‘ఈ ఒక్క నగరం బాగుంటే పాక్ బాగున్నట్లే’
కరాచీ: పాకిస్థాన్ ప్రశాంతంగా ఉంటే ముందు కరాచీ శాంతంగా ఉండాలని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వా అన్నారు. పాక్‌లో సుస్థిరత్వం నెలకొనాలన్నా, శాంతియుత పరిస్థితులు ఏర్పడాలన్న కరాచీనే కీలకం అని ఆయన చెప్పారు. ఆదివారం కరాచీలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించిన ఆయన కరాచీలో ప్రస్తుతం భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
అలాగే, సాంఘిక వ్యతిరేక శక్తులను ఏరివేసే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న రద్దుల్ ఫసద్ ఆపరేషన్ గురించి విశ్లేషించారు. ఈ సందర్భంగా కరాచీలో శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు సహకరిస్తున్న పాక్ రేంజర్లకు, ఆర్మీకి ధన్యవాదాలు చెప్పారు. కరాచీలో పూర్తిగా సాధారణ పరిస్ధితులు వచ్చే వరకు ఇలాగే పనిచేయాలంటూ సూచించారు. కరాచీ ద్వారానే పాక్‌లో సుస్థిరత సాధించేందుకు వీలవుతుందని మరోసారి స్పష్టం చేశారు.