర్భంగా ఇంటికి వెళుతున్నారు. (ఘోర ప్రమాదం: ఆయనొక్కరే అదృష్టవంతుడు?)
హమ్జా యూసఫ్
మృతులు (స్థానికి మీడియా సమాచారం ఆధారంగా)
Comments
Please login to add a commentAdd a comment