ఆత్మాహుతి దాడిలో 20 మంది మృతి∙ | Pak leader among 20 killed in suicide blast at election rally | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడిలో 20 మంది మృతి∙

Published Thu, Jul 12 2018 3:25 AM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM

Pak leader among 20 killed in suicide blast at election rally - Sakshi

పెషావర్‌: పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మంది చనిపోయారు. పాక్‌లో 25న ఎన్నికల నేపథ్యంలో లౌకికవాద అవామీ నేషనల్‌ పార్టీ(ఏఎన్‌పీ) యకటూట్‌లో మంగళవారం అర్ధరాత్రి ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఏఎన్‌పీ అగ్రనేత హరూన్‌ బిలౌర్‌ వాహనం సమీపంలో తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో బిలౌర్‌సహా 20 మంది చనిపోయారు. 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. బిలౌర్‌ పెషావర్‌లోని 78వ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ దాడికి తమదే బాధ్యతని తెహ్రీక్‌–ఇ– తాలిబన్‌ పాకిస్తాన్‌(టీటీపీ) ప్రకటించుకుంది. ముజాహిద్‌ అబ్దుల్‌ కరీం అనే ఉగ్రవాది హరూన్‌ వాహనం సమీపానికి వెళ్లి 8 కిలోల టీఎన్‌టీని పేల్చేసుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement