Alluri Sitarama Raju District News
-
మందుబాబులకు అడ్డాగా బస్ షెల్టర్
పెదబయలు: మండల కేంద్రం పెదబయలు కూడలిలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్‌షెల్టర్ మందుబాబులకు అడ్డాగా మారింది. స్థానికంగా రెండు వైన్షాప్లున్నాయి.వాటిలో మద్యం కొనుగోలుచేసి సమీపంలో గల బస్ షెల్టర్‌లో రాత్రీపగలు తేడాలేకుండా తాగుతూ అక్కడే మద్యం సీసాలను చెల్లాచెదరుగా పడేస్తున్నారు. మద్యం బాటిళ్లు, చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలతో ఆ ప్రాంతం నిండిపోయింది. అక్కడ బస్సులను నిలపకపోవడంతో నిరుపయోగంగా మారింది. బస్ షెల్టర్‌కు ఆనుకుని నివాస గృహాలున్నాయి. స్థానికంగా ఉన్న మహిళలు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు భయాందోళనలు చెందుతున్నారు. ప్రజాధనంతో నిర్మించిన బస్‌షెల్టర్ నిరుపయోగంగా మారిందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, పోలీసులు స్పందించి బస్‌షెల్టర్‌ను శుభ్రం చేయడంతో పాటు మందుబాబుల ఆగడాలను అరికట్టాలని, బస్ షెల్టర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన చేస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు. -
నిర్వాసితులు అధైర్యపడవద్దు
చింతూరు ఐటీడీఏ పీవోఅపూర్వ భరత్ కూనవరం: పోలవరం నిర్వాసితులెవరూ అధైర్య పడవద్దని, అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ తెలిపారు. మండల పరిధిలో పోలవరం ముంపునకు గురవుతున్న టేకులబోరు, శబరికొత్తగూడెం, టేకుబాక, పెదార్కూరు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఆర్అండ్ఆర్ గ్రామసభలను ఆయన పరిశీలించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన అర్హులు, అనర్హుల వివరాలను గ్రామసభలో చదివి వినిపించారు. నాలుగు గ్రామాల్లో మొత్తం పీడీఎఫ్‌లు 3,179కి గాను 2,953 మందిని అర్హులుగా గుర్తించినట్టు పీవో తెలిపారు. అనర్హుల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆధారాలను తహసీల్దార్ లేదా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు గాని, తనకు గాని సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ నసరయ్య, తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, సర్పంచ్ హేమంత్, కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్‌పురం: పోలవరం ముంపునకు గురవుతున్న కొప్పిలి, ధర్మతాల్లగూడెం, కన్నయ్యగూడెం, శబరిరాయిగూడెం, రాజుపేట కాలనీల్లో గ్రామ సభల్లో ఆర్అండ్ఆర్ అర్హులు, అనర్హుల జాబితాను శుక్రవారం ప్రకటించారు ఈ సభలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్, ఎస్డీసీలు పాల్గొని నిర్వాసితుల సందేహాలను నివృత్తి చేశారు. -
పల్లెటూరి చిన్నోడు..నటనలో మెప్పించాడు
కూనవరం: కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం వెరసి ఓ పల్లెటూరి చిన్నోడు... ‘కోర్ట్’లో మెప్పించి అనేక మంది ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న చిన్న డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేసే ఆ చిన్నోడు డ్యాన్స్ పట్ల మక్కువతో తనను తాను తీర్చిదిద్దుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ‘కోర్ట్’ సినిమా ద్వారా హీరోగా మారి బంపర్ హిట్ కొట్టాడు. ఆయన ఇటీవల తన స్వగ్రామమైన కూనవరం వచ్చారు. ఆయనకు స్థానికులు అపూర్వ స్వాగతం తెలిపి ఘనంగా సన్మానించారు. చింతూరు ఏజెన్సీ డివిజన్ కూనవరం గ్రామానికి చెందిన రోషన్ అంచెలంచెలుగా ఎదిగిన తీరును తెలుసుకుందాం... ఇటీవల విడుదలైన కోర్ట్ సినిమా హిట్ కావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. హీరో నాని నిర్మాతగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ బంపర్ హిట్ సాధించింది. ఇందులో యువ హీరోగా రోషన్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి.. సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన రోషన్ తాత మస్తాన్ కూనవరం ఎంపీడీవో కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేశారు. తండ్రి రషీద్ వైద్యశాలలో పనిచేసేవారు. రోషన్ చదువు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు భద్రాచలంలో..అనంతరం ఖమ్మంలో పదో తరగతి వరకు సాగింది. రోషన్‌కు చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై మక్కువ ఉండేది. తన సోదరుడు తౌఫిక్ ప్రోత్సాహంతో పాల్వంచలోని అరవింద్ మాస్టర్, భద్రాచలంలోని పవన్, నాగురాజు మాస్టార్ల వద్ద డ్యాన్స్‌లో మెలకువలు నేర్చుకున్నారు. సినిమారంగంపై ఉన్న మక్కువతో హైదరాబాద్‌కు కుటుంబసమేతంగా తరలివెళ్లారు. వివిధ టీవీ ఛానళ్లలో డ్యాన్స్ పోటీల్లో పాల్గొని, ఉత్తమ ప్రదర్శనతో రోషన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు తరుణ్‌భాస్కర్ అతడిలోని ప్రతిభను గుర్తించి, ఈ నగరానికి ఏమైంది సినిమాలో నటించే అవకాశం కల్పించారు. ఆ తరువాత అరవింద సమేత, గద్దలకొండ గణేష్, వెంకీ మామ చిత్రాల్లో బాలనటుడిగా.. సలార్, విరూపాక్ష, బచ్చలమల్లి, మిషన్ ఇంపాజిబుల్, స్వాగ్ వంటి చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రలు పోషించడంతో తనకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ‘సరిపోదా శనివారం’తో ప్రత్యేక గుర్తింపు సరిపోదా శనివారం చిత్రంలో హీరో నానితో కలిసి పనిచేసే అవకాశం రావడంతో రోషన్‌కు ప్రత్యేక అవకాశం లభించింది. అతనిలో నటనను హీరో నాని గుర్తించారు.. ఈ నేపథ్యంలో నాని నిర్మాతగా, రామ్ జగదీష్ దర్శకత్వంలో తీసిన ‘కోర్ట్’ సినిమాలో యువ కథనాయుకుడిగా రోషన్‌కు అవకాశం దొరికింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ సాధించింది. రోషన్ నటనకు పెద్ద పెద్ద కథనాయకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. స్వగ్రామస్తుల ఆదరణ మరువలేను ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ తాను నటించిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం తరువాత మెగాస్టార్ చిరంజీవిని కలిశానని, చిత్రంలో తాను చేసిన డ్యాన్స్‌ను ఆయన మెచ్చుకొని ప్రశంసించారని గుర్తు చేశారు. కోర్ట్ చిత్రం చూసిన తరువాత కథనాయకుడు చిరంజీవి స్వయంగా ఆహ్వానించి జ్ఞాపికను బహుకరించడం మరచిపోలేని అనుభూతి అని చెప్పారు.ఇటీవల తన స్వగ్రామం కూనవరం వచ్చానని, స్థానికులు చూపిన ఆదరణ మరువలేనిదన్నారు. ప్రస్తుతం కొందరు దర్శకులు కథలు వినిపించారు. వాటిలో కొన్నింటికి అంగీకారం తెలిపే అవకాశముందని చెప్పారు. ‘కోర్ట్’ సినిమాలో హీరో రోషన్ నటనకు ప్రముఖ కథనాయకుల ప్రశంసలు వెల్లువెత్తిన అభినందలు -
సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రముంచంగిపుట్టు: సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న క్లస్టర్ విధానం అత్యంత దుర్మార్గమైనదని చెప్పారు. సచివాలయాల కుదింపు వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని, సచివాలయ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని కోరుతూ ఉద్యోగులు చైర్‌పర్సన్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మండల కేంద్రం ముంచంగిపుట్టులో శుక్రవారం గ్రామ సచివాలయాల ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నాశనం చేసేందుకు పూనుకుంటోందన్నారు.ప్రజలకు సుపరిపాలన అందించాలని,సంక్షేమ పథకాలు మరింత చేరువ చేయాలనే మంచి ఆలోచనతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని, ఈ విధానానికి దేశమంతటా ప్రశంసలు లభిస్తుంటే దానిని చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేక క్లస్టర్ విధానాన్ని తీసుకువస్తోందన్నారు.రెండు సచివాలయాలను ఒక క్లస్టర్‌గా మార్చే ఆలోచన చేస్తోందని,దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు. -
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ఫైనల్ జాబితా విడుదల
మహారాణిపేట: స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల ఫైనల్ జాబితాను శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి విడుదల చేశారు. ఈ జాబితాను https@//cfw.ap.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ ఫైనల్ జాబితాపై కూడా అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను రేసపువానిపాలెంలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయంలో అందజేయాలని ఆర్డీ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఎంపిక జాబితాను విడుదల చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 27న ప్రాథమిక (ప్రొవిజనల్) జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ జాబితాపై మూడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించారు. అయితే, ఇంతలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి అమలులోకి రావడంతో జాబితా పరిశీలన కార్యక్రమం నిలిచిపోయింది. ఎన్నికల కోడ్ ముగియడంతో మళ్లీ జాబితాల పరిశీలన ప్రారంభించారు. దరఖాస్తుల వివరాలు: మొత్తం 6 జిల్లాల్లోని 106 స్టాఫ్ నర్సు పోస్టుల కోసం డీఎంహెచ్‌వో కార్యాలయంలోని వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. ఆ తరువాత పోస్టులు మరో 264 పెరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి ఆన్లైన్ , ఆఫ్‌లైన్‌లో కలిపి మొత్తం 8300 దరఖాస్తులు వచ్చాయి. ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు తెలుపుతూ ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి 1,570 దరఖాస్తులు చేరుకున్నాయి.దళారులను నమ్మవద్దు పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. దళారులను ఎవరూ నమ్మవద్దు. అర్హత ప్రమాణాలు, మెరిట్, రోస్టర్ ప్రకారం ఫైనల్ జాబితా రూపొందించాం. అభ్యర్థులు ఎవరితోనూ సిఫార్సు చేయించవద్దు. – డాక్టర్ పి. రాధారాణి, ఆర్డీ -
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామ శివారు బోరింగ్ తండా సమీపంలో దారుణహత్యకు గురైన దంతాలపల్లి ఎంజేపీ గురుకులం హెల్త్ సూపర్ వైజర్ తాటి పార్థసారథి హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. మహబూబాబాద్ సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతిరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. పార్థసారథి హత్య జరిగిన రోజున మృతుడి సోదరి హేమవరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామన్నారు. ఈ క్రమంలో మృతుడు పార్థసారథి భార్య స్వప్న, ఆమె ప్రియుడు వెంకట విద్యాసాగర్‌ను గురువారం అరెస్టు చేసినట్టు తెలిపారు. కేసు విచారణలో భాగంగా ముగ్గురు నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరం ఒప్పుకున్నారని చెప్పారు. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గంగహుస్సేన్ బస్తీకి చెందిన తెలగరి వినయ్ కుమార్, బోగ శివకుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎటపాక గ్రామానికి చెందిన మోతుకూరి వంశీ ఉన్నట్టు గుర్తించామన్నారు. వారిని అరెస్టు చేసి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తామని పేర్కొన్నారు. గతంలో పార్థసారథిని హత్య చేయాలని జరిగిన రెక్కీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన కూసం లవరాజు పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో రూరల్, సీసీఎస్ సీఐలు సర్వయ్య, హత్తిరాం, రూరల్, కేసముద్రం ఎస్ఐలు దీపిక, మురళీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ఎటపాకకు చెందిన వంశీ తదితరులు పరారీలో రాజవొమ్మంగికి చెందిన లవరాజు వివరాలు వెల్లడించిన మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు -
స్టాఫ్ నర్సు రిక్రూట్మెంటులో నకిలీ సర్టిఫికెట్లు వాస్తవమే
● ఆర్టీ రాధారాణి మహారాణిపేట: స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియలో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు తేలింది. ఈ నెల 1వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘నర్సుల పోస్టులకు నకిలీ పత్రాలు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలలో నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఉన్నట్లు సాక్షి కథనంలో పేర్కొంది. దీనిపై ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి (ఆర్డీ) డాక్టర్ రాధారాణి విచారణ చేపట్టారు. కరోనా సమయంలో పనిచేసినట్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాల గురించి ఆర్డీ డాక్టర్ రాధారాణి సంబంధిత వ్యక్తులకు లేఖలు రాశారు. ముఖ్యంగా కేజీహెచ్ (కింగ్ జార్జ్ హాస్పిటల్) నుంచి అత్యధిక సంఖ్యలో ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు రావడంతో, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. శివానంద్‌కు ఆర్డీ డాక్టర్ రాధారాణి లేఖ రాశారు. ఈ సర్టిఫికెట్లు నకిలీవని కేజీహెచ్ నుంచి సమాధానం రావడంతో, ఆ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోలేదని ఆర్డీ డాక్టర్ రాధారాణి తెలిపారు. మొత్తం నకిలీ సర్టిఫికెట్లను పక్కన పెట్టామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్డీ వివరించారు. -
ఈదురు గాలులు.. భారీ వర్షం
సాక్షి,పాడేరు/కొయ్యూరు/రాజవొమ్మంగి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పాడేరులో రాత్రి ఏడు గంటల తరువాత ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో గంటపాటు జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.రోజూ వర్షాలు కురుస్తుండడంతో మామిడిపంటకు నష్టం ఏర్పడుతుందని గిరిజన రైతులు వాపోతున్నారు. కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెంతో పాటు పది గ్రామాల్లో సుమారు గంట పాటు భారీ వర్షం కురిసింది. పెద్ద శబ్దాలతో పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రాజవొమ్మంగి మండల వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో మండల వాసులు ఆందోళన చెందారు. వర్షం కారణంగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. -
వైఎస్సార్సీపీ నేతకు బెయిల్
నర్సీపట్నం: వైఎస్సార్సీపీ నేత, బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. శ్రీనివాసరావును నంద్యాల జిల్లా, జలదుర్గం పోలీసులు ఈ నెల 2వ తేదీన అరెస్టు చేసి డోన్ కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారంలో మూడు రోజులు పోలీసుల ఎదుట హాజరు కావాలని, 60 రోజులపాటు నంద్యాల పరిధి దాటి వెళ్లవద్దంటూ శ్రీనివాసరావుకు కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. జలదుర్గం పోలీసు స్టేషన్ నుంచి శ్రీనివాసరావు సాక్షితో మాట్లాడుతూ రాజకీయ కక్షలతో తన ఆస్తులను ధ్వంసం చేస్తున్న సమయంలో ఆవేశంతో మాట్లాడితే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంతోపాటు రాష్ట్రంలో పలు చోట్ల కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తనకు పార్టీ అండగా నిలిచిందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సారథ్యంలోనే పని చేస్తానన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన స్థాయికి తగిన వారితో రాజకీయాలు చేస్తే బాగుంటుందన్నారు. సామాన్య నాయకుడైన తనపై కేసులు పెట్టించి వేధించటం స్పీకర్‌కు భావ్యం కాదని ఆవేదన వెలిబుచ్చారు. -
సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయులు
రంపచోడవరం: ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచులని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉందని డీడీ రుక్మాండయ్య అన్నారు. స్ధానిక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో శుక్రవారం ఆర్ట్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కళలను మెరుగుపర్చుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ ఎం.చినబాబు మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞానం, నైపుణ్యాలు అందించడమే కాకుండా వారిలో నైతిక విలువలు ఆలోచన విధానాలు పెంపొందిస్తూ సమాజంలో మంచి పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక పాత్ర పోషిస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన 60 రకాల నమూనాలను ప్రదర్శంచారు. ఆర్ట్స్ మేళాను తిలకించడానికి వివిధ విద్యాలయాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, తరలివచ్చారు.ఉత్తమ చిత్రాలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నమూనాల్లో ప్రథమ బహుమతి బి.అనిత, ద్వితీయ బహుమతి కె.చరణ్, తృతీయ బహుమతి ఎం.ఉదయ్, యు.లచ్చిరెడ్డి, ఏ.నాగరాజు, ఎ.తనూషలు సాధించారు. వైస్ ప్రిన్సిపాల్ ఎస్.సూర్యనారాయణ, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
సైనికుల వైద్య సేవలకు యూఎస్–భారత్ ఎంవోయూ
సాక్షి, విశాఖపట్నం : తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం (ఈఎన్సీ) విశాఖపట్నంలో భారత్, యూఎస్ దేశాల మధ్య ప్రారంభమైన టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు కొనసాగుతున్నాయి. తొలి దశలో హార్బర్ ఫేజ్‌లో భాగంగా.. ఇరు దేశాల త్రివిధ దళాల ప్రతినిధుల మధ్య సమీక్షలు, చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మారీటైమ్ వార్ఫేర్ సెంటర్లో రెండు రోజుల పాటు ఇండియన్ నేవీ, యూఎస్ నేవీ వైద్య బృందాల మధ్య సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సెయిలర్స్, సోల్జర్స్ ఆరోగ్య సంరక్షణ, ఆపరేషనల్ మెడిసన్, వైద్య సంసిద్ధతలో ఉత్తమ సేవలు తదితర అంశాలపై పరస్పర సహకారం అందించుకునేందుకు ఇరు దేశాల మధ్య సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎక్స్ఛేంజ్(ఎస్ఎంఈఈ) ఒప్పందం జరిగింది. యుద్ధ సమయంలోనూ, విపత్తుల సమయంలోనూ వైద్య సంరక్షణ, ఏరో మెడికల్, క్యాజువాలిటీ మేనేజ్మెంట్ మొదలైన విభాగాలపై దృష్టి సారించినట్లు భారత్, యూఎస్ నౌకాదళ ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు.. యుద్ధ నౌకల్లో సహాయ సహకారాలపైనా ఎస్ఎంఈఈ ఇరుదేశాల మధ్య జరిగింది. కొనసాగుతున్న టైగర్ ట్రయాంఫ్–25 విన్యాసాలు -
పేదింట ఉడకని కందిపప్పు
ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. పేదలకు సబ్సిడీపై అందించాల్సిన నిత్యావసరాలపై నిర్లక్ష్యధోరణి పెరుగుతోంది. రేషన్ తీసుకుంటే తప్ప పూటగడవని గిరిజన కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కార్డుదారులకు అందించే కందిపప్పునకు ఈ నెల కూడా ఎగనామం పెట్టారు. సాక్షి,పాడేరు: రేషన్‌కార్డుదారులకు ప్రతి నెలా పంపిణీ చేయవలసిన కందిపప్పు సరఫరాలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. పేదలకు ఆహారభద్రత కార్యక్రమంలో భాగంగా సబ్సిడీపై రూ.67కి కిలో కందిపప్పు అందజేయాలి. గత రెండు నెలల నుంచి బియ్యం,పంచదార మాత్రమే రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. మారుమూల గ్రామాల కార్డుదారులకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తిస్థాయిలో కంది పప్పు అందని పరిస్థితి నెలకొంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో జిల్లాలో పంపిణీ కాలేదు.ఈనెలలో కందిపప్పు సరఫరా జరుగుతుందని పేదలంతా ఆశపడినప్పటికీ పంచదార,బియ్యంతోనే సరిపెట్టారు. 290 టన్నులు అవసరం జిల్లాలోని 22 మండలాల్లో 671 డీఆర్ డిపోలు, 221 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నారు. 2,98,092 రేషన్‌కార్డులున్నాయి.వీరికి రాయితీపై పంపిణీ చేసేందుకు ప్రతినెలా సుమా రు 290 టన్నుల కందిపప్పు అవసరం. జిల్లాలో 83 శాతం రేషన్‌కార్డులు గిరిజన కుటుంబాలవే. ఒక వైపు పౌష్టికాహార వినియోగంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తూ, మరోవైపు కంది పప్పు ఇవ్వకపోవడంతోనిరుత్సాహంచెందుతున్నారు. ప్రైవేట్ మార్కెట్లో కిలో రూ.130 కందిపప్పు ధర ప్రైవేట్ మార్కెట్లో కిలో రూ.130 ఉంది.మార్కెట్లో ధర పెరగడంతో ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేసే కందిపప్పు కోసం కార్డుదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే రాయితీపై కందిపప్పు పంపిణీని పౌరసరఫరాల శాఖ పూర్తిగా విస్మరించింది. అడిగితే స్టాక్ లేదనే సమాధానంతో సరిపుచ్చుతున్నారు. ప్రైవేట్ మార్కెట్లో అధిక ధరతో కందిపప్పును కొనుగోలు చేయలేక పేదప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు సబ్సిడీపై కందిపప్పును ప్రతినెలా పంపిణీ చేయాల్సిన పాలకులు ఇంత నిర్లక్ష్యం చేయడం దారుణమంటూ రేషన్‌కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బియ్యం,కందిపప్పు,పంచదారను ప్రతి నెల రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేసేవారు. ఈనెల కూడా బియ్యం, పంచదారకే పరిమితం రెండు నెలలుగా రేషన్‌కార్డుదారులకు అందని కందిపప్పు ప్రైవేట్ మార్కెట్లో కిలో రూ.130 ఈ నెలా కందిపప్పు ఇవ్వలేదు గత నెలలో కందిపప్పు పంపిణీ చేయలేదు.ఈనెల కూడా బియ్యం,పంచదార మాత్రమే ఇస్తున్నారు.ప్రభుత్వం నుంచి కందిపప్పు సరఫరా లేదంటూ ఎండీయూ వాహనాల సిబ్బంది చెబుతున్నారు.ప్రైవేట్ షాపుల్లో అధిక ధరకు కందిపప్పును కొనుగోలు చేయలేకపోతున్నాం – పాంగి రాజారావు, రేషన్‌కార్డుదారుడు, పాడేరు అధిక ధరకుకొనలేకపోతున్నాం ప్రతి నెలా బియ్యం,పంచదారను పంపిణీ చేస్తున్నప్పటికీ రెండు నెలల నుంచి కందిపప్పు ప్యాకెట్లు ఇవ్వడం లేదు.కందిపప్పు పంపిణీ లేక ఇబ్బందులు పడుతున్నాం.సంతల్లో అధిక ధరకు కొనుగోలు చేయలేకపోతున్నాం. – పాంగి సనాతి, వాకపల్లి, పాడేరు మండలం -
యువత క్రీడల్లో రాణించాలి
● పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు గూడెంకొత్తవీధి: గిరిజన యువత క్రీడల్లో రాణించాలని పాడేరు ఎమ్మెల్యే ఎం. విశ్వేశ్వరరాజు అన్నారు. రింతాడ పంచాయతీ ఏబులంలో జాతర సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ పోటీలను ఆయన శుక్రవారం ప్రారంభించి, కొద్దిసేపు ఆడారు. అనంతరం మాట్లా డుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్, జిల్లా శాఖ కోశాధికారి కుందేరి రామకృష్ణ,పార్టీ నాయకులు నారాయణ,రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు కినుక
● కరెంట్ ఇష్యూ కోర్టు ఆదేశించినాసాక్షి, విశాఖపట్నం : ఏ సంస్థలోనైనా చేసిన సర్వీస్ ప్రకారం సీనియారిటీని పరిగణిస్తుంటారు. కానీ.. విద్యుత్ పంపిణీ సంస్థల్లో మాత్రం విచిత్రంగా పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకున్నారు. ఉద్యోగి వయసు 40 సంవత్సరాలై సర్వీసు 15 ఏళ్లున్నప్పటికీ.. యాభై ఏళ్ల ఉద్యోగికి ఐదేళ్ల సర్వీసు ఉంటే.. సదరు ఉద్యోగినే సీనియర్‌గా పరిగణించారు. ఇలా 2008లో డిస్కం అధికారులు అడ్డగోలుగా పదోన్నతుల జాబితా తయారుచేశారు. దీనిపై కొందరు అప్పట్లోనే హైకోర్టుని ఆశ్రయించారు. సర్వీసు ప్రకారం పదోన్నతుల జాబితా సిద్ధంచెయ్యాలంటూ 2024 జూన్‌లో న్యాయస్థానం ఆదేశించినా.. టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనిపై సంఘాల ప్రతినిధులు ప్రభుత్వం, అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదు. నిజానికి 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చే ముందు కరెంట్ పోతే ఫ్యూజులు బిగించేందుకు రైతులే వెళ్లి మృత్యువాత పడేవారు. దీంతో డిస్కంలలో లైన్మెన్ల కొరత వేధిస్తోందని తెలుసుకున్న వైఎస్సార్.. ఉమ్మడి రాష్ట్రంలో వెంటనే 7,114 పోస్టుల్ని భర్తీచేశారు. ఈ సమయంలో ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు ఉమ్మడి సర్కిల్స్ పరిధిలో 1,220 పోస్టులు భర్తీఅయ్యాయి. సీనియారిటీ లిస్టుల్లో అధికారుల నిర్లక్ష్యం.. 2008లో కొత్తగా రిక్రూట్ చేసిన లైన్మెన్ల గత అనుభవాన్ని అనుసరించి.. సీనియారిటీ లిస్టులు తయారుచెయ్యాలని అప్పటి ప్రభుత్వం డిస్కంలని ఆదేశించింది. అయితే.. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా జాబితా సిద్ధంచేసేశారు. పనిచేసిన అనుభవం బట్టి కాకుండా.. వయసు బట్టి జాబితా తయారుచేశారు. దీనిపై అప్పట్లోనే అధికారులపై నాటి సీఎం వైఎస్ మండిపడ్డారు. ఆ తర్వాత ఆయన మృతిచెందడం.. తర్వాత ప్రభుత్వాలు విస్మరించడంతో నేటికి కూడా సీనియర్లు జూనియర్లుగానే మిగిలిపోయారు. జూనియర్లు మాత్రం ప్రమోషన్లు తీసుకుని సీనియర్లుగా చలామణి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బాధిత లైన్మెన్లు హైకోర్టుని ఆశ్రయించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రయత్నించినా.. సీనియారిటీ జాబితా విషయంలో అన్యాయం జరిగిందంటూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టికి బాధిత లైన్మెన్లు తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే కోర్టులో కేసు నడుస్తుండటంతో ఫలితం దక్కలేదు. చివరి నిమిషం వరకూ సీనియారిటీ జాబితాలో మార్పులు చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో.. గతేడాది జూన్ 21న హైకోర్టు తీర్పు వెలువరించింది. పనిదినాల ఆధారంగా మాత్రమే కొత్తగా సీనియారిటీ జాబితా తయారుచేయాలని.. వయసు ఆధారంగా చేసిన జాబితాని వెంటనే రద్దుచేసి.. కొత్తగా తయారుచేయాలని డిస్కంలని ఆదేశించింది. అయినా, కూటమి ప్రభుత్వం న్యాయస్థానం తీర్పుని పెడచెవిన పెట్టింది. 10 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడంలేదు. పలుమార్లు అధికారులకు, ప్రభుత్వ ప్రతినిధులకు లైన్మెన్లు వినతులు సమర్పించినా.. సీనియారిటీ లిస్టుని మార్చడంలేదు. ఇటీవల ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్‌లో ప్రక్రియ ప్రారంభించారు. అయితే.. ఈపీడీసీఎల్ అధికారులు మాత్రం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అలాగే, 2007లో జూనియర్ లైన్మెన్లుగా ఎంపికై న 138 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఈపీడీసీఎల్ అధికారులు అడ్డుపుల్ల వేశారు. దీనిపై వారు కోర్టుకు వెళ్లగా.. 138 మందికి ఉద్యోగాలివ్వాలని 2011లో న్యాయస్థానం ఆదేశించింది. వీరు విధుల్లో చేరినా సీనియారిటీని కోల్పోయారు. ఇలా.. ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం సర్కిల్లో 118 మంది, విజయనగరం సర్కిల్లో 136, విశాఖపట్నంలో 198, రాజమండ్రిలో 549, ఏలూరులో 353 మంది కలిపి మొత్తం 1,354 జూనియర్ లైన్మెన్లు పదోన్నతులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్టు తీర్పుని తక్షణమే అమలుచేస్తే.. ఈపీడీసీఎల్ సహా మూడు డిస్కంల పరిధిలో సుమారు 3,500 మంది ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఏపీఈపీడీసీఎల్‌లో 1,354 మంది జూనియర్ లైన్మెన్ పదోన్నతుల్లో విచిత్రం 18 ఏళ్ల సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరాలు ఫలితంగా సీనియర్లు సైతం జూనియర్లుగా మిగిలిపోయిన పరిస్థితి హైకోర్టు ఆదేశించినా అమలుచేయని డిస్కంలు కోర్టు కేసుల కారణంగా క్రమబద్ధీకరించలేకపోయిన గత ప్రభుత్వం సీనియార్టీ ప్రకారం జాబితా సిద్ధంచేయాలని 10 నెలల క్రితం హైకోర్టు ఆదేశాలు అయినా పాత జాబితానే కొనసాగిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం -
శబరి, జటాయువులకు మోక్షం సిద్ధించిన ప్రాంతం.. శ్రీరాముడు, హనుమంతుడు కలుసుకున్న స్థలం.. పురుషోత్తముడు నడయాడిన దివ్య ప్రదేశం... భద్రాచల రామాలయంలో జరిగే కై ంకర్యాలన్నీ ఈ క్షేత్రం నుంచే ప్రారంభమవుతాయి. ఎక్కడా లేనివిధంగా శ్రీరామచంద్రుడు దక్షిణ ముఖంగా దర్శనమిచ్చ
వీఆర్‌పురం: మండలంలోని శ్రీరామగిరి ఆలయం... రామదాసు భద్రాచల దేవాలయాన్ని నిర్మించడాని ముందునుంచే ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది. భద్రాచలం పట్టణానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, గోదావరి నదికి ఉపనది అయిన శబరి ఒడ్డున ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ స్వామి సుందర రాముడిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని మాతంగ ముని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీరామగిరికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. ఇక్కడ స్వామి ధ్యానం చేస్తున్న సమయంలో ముఖంలో తేజస్సు వెలువడి ఎంతో సుందరంగా కనిపించాడట అందుకే ఇక్కడ వెలసిన శ్రీరాముడిని సుందర రాముడిగా, ధ్యానం చేసినందన యోగ రాముడిగా పిలుస్తారు. శ్రీరాముడు ధ్యానం చేసిన గిరి కాబట్టి ఆప్రాంతానికి శ్రీరామగిరి అనే పేరు వచ్చింది. కల్యాణ ఉత్సవాలకు ఇక్కడే శ్రీకారం... దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి శ్రీకారం చుట్టేది శ్రీరామగిరిలోనే... శ్రీరామగిరిలో జరిగే కల్యాణోత్సవాల్లో తలంబ్రాల ప్రక్రియ ముగిస్తే కానీ భద్రాచలం రాములవారి పెళ్లి తంతు ప్రారంభం కాదు. ఇక్కడ నుంచే భద్రాచలం ఆలయానికి తలంబ్రాలు పంపుతారు. ఏటా ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. పోలవరం ప్రాజెక్టుతో కనుమరుగు కానుందా.. సుమారు 80 అడుగుల ఎత్తులో కొండపై ఉన్న ఈ ఆలయానికి చేరుకోడానికి భక్తులు 170 మెట్లు ఎక్కి వెళతారు. అంత ఎత్తులో ఉన్న ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి పూర్తిగా కనుమరుగు కానున్నట్టు నివేదికలు వెల్లడించాయి. అదే జరిగితే ఒక గొప్ప పర్యాటక ప్రదేశాన్ని, రాముడు నడయాడిన పుణ్యభూమిని, పురాతన కట్టడాన్ని మనం కోల్పోయినట్టే.ఏర్పాట్లు పూర్తి చేశాం శ్రీరామనవమి సందర్భంగా కల్యాణమహోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు, దేవదాయశాఖ అధికారులతో కలిసి ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు చలువ పందిళ్లు, మంచినీటి వసతి, అన్న సమారాధన కార్యక్రమాలు చేపడుతున్నాం. – పెందుర్తి సుదర్శన రావు, ఆలయ కమిటీ చైర్మన్ అందరి సహకారంతో .. శ్రీరామగిరిలో సీతారాముల కల్యాణమహోత్సవాన్ని అందరి సహకారంతో ఏటా మాదిరిగా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. శనివారం నుంచి 10 తేదీ వరకూ కల్యాణమహోత్సవాలు జరుగుతాయి. – పురుషోత్తమాచార్యులు,ఆలయ ప్రధాన అర్చకులు -
సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలు
వీఆర్ పురం: శ్రీరామగిరి సీతారాముల కల్యాణానికి కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం కల్యాణ అప్పారావు బృందం గురువారం నాడు 25 కేజీల గోటి తలంబ్రాలను అందజేసింది. శ్రీరామగిరి ఆలయ కమిటీ చైర్మన్ పెందుర్తి సుదర్శనరావు వాటిని స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ చైతన్య సంఘం వారు మాట్లాడుతూ ఈనెల 6వ తేదీన భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి కూడా 200 కేజీల తలంబ్రాలు అందిస్తున్నామని తెలిపారు. 13 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలలో ఉన్న రామాలయాలకు ఈ తలంబ్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. గోటి తలంబ్రాల కోసం దేవతమూర్తులు వేషధారణలో వడ్లను నాటి, మహిళా భక్తులతో వరి పంటను ప్రత్యేకంగా పండించి, వాటిని వారితో వలిపించి ఆ ధాన్యాన్ని 5 రాష్ట్రాల్లోని దేవాలయాలకు 4 వేల మంది మహిళా భక్తులతో పంపిణీ చేశామని తెలిపారు. మొత్తం 800 వందల కిలోల ధాన్యం పండించామని చెప్పారు. ఫిబ్రవరిలో అయోధ్యలో జరిగిన రాములవారి కల్యాణానికి 200 కిలోలు, ఒంటిమిట్ట రామాలయానికి 200 కిలోల గోటి తలంబ్రాలు అందజేశామన్నారు. సమర్పించిన శ్రీకృష్ణ చైతన్య సంఘం -
మార్కెట్ మురిపెం
కాఫీ తోటల్లో అంతరపంటగా సాగు చేస్తున్న మిరియాలు ఈ ఏడాది గిరిజన రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. దిగుబడులు భారీగా పెరగడంతో పాటు మార్కెట్లో ధరలు కూడా అనుకూలంగా ఉండడంతో వ్యాపారం పోటాపోటీగా జరుగుతోంది. తొలిసారిగా స్పైసెస్ బోర్డు కూడా రంగంలోకి దిగడంతో రైతులకు మరింత మేలు జరగనుంది. లాభాల మిరియం..పాడేరు మండలం మోదాపల్లిప్రాంతంలో విరగ్గాసిన మిరియాలుసాక్షి, పాడేరు: మిరియాలు పండిస్తున్న గిరి రైతులకు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. ఏజెన్సీవ్యాప్తంగా లక్షా 52 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫలసాయం ఇచ్చే కాఫీ తోటలు ఉండగా, వాటిలో సుమారు 90 వేల ఎకరాల్లో గిరిజనులు అంతరపంటగా మిరియాలు సాగుచేస్తున్నారు. ఎకరానికి 300 కిలోల వరకు పచ్చిమిరియాలు కాస్తాయి. బాగా ఎండితే సగం బరువు తగ్గిపోతాయి. గత ఏడాది ఎకరానికి 120 కిలోల వరకు దిగుబడి రాగా, ఈసారి 150 కిలోలకు పైగానే దిగుబడి పెరిగింది. ప్రతి గిరిజన రైతు ఎకరానికి 150 కిలోల మిరియాలను మార్కెటింగ్ చేస్తుండడంతో మంచి లాభాలు పొందుతున్నారు. మన్యం మిరియాలకు మంచి డిమాండ్ జాతీయ స్థాయిలో ఏజెన్సీ మిరియాలకు పూర్వం నుంచి మంచి డిమాండ్ ఉండడంతోపాటు నాణ్యతలోను నంబర్–1గా నిలుస్తున్నాయి. రైతులంతా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది 100 కోట్లకు పైగానే మిరియాల వ్యాపారం జరుగుతుంది. ఈ ఏడాది దిగుబడులు, ధరలు పెరగడంతో సుమారు రూ.150 కోట్ల వరకు మిరియాల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. కిలో ధర రూ.600 ఏజెన్సీవ్యాప్తంగా మిరియాల వ్యాపారం భారీగా జరుగుతోంది. గత నెల సీజన్ కిలో రూ.550తో వ్యాపారం ప్రారంభమవ్వగా, ప్రస్తుతం కిలో రూ.600తో వ్యాపారులు పోటాపోటీగా మిరియాలను కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కన్నా కిలోకు రూ.70 పెరిగింది. ఎకరం పంట ఉన్న రైతు మిరియాల అమ్మకాల ద్వారా రు.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నాడు. స్పైసెస్ బోర్డు మార్కెట్లోకి... కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని స్పైసెస్ బోర్డు తొలిసారిగా మిరియాల మార్కెట్‌ను ప్రారంభించింది. కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ జాతీయ స్థాయిలో మిరియాల వ్యాపారస్థులు, స్పైసెస్ బోర్డు అధికారులతో పలుమార్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఇటీవల చింతపల్లి ప్రాంతంలో మిరియాల గింజలను కిలో రూ.610తో స్పైసెస్ బోర్డు కొనుగోళ్లను ప్రారంభించింది. హుకుంపేట మండలం బాకూరు రోడ్డులో పాదుల నుంచి మిరియాలు సేకరిస్తున్న గిరిజనులుదిగుబడులు పెరిగాయి గత ఏడాది కన్నా మిరియాల దిగుబడులు పెరగడంతోపాటు సంతల్లో వ్యాపారులు కిలో రూ.600తో కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కిలో రూ.520తోనే అమ్ముకున్నాను. నాకు 3 ఎకరాల కాఫీ తోటల్లో మిరియాల పంట ద్వారా ఇప్పటికి రూ.2 లక్షల ఆదాయం వచ్చింది. – వంతాల వరహాలమ్మ, ఎస్.గొందూరు గ్రామం, హుకుంపేట మండలం స్పైసెస్ బోర్డు ద్వారా మిరియాల మార్కెటింగ్ ఎకరం పంటకు 150 కిలోల దిగుబడి.. రూ.90 వేల ఆదాయం స్పైసెస్ బోర్డు ద్వారా మిరియాల పంట సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులకు సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఏజెన్సీలో గిరిజన రైతులు ఉత్పత్తి చేస్తున్న మిరియాలకు గిట్టుబాటు ధరల కల్పన లక్ష్యంగా స్పైసెస్ బోర్డును మార్కెట్లోకి దింపాం. వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయిలో మిరియాల కొనుగోళ్లను విస్తరిస్తాం. – ఎ.ఎస్.దినేష్‌కుమార్, కలెక్టర్ -
డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు
● టోకూరులో సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ స్థల పరిశీలన అనంతగిరి (అరకులోయ టౌన్): ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులు ఈనెల 7వ తేదీ సోమవారం అనంతగిరి మండలం టోకూరు పంచాయతీలో పర్యటించనున్న నేపథ్యంలో పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ గురువారం ఏర్పాట్లు సమీక్షించారు. బహిరంగ సభ ప్రాంగణం, పార్కింగ్ స్థలాల గురించి చర్చించారు. టోకూరు గ్రామ సచివాలయం ఎదురుగా గల ఖాళీ స్థలంతోపాటు బాగ్మర్వలస గ్రామం, బొర్రా గ్రామ పంచాయతీ పరిధిలో గల బొర్రా, పూలుగుడ గ్రామాలను పరిశీలించారు. అనంతరం మండల స్ధాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్ల గురించి చర్చించారు. తహసీల్దార్ మాణిక్యం, అరకులోయ పీఐయూడీఈఈ రవికుమార్, టోకురు పంచాయతీ సర్పంచ్ మొస్య పాల్గొన్నారు. -
సమన్వయం, జవాబుదారీతనం..
ముంచంగిపుట్టు: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో మండలంలో జరుగుతున్న పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, జల్‌జీవన్ మిషన్ ద్వారా జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని, గిరిజన గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ డీఈ గోపాలకృష్ణ, ఏఈ రాజేష్‌లకు సూచించారు. ముంచంగిపుట్టు మండలంలో పీఎం జన్మన్ గృహాలు 5,361 మంజూరు కాగా నేటికి 2 వేల గృహాల పనులు జరుగుతున్నాయని, సకాలంలో బిల్లులు అందించి, పనులు త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ డీఈ రాజుబాబు, ఏఈ కృష్ణారావులకు తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ద్వారా సర్పంచులు, ఎంపీటీసీలకు తెలియకుండా పనులు జరుగుతున్నాయని, కచ్చితంగా ప్రజప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఏఈ రాములుకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న బీటీ రోడ్లను పూర్తి చేయాలని ఏఈ మురళీకృష్ణకు ఆదేశించారు. ఎంపీపీ అరిసెల సీతమ్మ, ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, ఈవోపీఆర్డీవో చిన్నాన్న, తదితరులు పాల్గొన్నారు. అన్ని శాఖల సహకారంతో ప్రగతి పనులు జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర దిశానిర్దేశం ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్ష -
యువతిపై స్నేహితుడి దాడి
● ఫొటోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానని బెదిరింపు ● బతిమాలగా ఫొటోలు అప్పగించేందుకు అంగీకారం ● చెప్పిన చోటికి వెళ్లగా యువతిపై వెదురు కర్రలతో దాడి ● అడ్డతీగల సీహెచ్‌సీకి బాధితురాలి తరలింపు అడ్డతీగల: మండలంలో పాపంపేట శివారున చేపల చెరువు సమీపాన యువతిపై ఓ యువకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. గంగవరం మండలం దొరమామిడికి చెందిన బాధితురాలు పుడిగి దుర్గాభవాని కథనం ప్రకారం.. పాపంపేటకు చెందిన మడకం బాబీతో ఆమెకు పరిచయం ఉంది. ఆ పరిచయంతో తీసుకున్న ఫొటోలను ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తానంటూ తరచూ భవానీని బెదిరించేవాడు. ఫొటోలను అప్పగించమని ఆమె అనేకసార్లు కోరింది. ఫొటోలను తొలగిస్తానని చెప్పి పాపంపేట రమ్మని చెప్పగా కామాడి కృష్ణ అనే వ్యక్తి సహాయంతో గురువారం అక్కడికి వెళ్లింది. వెళ్లిన వెంటనే తనని బైక్‌పై తీసుకొని వెళ్లి పాపంపేట శివారున వెదురుకర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడని వాపోయింది. తాను చనిపోయి ఉంటానని భావించి వెళ్లిపోయాడని పేర్కొంది. తన ఆచూకీ వెతుక్కుంటూ వచ్చిన కామాడి కృష్ణ తీవ్రంగా గాయపడిన తనని అడ్డతీగల పోలీస్‌స్టేషన్‌కి తీసుకొచ్చి విషయం చెప్పిన తరువాత సీహెచ్‌సీకి తీసుకొచ్చారని వివరించింది. దుర్గాభవానీకి తలపై తీవ్రగాయమవ్వడంతో వైద్యులు 10 కుట్లు వేశారు. అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మన్యం ప్రగతికి బాటలు
సాక్షి, పాడేరు: జిల్లాలో మారుమూల గ్రామాలకు రానున్న మూడేళ్ల్లలో రహదారులు నిర్మించి డోలీ మోత లేని గ్రామాలుగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ చెప్పారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.456 కోట్లతో రహదారులు, 26 వంతెనల నిర్మాణాలు చేపడతామన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కోటి 61 లక్షల పనిదినాలను కల్పించడంతో జిల్లా ప్రథమ స్థానం సాధించిందన్నారు.రూ.737.32 కోట్లను ఉపాధి హామీ పనులకు ఖర్చు పెట్టామన్నారు. ఉపాధి కూలీలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.307 చొప్పున వేతనాలు పెంచామన్నారు. రూ.20 కోట్లతో చెక్‌డ్యాంలు నిర్మించడంతో 7 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. అలాగే లక్ష ఎకరాల్లో కాఫీ తోటలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మలేరియా నిర్మూలనకు చర్యలు జిల్లాలో మలేరియా నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. గతంలో కంటే మలేరియా కేసులు పెరిగినందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నామన్నారు. 2030 నాటికి మలేరియా రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2086 మలేరియా పీడిత గ్రామాల్లో ఈనెల 15 తేదీ నుంచి దోమల నివారణ మందు పిచికారీ పనులు ప్రారంభమవుతాయన్నారు. జూన్ నెలలో 3 లక్షల 50 వేల దోమతెరలను పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. 18 వేల మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు ఈనెల 7వ తేదీన అరకులోయ డిగ్రీ కళాశాల మైదానంలో 18 వేల మంది గిరిజన విద్యార్థులతో 108 సూర్యనమస్కారాలు, యోగాసనాలు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ రికార్డు సాధించే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లండన్ నుంచి యోగా పర్యవేక్షణ బృందం వచ్చి సూర్యనమస్కారాల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుందన్నారు. పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇప్పటికే యోగాసనాల శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ, ఇన్చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ, డ్వామా పీడీ విద్యాసాగర్ పాల్గొన్నారు. రూ.456 కోట్లతో రోడ్ల అభివృద్ధి 26 వంతెనల నిర్మాణానికి చర్యలు వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు జూన్‌లో దోమతెరల పంపిణీ: కలెక్టర్ దినేష్‌కుమార్ నీటి ఎద్దడి నివారణకుకంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. తాగునీటి సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, సమస్యలు పరిష్కరించే లక్ష్యంగా పాడేరు కలెక్టరేట్‌తో పాటు 3 ఐటీడీఏల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పాడేరు కలెక్టరేట్లో 18004256826 టోల్ ఫ్రీ నంబర్, పాడేరు ఐటీడీఏలో 08935–250833, రంపచోడవరం ఐటీడీఏలో 18004252123, చింతూరు ఐటీడీఏలో 81217 29228 నంబర్లకు ప్రజలు ఫిర్యాదు చేయాలన్నారు. కంట్రోల్ రూమ్‌లు 24 గంటలపాటు పనిచేస్తాయని, ఆయా తాగునీటి సమస్యలపై రోజువారీ తాను కూడా పర్యవేక్షిస్తానని, 24 గంటల్లో సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
● పాడేరులో అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నీ ● రాష్ట్రం నలుమూలల నుంచి 72 జట్ల రాక పాడేరు: అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతంలో రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నీ నిర్వహించడం గొప్ప విషయమని, టోర్నీ నిర్వహణతో గిరిజన ప్రాంత ప్రతిష్ట మరింత పెరుగుతుందని కలెక్టర్ దినేష్‌కుమార్, ఎమ్మెల్యే, ఆలయ కమిటీ చైర్మన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. మే 11, 12, 13 తేదీల్లో జరగనున్న పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి జాతరను పురస్కరించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 36వ రాష్ట్ర స్థాయి మెగా క్రికెట్ టోర్నీని బుధవారం వారు ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి జాతీయ జెండాను చేతబట్టి జాతీయ గీతాన్ని ఆలపించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 72 క్రికెట్ జట్లు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్నాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.1.20 లక్షలు, షీల్డ్, ద్వితీయ బహుమతిగా రూ.60 వేలు, షీల్డ్‌తోపాటు వ్యక్తిగత బహుమతులు అందజేస్తామని నిర్వహకులు వివరించారు. కలెక్టర్ దినేష్‌కుమార్, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గిరిజన ఖ్యాతిని పెంచేలా టోర్నీ నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరు క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలని, స్నేహపూర్వక వాతావరణంలో టోర్నీని విజయవంతం చేయాలన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడు కొట్టగుళ్లి సుబ్బారావు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, దూసూరి సన్యాసిరావు, కుంతూరు నర్శింహమూర్తి, లకే రామకృష్ణపాత్రుడు, సర్పంచ్‌లు వంతాల రాంబాబు, గబ్బాడ చిట్టిబాబు, కుర్రబోయిన సన్నిబాబు, సోమెలి లక్ష్మణరావు, గబ్బాడ చిట్టిబాబు, టోర్నీ నిర్వాహకులు సీదరి రాంబాబు, కొంటా దుర్గారావు, బాకూరు ఉమామహేష్, ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ప్రతినిధులు, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. -
సమీకృత సాగు రైతులకు మేలు
నర్సీపట్నం: సమీకృత సాగు విధానంతో రైతులు ఆర్థికంగా లాభపడవచ్చునని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కె.శచీదేవి పేర్కొన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సమీకృత వ్యవసాయ విధానంపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ సమీకృత వ్యవసాయ వ్యవసాయం ప్రధాన లక్ష్యం సాగు పశుపోషణ, చేపల ఉత్పత్తి, పౌల్ట్రీ తదితర ఉత్పాదకతను పెంచడమే కాకుండా వీటి వల్ల ప్రతి రోజు ఆదాయం సమకూరుతుందన్నారు. సమీకృత వ్యవసాయ విధానంలో విభిన్న రకాల పంటలను పండించడం, అనేక రకాల జంతువులను పెంచడం ద్వారా రైతులు ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు అన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఒకటి లేదా రెండు పంటలను కోల్పోయినప్పటికీ మిగిలిన రకాల పంటలు పశుపోషణ, చేపల పెంపకం తదితర వాటి ద్వారా దాయం పొందడానికి వీలవుతుందన్నారు. కూరగాయలు పెంపకం, గేదెల పెంపకం, తేనె తీగల పెంపకం ద్వారా ఆదాయం సమకూరుతుందన్నారు. ఆయా అనుబంధ సంస్థల ద్వారా రాయితీలు కూడా రైతులు పొందవచ్చన్నారు. ఈ సమావేశంలో డీపీఎం ఎల్‌హెచ్.వరప్రసాద్, ఏసీ సత్యనారాయణ, ఏపీఎంఎఫ్పీఓ జగన్నాఽథం, గొలుగొండ, నాతవరం ఎపీఎం రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
అనంతగిరి (అరకులోయ టౌన్): విశాఖ–అరకు ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురైన ఇద్దరు యువకులను అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి, జెడ్పీటీసీ దీసరి గంగరాజు చొరవతో ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. వాలసీ పంచాయతీ కరకవలస గ్రామానికి చెందిన చప్పి శీలయ్య, జంగిడే బాలరాజు ఎస్.కోట నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం ఘాట్ రోడ్డులోని 1వ నెంబర్ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొని వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన వారి గురించి అటువైపు వెళ్తున్న ఎంపీపీతోపాటు ఇతరులు 108కి సమాచారం అందించడంతో క్షతగాత్రులను ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. స్థానికులు అనంతగిరి పోలీసులకు కూడా సమాచారం అందించారు. వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాహన చోదకులు తగు జాగ్రత్తలు పాటించి ఘాట్ రోడ్డులో ప్రయాణించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఎంపీపీ సూచించారు. ఘాట్ రోడ్డులో రక్షణ గోడలు లేకపోవడం, ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఆర్అండ్బీ అధికారులు స్పందించి వాహన ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని ఎంపీపీ కోరారు. ఎంపీపీ నీలవేణి, జెడ్పీటీసీ గంగరాజు చొరవతో ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు -
ఆనందోత్సాహాలతో ఆర్చిబిషప్ ప్రతిష్టాపన
డాబాగార్డెన్స్: వేలాదిగా తరలి వచ్చిన క్రైస్తవ విశ్వాసులు.. వందలాది నన్‌లు, ప్రముఖ ఆర్చ్ బిషప్‌లు, బిషప్‌లు, ప్రొవిన్షియల్ సుపీరియర్లు, ప్రీస్ట్స్, మతాధికారుల సమక్షంలో.. పోప్ ప్రతినిధి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ లియోపోల్డో గిరెల్లి నేతృత్వంలో.. ఆధ్యాత్మిక పండగలా సాగిన వేడుకలో మోస్ట్ రెవరెండ్ ఉడుమల బాల విశాఖ ఆర్చ్‌బిషప్(అగ్రపీఠాధిపతి)గా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వాల్తేరు ఆర్ఎస్ సమీపానున్న సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి సెయింట్ పీటర్స్ కేథడ్రల్ వరకూ భారీ ఊరేగింపు సాగింది. తన తొలి ప్రసంగంలో ఉడుమల బాల మాట్లాడుతూ తన జన్మభూమి వరంగల్ అయితే.. పుణ్యభూమి విశాఖ అని కొనియాడారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రతినిధి, భారత్– నేపాల్ అపోస్టోలిక్ నున్సియో(అంబాసిడర్) మోస్ట్ రెవరెండ్ డాక్టర్ లియోపోల్డో గిరెల్లి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విశాఖపట్నం ఆర్చ్ బిషప్కు కొత్త చీఫ్ పాస్టర్‌ను బహుమతిగా ఇచ్చినందుకు దేవునికి కతజ్ఞతలు తెలిపారు. బాల నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖలో లక్షకు పైగా క్యాథలిక్ ప్రజలు ఉన్నారని, ప్రీస్టులు, నన్స్‌తో కూడిన బలమైన ఉనికి ఉందన్నారు. ఆర్చ్డియోసెస్ ఎదుర్కొంటున్న సవాళ్లపై గిరెల్లి స్పందించారు. ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, వలసదారుల దీనస్థితి, పర్యావరణానికి ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. 2015 నుంచి 2023 వరకు సీసీబీఐ కమిషన్ ఫర్ సెమినేరియన్స్, మతాధికారిగా బాల బాధ్యతలు, చైర్మన్‌గా ఆయన అనుభవాన్ని హైలైట్ చేశారు. ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ ప్రకాష్ మల్లవరపు ఆర్చ్డయోసిస్కు చేసిన సేవలకు అపోస్టోలిక్ నన్సియో, అపోస్టోలిక్ అడ్మినిస్ట్రేటర్‌గా పాస్టోరల్ నాయకత్వానికి చేసిన సేవలకు బిషప్ జయరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది సీనియర్ చర్చి నాయకులు హాజరయ్యారు, వీరిలో ఆర్చ్‌బిషప్ ఎమెరిటస్ ప్రకాష్ మల్లవరపు, రాయ్‌పూర్ ఆర్చ్‌బిషప్ విక్టర్ హెన్రీ ఠాకూర్, సీసీబీఐ వైస్ ప్రెసిడెంట్, బెంగళూరు ఆర్చ్‌బిషప్ పీటర్ మచాడో, ఆగ్రా ఆర్చ్‌బిషప్ రాఫీ మంజలీ, ఇతర ఆర్చ్‌బిషప్‌లు, బిషప్‌లు పాల్గొన్నారు. విశాఖ ఆర్చ్‌బిషప్‌గా ఉడుమల బాల -
ప్రేమోన్మాది నవీన్‌కు 14 రోజుల రిమాండ్
మధురవాడ: ప్రేమోన్మాది దమరసింగి నవీన్‌కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టు పీఎంపాలెం ఎస్ఐ కె.భాస్కరరావు తెలిపారు. పెళ్లికి అంగీకరించడం లేదనే కోపంతో నవీన్ బుధవారం విచక్షణా రహితంగా తల్లీ కూతుళ్లపై దాడి చేసిన సంగతి తెలిసిందే. కొమ్మాదిలోని స్వయంకృషి నగర్లో జరిగిన ఈ ఘటన విశాఖనే కాదు యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో తల్లి నక్కా లక్ష్మి(47) మృతి చెందగా, కుమార్తె దీపిక ప్రస్తుతం మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడు పరారయ్యేందుకు ప్రయత్నం చేయగా.. పోలీసులు శ్రీకాకుళం జిల్లాలో అతన్ని పట్టుకుని బుధవారం సాయంత్రం పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం నిందితుడిని భీమిలిలో న్యాయమూర్తి ముందు హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. నవీన్ డిగ్రీ పూర్తి చేసినా సక్రమంగా స్థిరపడకపోవడంతో ఎనిమిదేళ్లుగా దీపిక తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకుండా తరచూ వాయిదాలు వేస్తున్నారు. బుధవారం కూడా అదే జరిగింది. దీంతో నిందితుడు వారిపై దాడికి దిగాడు. -
జాతీయస్థాయి పోటీలకు గిరిజన బాలికలు
జి.మాడుగుల: థాగంట మార్షల్ ఆర్ట్స్‌లో జాతీయ స్థాయి పోటీలకు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి గిరిజన బాలికలు ఎంపికై నట్టు సుమన్ షూడోకాన్ రుద్రమాదేవి, సెల్ఫ్ డిపెన్స్ అకాడమీ జిల్లా కో–ఆర్డినేటర్ సాగేని రాజేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జి.మాడుగుల మండల జి.ఎం.కొత్తూరు గ్రామంలోని కేజీబీవీ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సోముల రమ్య ఢిల్లీకి, దుక్కేరి ప్రమీలరాణి మణిపూర్‌లో జరగనున్న జాతీయ స్థాయి థాంగుట పోటీల్లో పాల్గొననున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న గిరిజన బాలికలను, కోచ్ జి.మాడుగుల పోలీస్‌స్టేషన్ ఎస్ఐ షణ్ముఖరావు, హౌసింగ్ ఏఈ దూరు ఈశ్వరరావు నగదు ప్రోత్సాహం అందించారు. కళాశాల యాజమాన్యం, పీఈటీ గంగాభవానీ, జిల్లా కో–ఆర్డినేటర్ రాజేశ్వరరావు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న బాలికలను ఎంఆర్వో సిబ్బంది, కళాశాల సిబ్బంది తదితరులు అభినందించారు. -
చెట్టుపై నుంచి జారిపడిగీతకార్మికుడి మృతి
రాజవొమ్మంగి: మండలంలోని బోనంగిపాలెంలో గీత కార్మి కుడు, గిరిజనుడు అయిన చోడి రాజు బాబు (54) జీలుగు చెట్టుపై నుంచి జారిపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్పంచ్ చంద్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. గీతకార్మికుడు రాజుబాబు రోజు మాదిరిగానే కల్లు సేకరించేందుకు చెట్టెక్కాడు. పట్టు తప్పి పడిపోవడంతో గాయాలపాలైన ఆయనను వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. కల్లు విక్రయిస్తు కుటుంబాన్ని పోషిస్తున్న రాజుబాబు మృతిచెందడంతో ఆ కుటుంబం దిక్కులేకుండా పోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
సారా తయారీ కేంద్రాలపై దాడులు
ఎటపాక: రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఎటపాక మండలంలో నాటుసారా తయారీ కేంద్రాలపై రెండు తెలుగు రాష్ట్రాల ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. గురువారం పిచుకలపాడు, గుండువారిగూడెం గ్రామాల్లో ఎకై ్సజ్, సివిల్ పోలీసులు జరిపిన దాడుల్లో సారా తయారీకి వినియోగించే 6,800 లీటర్ల బెల్లం ఊటను, 60 లీటర్ల నాటు సారా, 10 కేజీల అమ్మోనియా, 120 కేజీల నల్లబెల్లంను సీజ్ చేశారు. పిచుకలపాడులో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. సారా తయారీకి ఉపయోగించే 46 డ్రమ్ములను ధ్వంసం చేసినట్లు రంపచోడవరం అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరిండెంట్ నాగరాహుల్ తెలిపారు. ఈ దాడుల్లో కొత్తగూడెం ఏఈఎస్ కరంచంద్, రంపచోడవరం ఏఈఎస్టీఎఫ్ సీఐ ఇంద్రజిత్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్, చింతూరు ఎకై ్సజ్ ఎస్ఐ స్వామి, భద్రాచలం ఎస్‌హెచ్‌వో రహీమునిషా, ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేష్, ముణుగూరు సీఐ కిషోర్‌బాబు, పాల్వంచ సీఐ సరిత, ఎటపాక సీఐ కన్నపరాజు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న రెండు రాష్ట్రాల అధికారులు 6,800 లీటర్ల పులిసిన బెల్లపు ఊట ధ్వంసం 60 లీటర్ల నాటుసారా స్వాధీనం 10 కేజీల అమ్మోనియా, 120 కేజీల నల్ల బెల్లం సీజ్ పిచ్చికలపాడులో ఇద్దరిపై కేసులు నమోదు -
టాస్క్‌ఫోర్స్ టీంలతో మలేరియా నివారణ చర్యలు
చింతూరు: గ్రామస్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి మలేరియా నివారణకు చర్యలు చేపట్టాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గురువారం వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా నివారణలో భాగంగా ఈనెల 15 నుంచి ఇళ్లలో దోమల మందు పిచికారీ చేసేందుకు చేపట్టే ప్రణాళికా కార్యక్రమం గురించి ఆయన చర్చించారు. అనంతరం పీవో మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్ టీంలకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహించాలని ఆదేశించారు. దోమలమందు పిచికారీ చేసేందుకు వర్కర్లను నియమించి వారికి తగిన శిక్షణనివ్వాలని, పిచికారీ నిర్వహించే గ్రామాల ప్రజలకు మూడు రోజులు ముందుగానే తెలియచేయాలని ఆయన ఆదేశించారు. పాజిటివ్ కేసులకు చికిత్స జరుగుతున్న తీరును తెలుసుకొని ఇక నుంచి సంబంధిత పీహెచ్సీ సూపర్వైజర్ బాధ్యత తీసుకుని చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని పీవో ఆదేశించారు. మలేరియాతోపాటు మిగతా రోగాలపై కూడా ప్రతి రోజూ ఇళ్లకు వెళ్లి ఆరా తీయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసరాజు, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి పాల్గొన్నారు. 15 నుంచి ఇళ్లలో దోమలమందు పిచికారీ ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ ఆదేశం -
భూములు కోల్పోయాం.. న్యాయం చేయండి
విజయనగరం అర్బన్: ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు, డుంబ్రిగుడ మండలాలకు చెందిన గిరిజనులు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావుకు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం కలిసి సమస్యను తెలియజేశారు. తమకు నష్టపరిహారం, ఉపాధి కల్పించడంలో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. భూమికి భూమి ఇచ్చేలా చూడాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు.ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు గిరిజనుల వినతి -
అంతర్రాష్ట్ర సర్వీసులకు కొత్త బస్సులు
ఆర్ఎం అప్పలనాయుడుమద్దిలపాలెం: బస్ డిపోలతో పాటు బస్సులను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు సిబ్బందికి సూచించారు. గురువారం ఆయన విశాఖపట్నం డిపోను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. విశాఖపట్నం డిపోలో పరిశుభ్రత మరింత మెరుగుపడాలని, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. గురువారం నుంచి భద్రాచలం–విజయవాడ బస్సుల ద్వారా మరింత ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం డిపో నుంచి దూర ప్రాంతాలకు, అంతర్రాష్ట్ర సర్వీసులకు కొత్త బస్సులు కేటాయించినట్లు చెప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు పోటీ తత్వంతో పనిచేసి విశాఖపట్నం డిపోకు మరింత ఆదాయం తీసుకురావాలని పిలుపునిచ్చారు. బస్సుల మరమ్మతులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. బీఎస్ 6 బస్సులకు సంబంధించి సిబ్బందికి కొత్త టెక్నాలజీతో కూడిన టూల్స్ సరఫరా చేస్తామన్నారు. వేసవి కాలంలో సిబ్బంది ఎవరూ వడదెబ్బకు గురికాకుండా ఎప్పటికప్పుడు మజ్జిగ, మంచినీళ్లు తీసుకోవాలన్నారు. బస్ స్టేషన్, డిపోల్లో తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ కె.రాజశేఖర్, డిపో మేనేజర్ కె.గంగాధర్, అసిస్టెంట్ ఇంజినీర్ రామకృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ ఉజ్వల, ఎస్.ఎస్. అప్పారావు, అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గిరిజన యువకుడు మృతి
జీసీసీ గోడౌన్ వ్యవహారంపై పీవో సీరియస్ చింతూరు: స్థానిక జీసీసీ గోడౌన్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ బుధవారం రాత్రి గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన గోడౌన్ తాళం చెవులను ఇన్చార్జికి ఇవ్వకుండా తన వద్దే ఉంచుకుని గురువారం మేనేజర్‌కు అప్పగించారు. కాగా ఈ వ్యవహారంపై సీరియస్ అయిన పీవో గోడౌన్లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందిని తొలగించాల్సిందిగా ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయంపై పీవోను వివరణ కోరగా గోడౌన్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, అవకతవకలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రమాద స్థలంలో మృతి చెందిన బోడేశ్వరరావు, బోడేశ్వరరావు (ఫైల్) గూడెంకొత్తవీధి: మండలంలోని దేవరాపల్లి పంచాయతీ కొడిసింగి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గిరిజన యువకుడు మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీకే వీధి మండలం లక్కవరపుపేట పంచాయతీలో ఉన్న తన తల్లిని కలిసి తన కుటుంబం ఉంటున్న కొడసింగి గ్రామానికి ద్విచక్రవాహనంపై కంకిపాటి బోడేశ్వరరావు(32) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొడసింగి గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో వాహనం అదుపు తప్పి సమీప పొదల్లో దూసుకుపోవడంతో బోడేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని చింతపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. జీకే వీధి సీఐ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ప్రకృతి వ్యవసాయం విస్తరించాలి
పెదబయలు: జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని నూరుశాతం విస్తరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి నందు, జిల్లా ప్రకృతి వ్యవసాయం మేనేజర్ భాస్కరరావు అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. 2028 సంవత్సరం పూర్తయ్యేనాటికి పాడేరు డివిజన్లోని రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేసేలా వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది ఈనెల 15వ తేదీ నాటికి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం, పోషణను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యకర పంటలు పండించే విధంగా కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఎంఐపీ పీడీ రహీమ్, ఎంపీడీవో ఎల్. పూర్ణయ్య, తహసీల్దార్ గండేరు రంగారావు, వెలుగు ఏపీఎం దేవమంగ, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఉపాధి ఏపీవో అప్పలనాయుడు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ, కాఫీ బోర్డు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం 32 రకాల విత్తనాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను పరిశీలించారు. -
జీడిమామిడి పిక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
రంపచోడవరం: గిరిజన రైతులు జీడిమామిడి పిక్కలను దళారులకు అమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ద్వారా జీడిమామిడి పిక్కలు కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవీ అన్నారు. పందిరిమామిడి సెంటర్లో బుధవారం వన్‌దన్ వికాస కేంద్రాన్ని ప్రారంభించారు.రంపచోడవరం కేంద్రంగా జీడిమామిడి పిక్కలు ప్రొసెసింగ్ సెంటర్ కోసం అంసెబ్లీలో ప్రస్తావించినట్టు ఎమ్మెల్యే చెప్పారు. ఐటీడీఏ పీవో సింహాచలం మాట్లాడుతూ ఏజెన్సీలో పరిధిలో 114 వన్‌దన్ వికాస కేంద్రాలు ఉన్నట్టు తెలిపారు. అలాగే 14 జీడిమామిడి పిక్కల ప్రొసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది వంద మెట్రిక్ టన్నుల జీడిమామిడి పిక్కలు కొనుగోలు చేసి ప్రొసెసింగ్ అనంతరం మార్కెటింగ్ చేయడమే లక్ష్యమన్నారు. పది మెట్రిక్ టన్నుల చింతపండు, 20 మెట్రిక్ టన్నుల పసుపు, లక్ష కొండ చీపుళ్లు కొనుగోలు చేసి మార్కెట్‌కు తరలించనున్నుట్టు చెప్పారు. వీడీవీకెల అభివృద్ధికి అందరూ సమష్టిగా పనిచేయాలని సూచించారు. వెలుగు ఏపీడీ డేగలయ్య, డీపీఎం అపర్ణ, పరమేశ్వరరావు, ఏపీఎం రాము తదితరులు పాల్గొన్నారు.రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం -
రోడ్డు ప్రమాదం– క్షతగాత్రులకు ఎంపీపీ సాయం
అరకులోయటౌన్(అనంతగిరి): మండలంలోని డముకు–తైడా ఘాట్‌రోడ్డులో ఆటో అదుపుతప్పి కొండను ఢీకొన్న ఘటనలో గాయపడిన క్షతగాత్రులను అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆస్పత్రికి తరలించారు. అరకులోయ మండలం, పద్మాపురం గ్రామ పంచాయతీ దుమ్మగుడ గ్రామానికి చెందిన సోమెల రొయిల అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమెను ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా తైడా సమీపంలో ఆటో అదుపుతప్పి కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రొయిల భర్త సోమెల రంగారావు తలకు తీవ్ర గాయంతో పాటు కుడిచేయి విరిగింది. దోన అనే మరో మహిళ తీవ్ర గాయాల పాలైంది. అదే సమయంలో ఆ రహదారి మీదుగా వెళ్తున్న ఎంపీపీ శెట్టి నీలవేణి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్కనారాయణ ప్రమాదాన్ని తెలుసుకున్నారు. హుటాహుటిన క్షతగాత్రులకు సపర్యాలు చేసి, 108 అందుబాటులో లేకపోవడంతో అనంతగిరి పీహెచ్సీ వైద్యాధికారి జ్ఞానేశ్వరితో ఫోన్లో మాట్లాడి పీహెచ్సీ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి, క్షతగాత్రులను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న అనంతగిరి ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకోని క్షతగాత్రులకు ఆస్పత్రికి పంపేందుకు సహకరించారు. -
మోదమ్మ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు
● 150 రోజుల్లో రూ.4.60 లక్షలు సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి ఆలయంలో హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు భక్తుల సమక్షంలో హుండీని తెరిచి నగదు లెక్కించారు.150 రోజులకుగాను రూ.4,60,470 ఆదాయం లభించింది. అలాగే బంగారం,వెండి,రాగి వస్తువులను కూడా మోదమ్మకు భక్తులు కానుకలుగా సమర్పించారు. -
నేటి నుంచి టెన్త్ స్పాట్ వాల్యుయేషన్
● 683 మంది సిబ్బంది నియామకం ● డీఈవో బ్రహ్మాజీరావు సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని తలారిసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో టెన్త్ స్పాట్ వాల్యుయేషన్‌ను గురువారం నుంచి పకడ్బందీగా నిర్వహించనున్నట్టు డీఈవో పి.బ్రహ్మాజీరావు తెలిపారు. బుధవారం ఆయన విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పాట్ వాల్యుయేషన్‌కు అన్ని విభాగాల అధికారులు,ఉపాధ్యాయులు,ఇతర సిబ్బందిని కలిపి మొత్తం 683 మందిని నియమించినట్టు చెప్పారు.స్ట్రాంగ్ రూమ్, బందోబస్తును పోలీస్‌శాఖ అధికారులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. -
నెత్తుటి మరకలు
విశాఖ నగరిపై ● వరుస హత్యలతో ప్రజల్లో భయాందోళనలు ● మహిళలపై అఘాయిత్యాలతో పెరుగుతున్న అభద్రతా భావం ● తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది ఘాతుకంతో మరోసారి ఉలిక్కిపడ్డ నగరం ● కూటమి సర్కారు హయాంలో విశోకపట్నంసాక్షి, విశాఖపట్నం/అల్లిపురం: ప్రశాంత విశాఖ నగరం నెత్తుటి మరకలతో ఎర్రబడుతోంది. వరుస నేరాలతో ఉలిక్కి పడుతోంది. తరచూ లైంగికదాడులు, హత్యలు, దొంగతనాలు, దాడుల భయం నీడలా వెంటాడుతోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే సుందర విశాఖ నగరంలో రోజూ ఏదో ఒక నేర నమోదుతో ప్రజల్లో కలవరం మొదలైంది. కూటమి పాలనలో అరాచక శక్తులకు, అడ్డాగా మారిందనే ఆందోళన అందరిలోనూ కనిపిస్తోంది. ఒక విషాదం తర్వాత మరొకటి జరుగుతుండటంతో నగరంలో ఏం జరుగుతుందోనన్న భయం అందరిలోనూ నెలకొంది. మూడు వారాల క్రితం పెదగదిలిలో ఐదు నెలల కుమార్తెని కన్నతల్లి హత్య చేసిన ఘటన మరవక ముందే.. కొమ్మాదిలో ఘోరం అందర్ని కలచివేసింది. పెళ్లికి అంగీకరించడం లేదనే కోపంతో ప్రేమోన్మాది నవీన్.. విచక్షణా రహితంగా చెలరేగిపోయాడు. మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే.. రెండు చాకులతో తల్లీ కూతుళ్లపై ఉన్మాదంతో చెలరేగిపోయాడు. ఈ దాడిలో తల్లి మృత్యుఒడికి చేరుకోగా.. కుమార్తె ప్రాణాలతో పోరాడుతోంది. ఈ ఘటన విశాఖనే కాదు యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే హోం మంత్రి ఉన్నా.. మహిళల భద్రత గాల్లో దీపంలా మారిపోయింది. శాంతి భద్రతలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతలోనే మరో అమానుషం ప్రేమోన్మాది ఘాతుకం జరిగిన కొద్ది గంటల్లోనే మరో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మతిస్థిమితం లేని మహిళకు చెరకు రసం ఇస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఓ దుండగుడు అత్యాచారం చేశాడు. మహిళ తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకొని పోలీసుల్ని ఆశ్రయించారు. గత నెల 26న 8 ఏళ్ల చిన్నారిపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన కీచకుడి ఘటన యావత్ నగరాన్ని శోకసంద్రంలో ముంచేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెరుగుతున్న నేరాలతో నగర ప్రజలు భయంభయంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అప్పట్లో ‘దిశ’తో రక్షణ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించింది. యాప్‌పై పూర్తి అవగాహన కల్పించటంతో మహిళలు యాప్‌ను వినియోగించుకుని రక్షణ పొందేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దిశ చట్టాన్ని నీరుగార్చారు. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోక పోవటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల కొరవడ్డాయని ఆందోళన వ్యక్తమవుతోంది. మహిళలు ఒంటరిగా ప్రయాణించాలన్నా, ఎక్కడికై నా వెళ్లాలన్నా భయపడుతున్నారు. మహిళ రక్షణ కోసం ఉపన్యాసాలు ఇచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భద్రత వైఫల్యాలే శిశువు అపహరణకు కారణం
రంపచోడవరం: ఏజెన్సీలో ఎన్నడూ లేని విధంగా ఏరియా ఆస్పత్రి నుంచి శిశువును ఒక మహిళ అపహరించుపోయిన సంఘటన దారుణమని రంపచోడవరం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పండా రామకృష్ణదొర అన్నారు. ఆస్పత్రిలో సరైన భద్రత చర్యలు లేకపోవడం ఇలాంటి సంఘనలకు అవకాశం ఏర్పడిందన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నడూ జరగని అనేక సంఘటనలు చోటుచేసుకుంటాన్నాయన్నారు.రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను, సంఘటనలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవన్నారు. -
కాఫీ పూలు
మల్లెలు కావివి..జిల్లాలోని కాఫీ తోటలు విరబూసి, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే కాఫీ తోటలు పూతకొచ్చాయి. ప్రస్తుతం పచ్చని ఆకుల్లో మల్లెల మాదిరిగా శ్వేత వర్ణపుష్పాలు ఆకర్షణీయంగా కనిపిస్తూ సువాసనలు వెదజల్లుతున్నాయి. ఇటీవల పలుచోట్ల వర్షాలు కురిసి కాఫీతోటలకు మేలు చేశాయి. పాడేరు మండలం వనుగుపల్లి,లగిశపల్లి, మినుములూరు ప్రాంతాలలో ముందస్తుగానే పూలు పూస్తూ ఆకర్షిస్తున్నాయి. – సాక్షి,పాడేరు -
కీటక జనిత వ్యాధుల నియంత్రణకు చర్యలు
సాక్షి,పాడేరు: జిల్లాలో కీటక జనిత వ్యాధుల నివారణకు పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పలు శాఖల జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో మలేరియా,డెంగ్యూ మరణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, మూడు ఐటీడీఏల పరిధిలో దోమల నివారణ,మలేరియా నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాలని,ఈనెల 15 నుంచి మొదటి విడత దోమల నివారణ మందు పిచికారీ ప్రారంభించాలని ఆదేశించారు. దోమల మందు పిచికారీపై ప్రజలను చైతన్య పరచాలని,జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహించాలని తెలిపారు.గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు,వసతి గృహాలు,ఏపీఆర్ విద్యాలయాల్లో దోమతెరలు ఏర్పాటు చేయాలని, విద్యార్థినీవిద్యార్థులకు నైట్‌డ్రెస్‌లు పంపిణీ చేయాలని తెలిపారు.జిల్లా మలేరియాశాఖ అధికారి తులసి మాట్లాడుతూ ఈనెల 15నుంచి జూన్ 15వరకు మొదటి విడత, జులై 1నుంచి ఆగస్టు 31వతేదీ రెండవ విడత దోమలమందు పిచికారీ నిర్వహించనున్నట్టు చెప్పారు.అనంతరం కీటక జనిత వ్యాధుల నివారణకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సింహాచలం, అపూర్వభరత్, డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్ బాషా, ప్రత్యక్షంగా జిల్లా సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వమిత్ర, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, డీఈవో బ్రహ్మాజీరావు, ఇన్చార్జి గిరిజన సంక్షేమ డీడీ రజనీ, డీఎల్పీవో కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీఎం జన్మన్ పనులు వేగవంతం పీఎం జన్మన్లో మంజూరు చేసిన రహదారి నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు.పలు ఇంజినీరింగ్‌శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో 23 రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదించగా 20 పనులు ఆమోదించామన్నారు.పాడేరు డివిజన్లో ఏడు రోడ్లకు ఐదు పనులను ఆమోదించామని చెప్పారు.జిల్లాలో 1600 సెల్‌టవర్లను మంజూరు చేశామని,వాటి పనులు వేగవంతం చేయాలన్నారు. 43 జియో సెల్టవర్ల నిర్మాణానికి స్థలాలు అనుకూలంగా లేవని జియో నెట్వర్క్ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్,డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి,రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం,గిరిజన సంక్షేమశాఖ ఈఈలు వేణుగోపాల్,డేవిడ్,పీఆర్ ఈఈలు శ్రీనివాస్,కొండయ్యపడాల్ తదితరులు పాల్గొన్నారు. తాజంగి రిజర్వాయర్‌కు నష్టం తేవద్దు జాతీయ రహదారి నిర్మాణంలో తాజంగి రిజర్వాయర్‌కు ఎలాంటి నష్టం తేవద్దని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. జాతీయ రహదారులు, రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. తాజంగి రిజర్వాయర్ వద్ద మట్టి పోస్తుండడంతో నీటిమట్టం తగ్గి సేద్యానికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఇక్కడ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు రిజర్వాయర్ అంచుల వెంబడి రివిట్మెంట్ చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా పంటకాల్వలు,చెక్‌డ్యాంలు దెబ్బతింటే వాటిని వెంటనే సరిచేయాలన్నారు. సివిల్ తగాదాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్‌గౌడ,సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్,జాతీయ రహదారుల నిర్మాణాల సంస్థ విశాఖప ట్నం పీడీ రవి, అరకు పీడీ గుల్షన్‌కుమార్, డీఎఫ్‌వో సందిప్‌రెడ్డి, ఎస్ఎంఐ డీఈఈ నాగేశ్వరరావు, వర్చువల్‌గా రంపచోడవరం సబ్‌కలెక్టర్ కల్పశ్రీలు పాల్గొన్నారు. ఈనెల 15నుంచి దోమల మందు పిచికారీ మలేరియా నిర్మూలనకు ముందస్తు ఏర్పాట్లు కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాలు -
చింతపల్లి ఆస్పత్రికి పెరిగిన రోగుల తాకిడి
చింతపల్లి: స్థానిక ఏరియాఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతోంది. మూడురోజులుగా ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. చింతపల్లి, జీకే వీధి మండలాల్లో గల 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగులు వస్తారు. ప్రతి రోజు 250 నుంచి 300 వరకూ సాధారణ ఓపీ ఉంటుంది. బుధవారం వారపు సంత రోజున నాలుగు వందల వరకూ ఓపీ ఉంటుంది. ఎండలు మండిపోతుండడంతో ఆరో గ్య సమస్యలు అధికమవుతున్నాయి. దీంతో అన్ని ప్రాంతాల నుంచి ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జనరల్ వ్యాధులతో పాటు మలేరియా,టైఫాయిడ్ వంటి జ్వరాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికి ఆస్పత్రిలో 11 మలేరియా,17 టైఫాయిడ్ కేసులు నమోదైనట్టు సూపరింటెండెంట్ ఇందిరా ప్రియాంక తెలిపారు. -
తాగునీటి సౌకర్యం కల్పనకు ప్రత్యేక చర్యలు
ముంచంగిపుట్టు: జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్ తెలిపారు.మండలంలోని కించాయిపుట్టు,కిలగాడ పంచాయతీల్లో జేజేఎం ద్వారా నూతనంగా మంజూరైన తాగునీటి పథకాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కించాయిపుట్టు పంచాయతీలో జే జేఎం ద్వారా రూ.9లక్షలతో దారపల్లి, రూ.7.70 లక్షలతో వర్కుగుమ్మి, రూ.7.40 లక్షలతో మర్రిపుట్టు, కిలగాడ పంచాయతీలో రూ.7.60 లక్షలతో తరిగెడ, రూ.5.3 లక్షలతో ఊరిపూజారిమెట్ట, రూ.7.9 లక్షలతో మల్కరిపుట్టు, రూ.8.3 లక్షలతో చెరువుపాకల గ్రామాల్లో తాగునీటి పథకాలు ఏర్పాటు చేయనున్నామని, త్వరలోనే పనులు మొదలు పెడతామని తెలిపారు. -
‘ఉన్నతి’తో ఉపాధి అవకాశాలు
కొయ్యూరు: ఉన్నతి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు చింతపల్లి క్లస్టర్ ఉపాధిహమీ పథకం ఏపీడీ లాలం సీతయ్య తెలిపారు. ఈ పథకం కింద 90 రోజుల శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో 100 పనిదినాలు పూర్తి చేసుకున్న వేతనదారుల పిల్లల కోసం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఉన్నతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 80 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ పలు రంగాల్లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. జాబ్స్ కోఆర్డినేటర్ వై.లక్ష్మి మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్లేస్‌మెంట్స్ కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అప్పలరాజు తదితరులు మాట్లాడారు. -
సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల ధర్నా
సాక్షి,పాడేరు: ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపు మేరకు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు ధర్నా చేశారు. 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని, పీఆర్సీ కమిషన్ ఆలస్యమైతే వెంటనే ఐఆర్ ప్రకటించాలని, కారుణ్య నియామకాలు జరపాలని,పెండింగ్ బకాయిలు, 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్స్ మంజూరు చేయాలని, పాత పింఛన్ విధానాన్ని అమలుచేయాలని,70ఏళ్లు పైబడిన రిటైర్డ్ ఉపాధ్యాయులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించాలని, ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు 11వ పీఆర్సీ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.అనంతరం కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్‌ను కలిసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
మర్యాదపూర్వక కలయిక
సాక్షి, పాడేరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు బుధవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యక్రమాలను ఎమ్మెల్యే పార్టీ అధినేతకు సమగ్రంగా వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరాచకపాలనను ఎండగడుతూ ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేయడంతో పాటు వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేయాలని మాజీ సీఎం జగన్ ఆదేశించినట్టు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విలేకరులకు తెలిపారు. -
వరుస ఘటనలతో బెంబేలు
ఒకప్పుడు శాంతిభద్రతలకు నెలవుగా మారిన విశాఖ వరుస ఘటనలతో వణికిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మహిళలపై వరుస దాడులతో నగర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పది నెలల కాలంలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ● మూడు రోజుల క్రితం డాన్సర్లు అయిన భార్యాభర్తలు మధ్య జరిగిన గొడవలో.. భర్త చేసిన దాడిలో భార్య గాయపడి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ● మార్చి 31న మధురవాడ వాంబేకాలనీలో ఐదేళ్ల చిన్నారిపై వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ● మార్చి 29న తండ్రిపై కొడుకు బ్లేడ్‌తో దాడి చేసి హత్య చేసిన ఘటన ఆరిలోవలో చోటుచేసుకుంది. ● మార్చి 28న బర్మా క్యాంపు సమీపంలో హనుమంతరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చెట్టుకు కట్టి హత్య చేశారు. ● మార్చి 27న సాలూరుకి చెందిన ఐశ్వర్య అనే యువతిని రాంబాబు అనే వ్యక్తి విశాఖలో హత్య చేసి సాలూరు ప్రాంతంలో చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరించాడు. ● మార్చి 20న గాజువాక శ్రీ నగర్‌లోని ఇంట్లో జరిగిన దొంగతనంలో 15 తులాల బంగారాన్ని అపహరించారు. ● ఫిబ్రవరి 28న ఐదేళ్ల బాలికపై ఓ షాప్ సెక్యూరిటీ గార్డ్ మేడమీదకు తీసుకెళ్లి అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక కేకలు వెయ్యడంతో స్థానికులు ఈ దారుణాన్ని అడ్డుకున్నారు. ● ఫిబ్రవరి 5న హెచ్‌బీకాలనీ సింహాద్రిపురంలో పదేళ్ల బాలికపై 35 ఏళ్ల గణేష్ అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ● మార్చి 2న ద్వారకాపోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇంటిని పగలగొట్టి 30 తులాల బంగారం, రూ.45 వేల క్యాష్ చోరీకి పాల్పడ్డారు. ● మార్చి నెలలో అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన మహిళను ఫైనాన్స్ వ్యాపారులు వేధిస్తుండటంతో అప్పు ఇచ్చిన వారి ఇంట్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ● గత జనవరిలో పీఎం పోలీస్ స్టేషన్ పరిధిలో మిథిలాపురి వుడా కాలనీలో ఒక మహిళను నడి రోడ్డుపై జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం రేపింది. -
60 శాతమే రక్త పరీక్షలు
కొయ్యూరు: రోగ నిర్ధారణకు రక్త పరీక్షలు తప్పని సరి. అయితే ఆ పరీక్షలు సక్రమంగా సాగక వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోంది. దీంతో సకాలంలో వైద్యం అందక రాజేంద్రపాలెం పీహెచ్సీ పరిధిలో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాడేరు డివిజన్లో అధిక పరిధి గల రాజేంద్రపాలెం ఆస్పత్రిలో ఒకే ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ పీహెచ్సీ పరిధిలో 17 సచివాలయాలు న్నాయి. వీటి పరిధిలో సుమారు 40 మంది ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు రక్త నమూనాలను సేకరించి, పీహెచ్‌సీకి పంపుతారు. ఈ మూడు నెలలు ఎపిడమిక్‌గా పరిగణించి, అధికంగా రక్త పూతలు సేకరించి, పరీక్షస్తారు. ఈ పీహెచ్సీలో ఓపీ 140 వరకు ఉంటుంది. వీరిలో సుమారు 40 మందికి వరకు రక్తపరీక్షలు చేస్తారు. ఇలా నెల రోజుల్లో సుమారు 2,500 వరకు రక్త పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒక్క ల్యాబ్‌టెక్నీషియన్ ఉన్నారు. నిబంధనల ప్రకారం రోజుకు 60 రక్త పరీక్షలు చేయాలి. ఆ ప్రకారం సెలవు దినాలు మినహాయిస్తే సుమారు నెలకు 1500 అంటే సుమారు 60 శాతం పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి. ఒక సారి రక్త సేకరణ చేస్తే మూడు రోజుల లోపు పరీక్ష చేయాలి.లేకుంటే మళ్లీ సేకరించాలి. పీహెచ్సీలో ఇద్దరికి గాను ఒక్కరే ల్యాబ్ టెక్నీషియన్ ఉండడంతో పూర్తిస్థాయిలో సకాలంలో రక్త పరీక్షలు జరగడం లేదు. దీంతో వ్యాధి నిర్ధారణలో జాప్యం జరిగి, రోగులు సకాలంలో వైద్య సేవలు పొందలేకపోతున్నారు. అదనంగా మరో ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించాలని ప్రతిపాదించినా ఇంత వరకు పట్టించుకోలేదు.దీనిపై జిల్లా మలేరియా అధికారి తులసి మాట్లాడుతూ ఈ సమస్యను డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. సకాలంలో వ్యాధి నిర్ధారణ కాక వైద్యసేవల్లో జాప్యం అవస్థలు పడుతున్న రోగులు రాజేంద్రపాలెం పీహెచ్సీలో రెండో ల్యాబ్ టెక్నీషియన్ లేక ఇబ్బందులు -
రాత్రి గజగజ
పగలు భగభగ..విభిన్న వాతావరణంసాక్షి,పాడేరు: జిల్లాలో భానుడి ప్రతాపంతో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటితే ప్రధాన కూడళ్లు జనసంచారం లేక బోసిపోతున్నాయి. మరో వైపు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో చలి వణికిచేస్తోంది. ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు కురుస్తోంది. వేసవి కాలంలోను పొగమంచు కురుస్తుండడంతో సూర్యోదయం అయ్యేంత వరకు ఆహ్లాదకర వాతావరణంతో జిల్లా వాసులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఉదయం 9 గంటల నుంచే సూర్యుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. మైదాన ప్రాంతాలను తలపిస్తూ వడగాడ్పులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం ఎండ చుర్రుమంటుండడంతో జిల్లా కేంద్రం పాడేరుతో పాటు అన్ని మండల కేంద్రాల్లోని రోడ్లపై జనసంచారం తక్కువగా ఉంటోంది. ఎండను తాళలేక వ్యవసాయ, కూలి పనులకు వెళ్లే గిరిజనులు మధ్యాహ్నానికే ఇంటికి చేరుకుంటున్నారు. వారపు సంతలపైన ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో 36 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు : చింతూరులో 37.7 డిగ్రీలు, మారేడుమిల్లిలో 37.7, వై.రామవరంలో 37.6, పాడేరులో 37, డుంబ్రిగుడలో 37, కొయ్యూరులో 36.7, రాజవొమ్మంగిలో 36.6, కూనవరంలో 36.5, రంపచోడవరంలో 36.1 అడ్డతీగల 36.1, ముంచంగిపుట్టులో 35.4, పెదబయలులో 35, హుకుంపేటలో 34.9, అరకులోయలో 34, అనంతగిరిలో 33.3, జీకే వీధిలో 33, చింతపల్లిలో 32.5, జి.మాడుగులలో 32.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఉష్ణోగ్రతలు మరింతపెరుగుతాయి ఈఏడాది జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పాడేరు డివిజన్ కంటే రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఎండలు మరింత విజృంభించనున్నాయి. అధిక ఎండలు,గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మిరియాలు, పసుపు, పిప్పళ్ల పంటల సేకరణలో గిరిజన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ అప్పలస్వామి, ఏడీఆర్, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఉదయం 8గంటల వరకు పొగమంచుఉదయం 9 గంటల తరువాత చుర్రుమనిపిస్తున్న సూరీడు సాయంత్రం వరకు వడగాడ్పులు అధిక వేడితో ఇబ్బందులు డుంబ్రిగుడ: మండలంలో విభిన్న వాతావరణం నెలకొంది. ఉదయం మంచు కురుస్తుండడంతో పాటు రాత్రి చలిగాలలు వీస్తున్నాయి. మంచు ఎక్కువగా కురుస్తుండడంతో దారి సరిగా కనిపించక వాహనచోదకులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండంతో మండల వాసులు అల్లాడిపోతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందడానికి గిరిజన చిన్నారులు సమీప గెడ్డలు, చాపరాయి వద్ద జలకాలాటలాడుతున్నారు. అధికంగా కురుస్తున్న మంచు వల్ల మామిడి పూతకు నష్టంవాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
గిరిజన రైతులు పథకాలు అందిపుచ్చుకోవాలి
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం రంపచోడవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను గిరిజన రైతులు అందిపుచ్చుకోవాలని, ఇందుకు ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశం హాలులో మంగళవారం నిర్వహించిన వ్యవసాయశాఖ ప్రైమరీ సెక్టార్ సమావేశంలో పీవో మాట్లాడారు. గిరిజన రైతులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని, అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు పొందిన రైతుల జాబితాను, చనిపోయిన గిరిజన రైతుల జాబితాను సమర్పించాలని ఆదేశించారు. ఈ ఏడాది వ్యవసాయ వృద్ధి రేటు పెంచే విధంగా రైతులకు సూచనలు , సలహాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖాధికారులకు సూచించారు.సచివాలయాల సిబ్బందిని వ్యవసాయాభివృద్ధికి వినియోగించుకోవాలని తెలిపారు. వీడీవీకేల ద్వారా జీడిమామిడి పిక్కలను కొనుగోలు చేయనున్నట్టు చెప్పారు. ఉపాధి హామీ పథకం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో ఏడీఏ సీహెచ్ కె.వి. చౌదరి, పీఏవో ఎల్.రాంబాబు, డీడీ షరీష్, కె.సావిత్రి, ఏవో కె.లక్ష్మణ్‌రావు, వెంకటేశ్వర్లు, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. అధికారులు అందుబాటులో ఉండాలి ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. స్థానిక పీఎంఆర్సీ ప్రాంగణంలో గల వివిధ కార్యాలయాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ సెలవు రోజుల్లో మినహా పనిదినాల్లో తప్పనిసరిగా కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. -
ఉపాధి హామీ పనుల్లో జిల్లా ముందంజ
సాక్షి,పాడేరు: జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకం పనుల్లో జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ మంగళవారం తెలిపారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి,ఉపాధి కల్పన,ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో అద్భుత విజయాలను సాధించిందన్నారు. నిర్ధేశించిన లక్ష్యాలను అధిగమిస్తూ పలు అంశాలలో రాష్ట్రస్థాయిలోనే జిల్లా ప్రత్యేకస్థానం పొందిందని చెప్పారు. 69,052 కుటుంబాలకు 100 రోజుల పాటు ఉపాధిని కల్పించడంతో ప్రతి కూలీకి సగటు 74 నుంచి 85రోజుల వరకు పని లభించినట్టు చెప్పారు. హార్టికల్చర్‌లో 10,939 ఎకరాలు సాగు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించామన్నారు.161లక్షల పనిదినాలను కల్పించడం ద్వారా 3వ స్థానం,కూలీలకు సగటు రోజువారీ వేతనంగా రూ.263.19 చెల్లించి రాష్ట్రంలో 8వస్థానం సాధించినట్టు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.737.32కోట్లు ఖర్చుపెట్టామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పనుల్లోను పురోగతి సాధించినట్టు చెప్పారు. పల్లెపండగలో భాగంగా రూ.250 కోట్ల వ్యయంతో సీసీరోడ్లు, బీటీ రోడ్లు, డబ్ల్యూబీఎం రోడ్లు నిర్మించినట్టు చెప్పారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పలు పనులకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. వ్యవసాయానుబంధ రంగాల్లో 15శాతం వృద్ధి వ్యవసాయానుబంధ రంగాల్లో 15శాతం వృద్ధి సాధించాలని కలెక్టర్ ఆదేశించారు.కలెక్టరేట్ నుంచి ఆయన జిల్లాలోని ఐటీడీఏ పీవోలు,పలుశాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రానున్న మూడేళ్లలో సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించేందుకు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. 104 చెక్‌డ్యాంలకు మరమ్మతుల చేశామన్నారు.కాఫీ పంటను విస్తరించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. రిజర్వాయర్లలో మత్స్యసంపదను పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. 17,170 ఎకరాల్లో ఉద్యానవనపంటల సాగుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఆశ్రమ పాఠశాలలకు కాలం చెల్లిన ఆహార పదార్థాలను సరఫరా చేస్తే సంబంధింత సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మోదకొండమ్మతల్లి జాతర సందర్భంగా హోటళ్లు తనిఖీలు చేయాలన్నారు.వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీటి వనరులు,చేతిపంపులు మరమ్మతులు చేపట్టాలన్నారు.తాగునీటి సమస్యపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేసీ,ఇన్చార్జి పాడేరు ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్‌గౌడ,రంపచోడవరం,చింతూరు ఐటీడీఏ పీవోలు సింహాచలం,అపూర్వభరత్,జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నందు,హార్టికల్చర్ అధికారి రమేష్‌కుమార్‌రావు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి నరసింహులు,జిల్లా సెరికల్చర్ అధికారి అప్పారావు,మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు,ఎస్ఎంఐ డీఈఈ నాగేశ్వరరావు,సీపీవో పట్నాయక్,ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌కుమార్,అన్ని మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు. పలు అంశాల్లో రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం కలెక్టర్ దినేష్‌కుమార్ -
గంగవరం పోర్టులో రెండు లోకో ఇంజిన్లు
పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టులో యాజమాన్యం అదనంగా రెండు లోకో ఇంజిన్లను మంగళవారం ప్రవేశపెట్టింది. దీంతో నౌకాశ్రయ నిర్వహణ సామర్థ్యం పెరగడంతో పాటు ర్యాక్ హ్యాండ్లింగ్ సామర్థ్యం కూడా మెరుగుపడనుంది. గంగవరం పోర్టు స్థిరంగా మెరుగైన సేవలు అందించడంతో పాటు కార్గో నిర్వహణ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా పోర్టు మేనేజ్మెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ పోర్టులో కొత్తగా రెండు లోకో ఇంజిన్లు ప్రారంభించడం ద్వారా దిగుమతిదారులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. -
స్టీల్‌ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో ఏపీ ఎస్పీఎఫ్
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లోకి సీఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్)ను నియమించబోతున్నారు. స్టీల్‌ప్లాంట్ పొదుపు చర్యల్లో భాగంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్టీల్‌ప్లాంట్ సీఐఎస్ఎఫ్ యూనిట్ నుంచి సుమారు 438 మందిని తగ్గించి ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. వారి స్థానంలో మొదట హోంగార్డులను నియమించాలనుకున్నారు. స్టీల్‌ప్లాంట్ వంటి సున్నితమైన పరిశ్రమలో హోంగార్డులు సరికాదని నిర్ణయించి, ఆ స్ధానంలో ఎస్పీఎఫ్ సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఎట్టకేలకు ఆదివారం కేంద్ర ఉక్కు సహాయమంత్రి శ్రీనివాసవర్మ, ఉక్కు కార్యదర్శి సందీప్ పౌండ్రిక్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిసింది. ఇందులో భాగంగా విజయవాడలోని ఏపీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. స్టీల్‌ప్లాంట్‌లో విధులు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన వారు ఈ నెల 10లోగా తమ అంగీకారం తెలపాలని అందులో పేర్కొన్నారు. మొదటి దశలో 100 మందిని, ఆ తర్వాత దశల వారీగా సిబ్బందిని నియమించేందుకు అంగీకరించినట్లు ఉక్కు అధికార వర్గాల సమాచారం. -
1వ తేదీనే పూర్తిస్థాయిలో పింఛన్ల పంపిణీకి చర్యలు
● కలెక్టర్ దినేష్‌కుమార్ సాక్షి,పాడేరు: సామాజిక పింఛన్లను ప్రతినెలా 1వ తేదీనే పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు. చింతలవీధి పంచాయతీ అడారిమెట్టలో మంగళవారం సామాజిక పింఛన్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఆడారిమెట్ట గ్రామంలో పింఛన్ పొందుతున్న ఓ వితంతువు బీఈడీ చదివి కూడా ఉపాధి లేక ఖాళీగా ఉండడం, ఆమె తోబుట్టువులు ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా ఉండడంపై కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు.వారికి నైపుణ్య శిక్షణ అందించి ఉపాఽధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీడీ మురళీ,ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి,సర్పంచ్ వంతాల సీతమ్మ,ఉప సర్పంచ్ సూరిబాబు,మాజీ ఎమ్మెల్యే గిడ్డి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.జిల్లాలో మంగళవారం సాయంత్రం 6గంటల సమయానికి 93.93శాతం పింఛన్ల పంపిణీని పూర్తిచేసినట్టు కలెక్టర్ దినేష్‌కుమార్ తెలిపారు.1,22,654మందికి గాను 1,15,203మందికి పింఛన్ పంపిణీ పూర్తయిందని చెప్పారు. -
తొలిరోజు హాజరు నామమాత్రం
● వేసవిలో ఇంటర్ తరగతులపైవిద్యార్థుల అనాసక్తి ● ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు సాక్షి,పాడేరు: జిల్లాలోని జూనియర్ కాలేజీలు మంగళవారం తెరుచుకున్నాయి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమైనప్పటికీ విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. విద్యారంగంలో సంస్కరణల పేరిట కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఏ ఒక్కరికీ రుచించడం లేదనేది తేటతెల్లమవుతోంది. ఏటా వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తుంటారు. కానీ తాజా పరిణామాలతో ఇటీవలే పరీక్షలు రాసి.. వేసవి సెలవుల మూడ్‌లోకి వెళ్లిన విద్యార్థులను కాలేజీలకు రండి అని కబురు పంపినా, వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించలేదు. జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు 17 గురుకుల కళాశాలలు, 19 కేజీబీవీలు,ఐదు హైస్కూల్ ప్లస్ విద్యాలయాలు ఉన్నాయి.ఈ విద్యాలయాల్లో ఆరు వేలమంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు.వారంతా తొలిరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులకు హాజరుకావాల్సి ఉండగా, కేవలం 10శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 30 మంది, హుకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 24 మంది ఇంటర్ విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. -
పశుసంపద పరిరక్షణకు కృషి
సాక్షి,పాడేరు: ఉపాధి హమీ పథకం నిధులు రూ.50.25లక్షలతో జిల్లాలో పశువులకు 150 తాగునీటి తొట్టెలను నిర్మిస్తున్నామని, కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ తెలిపారు. కుమ్మరిపుట్టు గ్రామంలో పశువుల తాగునీటి తొట్టెల నిర్మాణ పనులకు కలెక్టర్ మంగళవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పశుసంపద పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. వేసవిలో పశువులకు తాగునీటి దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా నీటి తొట్టెల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.33,500 ఖర్చు చేస్తున్నామన్నారు. డ్వామా పీడీ విద్యాసాగర్, ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఉపాధి హమీ పథకం ఏపీడీ శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు. రూ.50.25లక్షలతో నీటితొట్టెల నిర్మాణం కలెక్టర్ దినేష్‌కుమార్ -
అపూర్వ సమ్మేళనం
● 1970 –1995 వరకు చదువుకున్న 27 బ్యాచ్‌ల విద్యార్థుల సమావేశం ● పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం: అక్కడ పాత మిత్రులు జ్ఞాపకాలు కలబోసుకున్నారు. సుమారు 30 ఏళ్ల నాటి ముచ్చట్లు చెప్పుకున్నారు. అప్పటి గురువులను స్మరించుకున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లి ఆర్సీఎం స్కూల్ 1970 నుంచి 1995 వరకు పదో తరగతి వరకు చదువుకున్న 27 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు స్కూల్ ప్రాంగణంలో మంగళవారం సమవేశమయ్యారు. పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆద్యంతం అలరించింది. పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో దశాబ్ధాల క్రితం నాటి స్నేహ బృందాలు కలుసుకున్నాయి. ఆనందోత్సాహాలతో సందడి చేసింది. ఈ పాఠశాలలో చదివి ఇంజినీర్లు, టీచర్లు, లాయర్లు, సాప్ట్వేర్ నిపుణులు, రాజకీయ ప్రముఖులు వంటి ఉన్నత స్థానాలకు ఎదిగిన వారంతా తమ పాత స్మృతులను నెమరవేసుకున్నారు. ఒకరి యోగక్షేమాలను ఒకరు అడిగి తెలుసుకున్నారు. తాము జీవితంలో ఎలా ఎదిగిందీ..ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పాఠశాల పరిస్థితులు, వాటి అభివృద్ధి గురించి ఆరా తీశారు. విద్యార్థుల ఉన్నతికి ఎనలేని కృషి చేసిన అప్పటి హెచ్ఎంలు ఇన్నయ్య, జోజిబాబు ఫాదర్స్ చిత్రపటాల వద్ద పూర్వ విద్యార్థుఽలు నివాళుర్పించారు. ఇద్దరు గురువులను స్మరించుకున్నారు. ఇద్దరు హెచ్ఎంలు, అప్పటి గురువులు అందించిన ప్రోత్సాహంతోనే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామని వారి భావాలను వ్యక్త పరిచారు. పూర్వ విద్యార్థి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అపూర్వ సమ్మేళనంలో పాల్గొని, తోటి పూర్వ విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని ఎమ్మెల్యేగా సేవలు అందించిన మాజీ ఎమ్మెల్యే గణేష్‌తో పూర్వ విద్యార్ధులు ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. అనంతరం పలువురు ప్రముఖులను సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యచరణను సభలో చదివి వినిపించారు. ఆర్థికంగా వెనకబడిన పూర్వ విద్యార్థులకు సహాయపడాలని కూడా పూర్వ విద్యార్థులు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. పలువురు గురువులను సన్మానించారు. 27 బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు చదువులమ్మ ఒడిలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ సరదాగా గడిపారు. -
గంజాయి కేసులో నిందితుల అరెస్ట్, రిమాండ్
పెందుర్తి: ఒడిశా నుంచి నాసిక్‌కు రూ.10 లక్షల విలువైన 180 కిలోల గంజాయిని తరలిస్తూ పోలీసులకు సోమవారం చిక్కిన కేసులో ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు వెస్ట్ జోన్ ఏసీపీ ఏబీ పృధ్వీతేజ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ తెలిపిన వివరాలు.. ముంచంగిపుట్కు చెందిన బిసోయి సహదేవ్, కొర్ర సన్యాసిరావు, మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన అజయ్ సామ్ చావన్, అంకిత్ జోషి, శ్రీనివాస్ వాగ్, ఒడిశాకు చెందిన ప్రేమ్‌కుమార్, దావుద్‌ఖాన్ ఓ ముఠా. వీరిలో దావుద్‌ఖాన్, శ్రీనివాస్ వాగ్ ప్రధాన సూత్రదారులు. వీరు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఒడిశా ప్రాంతాల్లోని గంజాయిని సేకరించి దేశంలోని అన్ని ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఫోర్స్ మినీ టెంపో ట్రావెలర్‌లో 180 కిలోల గంజాయిని ఒడిశా నుంచి అరకు మీదుగా నాసిక్‌కు తరలించేందుకు విశాఖ నగరం వైపు వెళుతున్నారు. వ్యాన్‌కు ముందు రెండు బైక్‌లు ఎస్కార్ట్‌గా ఉన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, పెందుర్తి పోలీసులు సీఐ కె.వి.సతీష్‌కుమార్ సారథ్యంలో పెందుర్తి మండలం రాజయ్యపేట సమీపంలో కాపు కాశారు. మినీ వ్యాన్‌ను అడ్డుకుని అందులో పరిశీలించగా గంజాయి పట్టుబడింది. ఐదుగురు నిందితులు సహదేవ్, సన్యాసిరావు, అజయ్, అంకిత్, ప్రేమ్‌కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ వెల్లడించారు. వారి నుంచి గంజాయి, మినీ టెంపోతో పాటు రెండు బైక్‌లు, రూ.10 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ కె.వి.సతీష్‌కుమార్, ఎస్ఐ స్వామినాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన మరో ఇద్దరి కోసం గాలింపు మీడియాతో వెస్ట్‌జోన్ ఏసీపీ పృధ్వీతేజ -
స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకోవాలి
విశాఖ విద్య: అమెరికాలో ఉన్నత విద్య, పరిశోధనలకు అందించే వివిధ స్కాలర్షిప్లను భారతీయ యువత సద్వినియోగం చేసుకోవాలని యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైన్నె రీజినల్ ఆఫీసర్ మాయా సుందర రాజన్ అన్నారు. మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల పరిధిలో ఫుల్బ్రైట్ నెహ్రూ స్కాలర్‌షిప్‌తో పాటు వివిధ స్కాలర్‌షిప్‌లపై అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఫుల్బ్రైట్ స్కాలర్‌షిప్‌లపై విస్తృత అవగాహన కల్పించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశంతో ఉన్నత విద్య సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా ఈ స్కాలర్షిప్లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఫుల్బ్రైట్ స్కాలర్షిప్ 1946లో ప్రారంభమైందని, ప్రస్తుతం 160 దేశాల్లో ఇది అమలవుతుందని చెప్పారు. ఇప్పటివరకు నాలుగు లక్షల మందికి ఈ స్కాలర్షిప్ ద్వారా అమెరికాలో ఉన్నత విద్యను పొందే అవకాశాన్ని పొందారని చెప్పారు. ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎం.వి.ఆర్. రాజు మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్య, పరిశోధన జరపడానికి ఎంతో ఉపయోగకరంగా స్కాలర్షిప్లు నిలుస్తాయని చెప్పారు. ఈ స్కాలర్షిప్లు సాధించిన వారు విదేశాల్లో పొందే వివిధ సదుపాయాలు, అవకాశాలు తెలియజేశారు. ఏ దేశంలో పరిశోధన చేయాలి అనే అంశంపై నిర్దిష్టమైన అవగాహనతో ఉండాలని సూచించారు. -
ఆర్టీసీ కండక్టర్ అనుమానాస్పద మృతి
సబ్బవరం: టెక్కలిపాలెం గ్రామం సమీపంలోని రైవాడ కాలువలో వాల్తేరు డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ గిడితూరి వెంకటరమణ (54) ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కై లాసపురం కస్తూరినగర్‌లో నివాసం ఉంటున్న వెంకటరమణ స్వగ్రామం టెక్కలిపాలెం. అతని తండ్రి ముత్యాలు డీఎల్బీలో ఉద్యోగం చేయడంతో కై లాసపురంలో స్థిరపడ్డారు. అయితే స్వగ్రామం టెక్కలిపాలెంలో భూమి కొనాలని వెంకటరమణ భావించి, బంధువులతో మాట్లాడారు. ఈ మేరకు తన స్నేహితుడు వాసుపల్లి ఎల్లాజీతో కలిసి ఆదివారం ఉదయం రూ.20 వేలు తీసుకుని టెక్కలిపాలెం వచ్చారు. భూమి కొనుగోలు విషయంలో ఇరువర్గాల మధ్య బేరం కుదరకపోవడంతో మధ్యాహ్నం అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. అయితే సాయంత్రం 6 గంటల సమయంలో వెంకటరమణ రైవాడ కాలువలో స్నానానికి వెళ్లి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి పెద్ద కుమారుడు లీలా వంశీనాథ్ సోమవారం ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అతని స్నేహితుడు ఎల్లాజీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వెంకటరమణకు భార్య సరోజినీదేవి, కుమారులు లీలా వంశీనాథ్, నీరజ్ ఉన్నారు. -
నర్సుల పోస్టులకు ‘నకిలీ’ పత్రాలు
మహారాణిపేట(విశాఖ): నర్సుల పోస్టుల భర్తీ ప్రక్రియలో నకిలీ సర్టిఫికెట్లు వెలుగులోకి వచ్చాయి. కొందరు నర్సింగ్ అభ్యర్థులు అదనంగా 15 మార్కులు పొందడానికి కరోనా సమయంలో పనిచేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అలాగే.. ప్రభుత్వ ఆసుపత్రులు లేదా కళాశాలల్లో పనిచేస్తున్న నర్సులు కూడా తిరిగి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రాథమిక జాబితాపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం ఉన్నతాధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. దీంతో సంబంధిత అభ్యర్థుల దరఖాస్తులను అధికారులు పక్కన పెట్టారు. దీని కారణంగా నర్సింగ్ అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల ఆలస్యమవుతోందని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మొదట 106 నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తర్వాత మరో 264 పోస్టులు అదనంగా చేరడంతో మొత్తం 370 పోస్టుల భర్తీ చేపట్టారు. ఈ పోస్టుల కోసం గతంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా 8,300 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 27న ప్రాథమిక జాబితా విడుదల చేయగా, దానిపై 1,570 అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలను పరిశీలించిన అధికారులు..నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన వారు, ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. కరోనా సమయంలో పని చేసిన వారికి 15 అదనపు మార్కులు ఇస్తుండటంతో చాలా మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకురాలు డాక్టర్ రాధారాణి ఆధ్వర్యంలో దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులు.. వివిధ ప్రొగ్రామ్‌ల కింద పనిచేసిన వారి దరఖాస్తులను తిరస్కరించారు. సరైన వివరాలు సమర్పించని వారి దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. కాగా.. మరో మూడు రోజుల్లో నర్సుల పోస్టులకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేస్తామని డాక్టర్ రాధారాణి సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. ఈ జాబితాపై కూడా అభ్యంతరాలు స్వీకరించి, అనంతరం రోస్టర్ ప్రకారం ఎంపిక జాబితాను ప్రకటిస్తామని ఆమె వివరించారు. కరోనా సమయంలో పనిచేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన అభ్యర్థులు అదనంగా 15 మార్కుల కోసం అడ్డదారులు ఉన్నతాధికారుల తనిఖీల్లో బండారం బట్టబయలు -
భారత వ్యవసాయ ఇంజినీర్ల సమాఖ్య డైరెక్టర్‌గా వెంగయ్య
రంపచోడవరం: భారత వ్యవసాయ ఇంజినీర్ల సమాఖ్య డైరెక్టర్‌గా 2025–26 సంవత్సరానికి పందిరిమామిడి వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పి.సి. వెంగయ్య ఎన్నికయ్యారు. జూమ్ ద్వారా జరిగిన సమావేశంలో సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత వ్యవసాయ ఇంజినీర్ల సమాఖ్య (ఐఎస్‌ఏఈ) ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల్లో చాప్టర్స్ ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రతి రాష్ట్రంలో వ్యవసాయ ఇంజినీరింగ్ విభాగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయంలో అధునాతన యంత్రాలు, సాంకేతికత కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. దక్షిణ భారత దేశం నుంచి ఎన్నికై న ఏకై క శాస్త్రవేత్తగా డాక్టర్ వెంగయ్య గుర్తింపు పొందడం విశేషం. -
నాలుగో లైన్‌కి మోక్షం
● కొత్తవలస–విజయనగరం మధ్య కొత్త రైల్వే లైన్ ● రూ.239.91 కోట్లతో టెండర్లు ఆహ్వానించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే ● రెండేళ్లలో పూర్తి చేసేలా నిబంధనలు ● లైన్ పూర్తయితే సరకు రవాణా మరింత వేగవంతంసాక్షి, విశాఖపట్నం: ఐదేళ్ల క్రితం నాటి ప్రతిపాదనలు ఎట్టకేలకు పట్టాలెక్కుతున్నాయి. తూర్పు కోస్తా రైల్వే ప్రాజెక్టులపై సీతకన్ను వేసిన రైల్వే బోర్డు.. జోన్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత కీలక ప్రాజెక్టులపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా సరకు రవాణాతో పాటు.. రైల్వే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేలా కొత్తవలస–విజయనగరం నాలుగో రైల్వే లైన్‌కు మోక్షం కలిసింది. ఈ లైన్ నిర్మాణానికి రూ.239 కోట్లతో ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ టెండర్లు ఆహ్వానించింది. టెండర్లు ఖరారు చేసిన తర్వాత... రెండేళ్లలో పనులు పూర్తి కానున్నాయి. వాల్తేరు పరిధిలో ఉన్న కొత్తవలస, విజయనగరం మధ్య నాలుగో రైల్వే లైన్‌ని నిర్మించాలని అధికారులు రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ని కూడా సిద్ధం చేసి నాలుగేళ్ల క్రితం పంపించగా.. దానికి ఆమోదముద్రవేశారు. కాని.. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాథమికంగా నిధులు మంజూరుకు పరిపాలన పరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయి. కానీ.. టెండర్లు పిలవడంలో మాత్రం ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి.. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన తర్వాత.. ఒక్కో ప్రాజెక్టుపై రైల్వే బోర్డు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కొత్తవలస–విజయనగరం మధ్య నాలుగో రైల్వే లైన్‌కు తాజాగా టెండర్లు ఆహ్వానించారు. రూ.239 కోట్లతో నిర్మాణానికి.. కొత్తవలస విజయనగరం మధ్య రైల్వేలైన్లు కీలకంగా మారాయి. విశాఖపై వచ్చే రద్దీని నియంంత్రించేందుకు కొత్తవలస జంక్షన్ ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇందుకనుగుణంగా.. విజయనగరం, కొత్త వలస జంక్షన్ మధ్య ఫోర్త్‌లైన్ అవశ్యమని గుర్తించారు. టూ పాకెట్ సిస్టమ్‌తో టెండర్లు ఆహ్వానించారు. దాదాపు 35 కిలోమీటర్ల మేర ఈ లైన్ రాబోతోంది. మొత్తం రూ.239.91 కోట్లతో టెండర్లు పిలిచారు. ఏప్రిల్ 25 వ తేదీ వరకూ టెండర్లు వేసేందుకు గడువు విధించారు. మొత్తం 4 షెడ్యూల్స్‌లో పనులు నిర్వహించనున్నారు. వర్క్ ఆర్డర్ ఖరారు చేసిన తర్వాత... 24 నెలల్లో పనులు పూర్తి చెయ్యాలని నిబంధన విధించారు. ఈ లైన్ పూర్తి చేస్తే వైజాగ్రైల్వే స్టేషన్‌కు రైళ్ల రద్దీ నిర్వహణ సులభతరమవుతుంది. అదేవిధంగా.. వైజాగ్ పోర్టుతో పాటు స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రధాన పరిశ్రమలకు సరకు రవాణా మరింత సులభతరమవుతుంది. పాసింజర్ రైళ్లపై ప్రభావం పడకుండా.. గూడ్స్ రైళ్లకు మార్గం సుగమమవుతుందని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు చెబుతున్నారు. -
అప్పన్న చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్ష
ఏర్పాట్లపై చర్చిస్తున్న ఈవో సుబ్బారావు, సీఎఫ్‌వో భ్రమరాంబ సింహాచలం: ఈ నెల 30న జరిగే సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ డి.భ్రమరాంబ దేవస్థానం అధికారులను ఆదేశించారు. చందనోత్సవం ఏర్పాట్లపై సోమవారం ఆమె దేవస్థానం ఈవో కె.సుబ్బారావు, ఇంజినీరింగ్ అధికారులు, విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. వీలైనంత వరకు ఎక్కువ మందికి దర్శనం కల్పించే లక్ష్యంతో అధికారులంతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా పరిశుభ్రత, క్యూలైన్ మెయింటెనెన్స్, క్యూల్లో భక్తులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ, షెల్టర్లు ఏర్పాటు, కొండపైన, కొండదిగువ తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవ నిర్వహణ అంతా సీసీ కెమెరాల నీడలో జరగాలని, ప్రతీ క్యూలైను, ప్రతీ మార్గం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రతీ ప్రదేశం వద్ద శీతల పానీయాలు అందించాలని సూచించారు. చందనోత్సవానికి వచ్చే ప్రతీ భక్తుడికి త్వరితగతిన దర్శనం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో దేవస్థానం ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, ఏఈవోలు ఆనంద్‌కుమార్, శ్రీనివాసరావు, డీఈ హరి, సూపరింటెండెంట్లు నరసింగరావు, వెంకటరమణ, గాయత్రి, రాజ్యలక్ష్మి, ప్రసన్నలక్ష్మి, సత్యవాణి, శ్రీనివాస్, ఏఈలు తాతాజీ, బంగార్రాజు, రవిరాజు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
జల్ జీవన్‌లో.. నిర్లక్ష్య ధారలు
జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులు జిల్లాలో పడకేశాయి. ఈ పథకం వల్ల తాగునీటి వనరుల సద్వినియోగం, తలసరి నీటి వినియోగ పరిమాణం పెంపుదల, నూరుశాతం రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుందని భావిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల పథకం ఉద్దేశమే నీరుగారుతోంది. బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సక్రమంగా చేయడం లేదని తెలిసింది.సాక్షి,పాడేరు/అరకులోయ టౌన్/రంపచోడవరం: జల్‌జీవన్ పథకంతో సురక్షితమైన తాగునీరందుతుందని భావించిన జిల్లా ప్రజలకు కూటమి ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఇంటింటికీ కుళాయిల ద్వారా 22 మండలాల పరిధిలో 2,40,057 కుటుంబాలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభమైన జల్‌జీవన్ మిషన్.. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నీరుగారుతోంది. పలు గ్రామాల్లో పనులు ఇంకా ప్రారంభం కాకపోగా, ఇప్పటికే ప్రారంభమైన పనులకు చాలా చోట్ల బ్రేక్ పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పథకాలు గిరిజనులకు తాగునీరు అందిస్తుండగా, కూటమి ప్రభుత్వంలో ఈ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాడేరు,రంపచోడవరం,అరకులోయ నియోజకవర్గాల్లో జల్‌జీవన్ మిషన్ తాగునీటి పథకాల నిర్మాణాలకు నిధులు సమస్య అధికంగా ఉందని కాంట్రాక్టర్లు తెలిపారు. -
ఖైదీల సౌకర్యాలపై ఆరా
ఆరిలోవ(విశాఖ): కేంద్ర కారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ సోమవారం సందర్శించారు. జైలు అధికారులతో కలిసి లోపల ఖైదీల బ్యారక్‌లు, పరిసరాలు, పరిశుభ్రత తదితరాలను పరిశీలించారు. జైలు ఆస్పత్రి, జ్ఞాన సాగర్ గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఖైదీల సంఖ్య, వారికి అందుతున్న సౌకర్యాలు, భోజనం, వైద్యం తదితరాల గురించి జైలు సూపరింటెండెంట్ ఎం.మహేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారు ఏయే నేరాలు, కేసులపై వచ్చా రో అడిగి తెలుసుకున్నారు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జైలు ఉప పర్యవేక్షణాధికారులు జవహర్‌బాబు, సాయిప్రవీణ్, జైలర్లు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. -
సీలేరులో మొసలి హల్చల్
రిజర్వాయర్ వద్ద మొసలి సీలేరు: ఏపీ జెన్కో సీలేరు గుంటవాడ రిజర్వాయర్ ఒడ్డున గత వారం రోజులుగా ఓ మొసలి హల్చల్ చేస్తోంది. నీటిలో ఉండాల్సిన మొసలి ఒడ్డుకు వచ్చి రోడ్డుకు ఇరు వైపులా తిరుగుతుండడంతో ఆ దారిలో వెళ్లే వారు, ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 10గంటల సమయంలో రిజర్వాయర్ ఒడ్డున తిరుగుతూ సుమారు 12 అడుగుల పొడవున్న మొసలి కొందరి కంటపడింది. రిజర్వాయర్ ఒడ్డుకు మొసలి రావడంతో అక్కడి ఉద్యోగులు జెన్కో ఏఈఈ సురేష్, విజిలెన్స్ ఉద్యోగి కోటేశ్వరరావుకు తెలియజేశారు. వెంటనే వారు సంబంధిత సిబ్బందితో వెళ్లి దానిని సురక్షితంగా రిజర్వాయర్‌లోకి పంపించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఒడిశా భూ భాగంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎనిమిది నెలల కిందట ఓ మొసలి రిజర్వాయర్ నుంచి బయటకు వచ్చి మృతి చెందింది. దాన్ని చిత్రకొండ అటవీశాఖ అధికారులు అప్పట్లో ఖననం చేశారు. -
బస్సు డ్రైవర్ నిర్వాకంతో ప్రయాణికులకు గాయాలు
ఎటపాక: బస్సు డ్రై వర్ నిర్లక్ష్యం కారణంగా పలువురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు. గోకవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కూనవరం నుంచి భద్రాచలం బయలుదేరింది. డ్రైవర్ అతివేగంగా బస్సును నడపడంతో ప్రయాణికులు అతనిని వారించారు. అయినప్పుటికీ డ్రైవర్ తీరు మార్చుకోలేదు. నెల్లిపాక సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఉన్న కల్వర్ట్ఎక్కుతున్న సమయంలో బస్సులోని ప్రయాణికులంతా సీట్లలోంచి బస్ టాప్ వరకు ఎగరడంతో చెల్లాచెదురయ్యారు.దీంతో పలువురు గాయపడ్డారు. కొందరి సెల్ ఫోన్లు కిందపడి పగిలిపోయాయి. ఓ బాలిక తల,చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి నెల్లిపాక పీహెచ్సీలో చికిత్స చేయించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడపడం వల్లే తమకు గాయాలయ్యాయని పలువురు ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు,పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేసారు. గాయపడిన ప్రయాణికుల పూర్తి వివరాలు తెలియలేదు. -
180 కిలోల గంజాయి పట్టివేత
● ఐదుగురు నిందితుల అరెస్ట్, మినీ వ్యాన్, రెండు బైక్‌లు స్వాధీనం ● మరో కేసులో నాలుగున్నర కిలోల గంజాయితో వ్యక్తి అరెస్ట్ పెందుర్తి: ఒడిశా నుంచి నాసిక్‌కు తరలిస్తున్న గంజాయిని టాస్క్‌ఫోర్స్, పెందుర్తి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. సీఐ కె.వి సతీష్‌కుమార్ తెలిపిన వివరాలివి. మినీ వ్యాన్‌లో 180 కిలోల గంజాయిని ఒడిశా నుంచి అరకు మీదుగా నగరం వైపు తరలిస్తున్న సమాచారం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందింది. దీంతో టాస్క్‌ఫోర్స్, పెందుర్తి పోలీసులు పెందుర్తి మండలం రాజయ్యపేట సమీపంలో కాపు కాశారు. మినీ వ్యాన్‌ను అడ్డుకుని అందులో పరిశీలించగా గంజాయి పట్టుబడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. మినీ వ్యాన్‌తో పాటు రెండు బైక్‌లు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ వద్ద.. ఒడిశా రాష్ట్రం పడువా గ్రామం నుంచి నగరానికి గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పెందుర్తి రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. కేరళ కొట్టాయంకు చెందిన ఎస్.పి షరీఫ్ అలియాస్ అదుర్ ఒడిశా నుంచి నాలుగున్నర కిలోల గంజాయిని బ్యాగ్‌లో పట్టుకుని నగరానికి వస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద కాపు కాసి అతడ్ని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. -
అలా భోగాపురానికి..
నాటి అడుగులే.. నేడు రహదారులు..8 విస్తరణ.. 15 కొత్త రోడ్లు ఈ 15 రహదారులలో 8 రోడ్లను విస్తరించనున్నారు. మిగిలిన ఏడు రోడ్లను కొత్తగా అభివృద్ధి చేయనున్నారు. విజయనగరం జిల్లా అయినాడ జంక్షన్ నుంచి రింగ్‌రోడ్–ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ మధ్య 9 మీటర్ల రోడ్డు ఉండగా.. దాన్ని 24 మీటర్లకు విస్తరించనున్నారు. తగరపువలస (చిట్టివలస రోడ్డు) నుంచి మూలకుద్దు మధ్య ఉన్న రోడ్డును 45 మీటర్లకు, దొరతోట రోడ్డు జంక్షన్ నుంచి కుమ్మరిపాలెం మధ్య 60 మీటర్లకు, బోయపాలెం జంక్షన్ నుంచి మంగమారిపేట జంక్షన్, శివశక్తి నగర్ నుంచి హరిత ప్రాజెక్ట్స్, అడవివరం నుంచి గండిగుండం, పినగాడి నుంచి వేపగుంట రోడ్లను విస్తరించనున్నారు. అలాగే దాకమర్రి–రావాడ, చిప్పాడ–పోలిపల్లి (దివీస్ రోడ్డు), నేరెళ్లవలస–తాళ్లవలస, గంభీరం–గంభీరం హైవే, పరదేశిపాలెం–గంభీరం, వేపగుంట–జుత్తాడల మధ్య కొత్త రహదారులను అభివృద్ధి చేయనున్నారు. విశాఖ సిటీ : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన ప్రణాళికలే నేడు బాటలుగా మారుతున్నాయి. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కనెక్టివిటీకి 15 కొత్త రహదారుల నిర్మాణాలకు అడుగులు పడుతున్నాయి. విశాఖ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి సునాయాశంగా, వేగంగా రాకపోకలు సాగించేందుకు కొత్త రోడ్లు సిద్ధం కానున్నాయి. ఇందుకోసం వీఎంఆర్డీఏ అంచనాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. వచ్చే నెలలో టెండర్లు పిలిచి మే నుంచి రహదారుల నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రూ.392 కోట్ల అంచనా వ్యయంతో 82.08 కిలోమీటర్ల మేరకు విస్తరణ, కొత్త రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. వైఎస్సార్ ప్రభుత్వంలో ప్రణాళికలు విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జాతీయ రహదారికి అనుసంధానంగా 15 ప్రత్యామ్నాయ రోడ్లను అభివృద్ధి చేయాలని గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటిని మాస్టర్ ప్లాన్‌లో కూడా చేర్చింది. వీటి లో ఇప్పటికే ఒక రోడ్డు పూర్తి కాగా.. మిగిలిన 14 రహదారుల నిర్మాణానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటి నిర్మాణాలను వీఎంఆర్డీఏతో పాటు జీవీఎంసీ, ఆర్అండ్బీ శాఖలు చేపట్టనున్నాయి. అయితే అత్యధికంగా 8 రహదారుల నిర్మాణ బాధ్యతను వీఎంఆర్డీఏ తీసుకుంటోంది. ఆర్అండ్బీ 3, జీవీఎంసీ 2 రోడ్లను నిర్మించనున్నాయి. మిగిలిన నాలుగు రహదారులను కూడా జీవీఎంసీ, ఆర్అండ్ బీలతో కలిపి వీఎంఆర్డీఏ అభివృద్ధి చేయనుంది. భోగాపురం విమానాశ్రయం కనెక్టివిటీకి 15 రహదారుల అభివృద్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.392 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు ప్రణాళికలు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్మాణాలకు సిద్ధమవుతున్న ఆర్అండ్బీ, వీఎంఆర్డీఏ, జీవీఎంసీ వచ్చే ఏడాది జూన్‌కు పూర్తి భోగాపురం విమానాశ్రయం పనులు పూర్తయ్యేలోగా ఈ రహదారులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విశాఖ నుంచి ఎయిర్‌పోర్టుకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా సునాయాశంగా రాకపోకలు సాగించడానికి అనువుగా ప్రత్యామ్నాయ రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇందుకు సంబంధించి వచ్చే నెలలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి మేలో నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ రోడ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించాం. – కె.ఎస్.విశ్వనాథన్, మెట్రోపాలిటన్ కమిషనర్ రహదారి నిర్మాణ శాఖ కి.మీ. అయినాడ జంక్షన్–ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ ఆర్అండ్బీ 6.5 దాకమర్రి–రావాడ వీఎంఆర్డీఏ 6.66 చిప్పాడ–పోలిపల్లి(దివీస్రోడ్డు) వీఎంఆర్డీఏ 6.32 తగరపువలస–మూలకుద్దు జీవీఎంసీ 3.6 నేరేళ్లవలస–తాళ్లవలస వీఎంఆర్డీఏ 4 దొరతోట జంక్షన్–కుమ్మరిపాలెం ఆర్అండ్బీ 6.2 బోయపాలెం–మంగమారిపేట వీఎంఆర్డీఏ 6 గంభీరం–గంభీరం ఎన్‌హెచ్16 వీఎంఆర్డీఏ 2.2 పరదేశిపాలెం–గంభీరం వీఎంఆర్డీఏ 1.4 మారికవలస–తిమ్మాపురం జీవీఎంసీ, వీఎంఆర్డీఏ 6.3 శివశక్తినగర్–హరిత ప్రాజెక్ట్స్ జీవీఎంసీ, వీఎంఆర్డీఏ 1.7 అడవివరం–గండిగుండం ఆర్అండ్బీ, వీఎంఆర్డీఏ 8 గండిగుండం–చింతలపాలెం వీఎంఆర్డీఏ 9.9 వేపగుంట–జుత్తాడ జీవీఎంసీ 6.05 పినగాడి–వేపగుంట ఆర్ అండ్ బీ 7.25 -
నేటి నుంచి ఉదయం, సాయంత్రం ఓపీ సేవలు
మహారాణిపేట(విశాఖ): కేజీహెచ్‌లో మంగళవారం నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయని సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ తెలిపారు. అన్ని సూపర్ స్పెషాలిటీ అవుట్ పేషంట్ (ఓపీ) విభాగాలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయన్నారు. గతంలో సూపర్‌స్పెషాలిటీ ఓపీలు వారానికి మూడు రోజులు పనిచేసేవి. ఇప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు అన్ని రోజుల్లో ఓపీలు పనిచేస్తాయని వెల్లడించారు. రోగులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. -
ఇంటర్ చదువులకు వేళాయె
● నేటి నుంచి సెకెండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు ● ఈ నెల 23 వరకు పనిచేయనున్న జూనియర్ కాలేజీలు ● ఫస్టియర్ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్ విశాఖ విద్య: జిల్లాలోని జూనియర్ కళాశాలలు మంగళవారం నుంచి తెరుచుకోనున్నాయి. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు బోధనకు అంతా సిద్ధమైంది. ఇటీవలనే పరీక్షలు రాసి, వేసవి సెలవుల మూడ్‌లోకి వెళ్లిన విద్యార్థులంతా కళాశాలలకు తిరిగి రావాల్సిందే. కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యలో సంస్కరణ పేరిట తీసుకొచ్చిన విధానంతో 2025–26 విద్యా సంవత్సరం మంగళవారం నుంచే మొదలుకానుంది. ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అనంతరం జూన్ 2 నుంచి ఇంటర్మీడియెట్ కళాశాలలు పనిచేయనున్నాయి. జిల్లాలో కళాశాలలు ఇలా.. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 211 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో గతేడాది వరకు 188 కళాశాలల్లో అడ్మిషన్లు జరిగాయి. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు –10 , ఎయిడెడ్ కళాశాల–1, ఏపీ సాంఘిక సంక్షేమ–3, ఏపీ గిరిజన సంక్షేమ–1, కేజీబీవీలు–3, బీసీ సంక్షేమ–1, హైస్కూల్ ప్లస్ –9, ప్రైవేటు కళాశాలలు 183 ఉన్నాయి. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లాలో 42,257 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వీరందరికీ మంగళవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇతర జిల్లాల నుంచి విద్యార్థులు రాక జిల్లాలో పదో తరగతి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు రెట్టింపు స్థాయిలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ఇక్కడ ప్రవేశాలు జరుగుతాయి. ప్రతీ ఏటా పదో తరగతి సుమారుగా 28 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. వీరిలో 80 శాతం మేర ఉత్తీర్ణులౌతారు. అయితే 2024–25లో ఇంటర్ మొదటి సంవత్సరంలో సుమారు 40 వేల మంది విద్యార్థులు చేరారు. విశాఖలో ఉన్న సౌలభ్యం, పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చే కళాశాలలు అందుబాటులో ఉండటంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పలువురు విద్యార్థులు నగరంలోని జూనియర్ కళాశాలల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే అడ్మిషన్ల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ప్రైవేటుకు పగ్గాలు ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ఈ నెల 7 నుంచి చేసుకోవచ్చని ప్రభుత్వం విడుదల చేసిన విద్యా క్యాలెండర్లో స్పష్టం చేసింది. మే 31 వరకు అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఈ నెల 7 నుంచి మొదటి సంవత్సరం తరగతులు సైతం ప్రారంభానికి అనుమతినివ్వటంతో జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు పగ్గాలు వచ్చినట్లైంది. ఇప్పటికే అడ్మిషన్ల వేట మొదలుపెట్టిన ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలకు ప్రభుత్వం ఆదేశాలు మరింత జోష్ నింపాయి. పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులను తమ కళాశాలల్లో చేర్చుకునేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదముందని విద్యావేత్తలు అంటున్నారు. నిబంధనలు పాటించాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఇంటర్మీడియెట్‌బోర్డు జారీ చేసిన నిబంధనలను కాలేజీ నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలి. ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరించే కాలేజీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్పాట్ వాల్యూయేషన్ పక్రియను మరో రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేస్తాం. కాలేజీల నిర్వహణపై దృష్టి సారిస్తాం. – పి. మురళీధర్, ఆర్ఐవో -
ఆదివాసుల భూములపై కిరాయి మూకల దాడి
● పంటల ధ్వంసం ● కేసు నమోదు చేసిన పోలీసులు రోలుగుంట: ఆదివాసుల భూములపై పొరుగుజిల్లాకు చెందిన కిరాయి మూకలు దాడి చేసి పంటలు ధ్వంసం చేసిన ఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలివి. ఎం.కె.పట్నం రెవిన్యూ సర్వే నెంబరు 139 లో పది ఎకరాలు మెట్టు భూమి దశాబ్దాలుగా చటర్జీపురం ఆదివాసీల సాగులో ఉంది. వారి సాగును రికార్డులో కూడా నమోదు చేశారు. అయితే ఆ భూమిపై కన్ను పడిన స్థానికేతరుడు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన మల్లిడి రామిరెడ్డి అనే వ్యక్తి 2021లో ఈ భూములను కొనుగోలు చేశామని ఆదివాసీలను అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నం చేశాడు. దీనికి వారా నూకరాజు అనే వ్యక్తి మద్దతు ఇస్తున్నారు. దీంతో ఆదివాసీలు నర్సీపట్నం సివిల్ కోర్టులో మల్లిడి రామిరెడ్డి, వారా నూకరాజుపై కేసు దాఖలు చేశారు. ఈ కేసుల్లో రామిరెడ్డి గైర్హాజరు కాగా నూకరాజు కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా 2023 జనవరిలో ఈ భూమిని తన పేరుతోను, ఐటీడీఏ పాడేరు పరిధిలో టీచర్‌గా పని చేస్తున్న తన కుమారుడు కన్నబాబు పేర్లతో రామిరెడ్డి నుంచి నూకరాజు కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి వారు చటర్జీపురం ఆదివాసీలపై బెదిరింపులకు పాల్పడుతూ దాడులు చేస్తూ వస్తున్నారు. 2023 సెప్టెంబర్‌లో వారా నూకరాజు, టీచర్ కన్నబాబు 70 మంది కిరాయిమూకలతో ఆదివాసీలపై దాడి చేశారు. వారు పెంచుతున్న అరటి, జామచెట్లను ధ్వంసం చేశారు. దీంతో వీరిద్దరిపైనా రోలుగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు వర్గాలతో పొలం జోలికి వెళ్లబోమని, పంటలను ఆలానే ఉంచాలని చెప్పి పోలీసులు సంతకాలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో నూకరాజు మళ్లీ సోమవారం 4 ఆటోలు, 50 మందితో వెళ్లి ఆ భూమిలో పంటలను ధ్వంసం చేశారు. ఈ చర్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నూకరాజును ఆరెస్ట్ చేయాలని సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కమిటీ డిమాండు చేసింది. దీంతో ఎస్ఐ రామకృష్ణారావు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఎస్ఐ విలేకరులతో మాట్లాడుతూ పంట ధ్వంసం కారకుడిని అదుపులోకి తీసుకుని, దాడిలో పాల్గొన్నవారిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. -
నకిలీ బంగారం కేసులో ఇద్దరి అరెస్ట్
సీతమ్మధార : నకిలీ బంగారం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ద్వారకా ఏసీపీ అన్నపు నరసింహమూర్తి తెలిపారు. ఆదివారం ద్వారకా పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈశ్వరరావు, రాఘవేంద్ర సుబ్బారావు గాజువాకకు చెందిన జగదీశ్వరావుతో పరిచయం పెంచుకున్నారు. వారు తమ చెల్లి పేరు మీద 2.9 కిలోల బంగారం బ్యాంకులో ఉందని, దానిని విడిపించాలని జగదీశ్వరావును కోరారు. ఇది నిజమేనని నమ్మిన జగదీశ్వరావు వారికి రూ.68 లక్షలు ఇచ్చి బంగారాన్ని విడిపించాడు. తీరా పరిశీలించగా అందులో కేవలం 200 గ్రాముల అసలైన బంగారం మాత్రమే ఉండటంతో మోసపోయానని గ్రహించిన జగదీశ్వరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ మోసంలో ఎనిమిది మందికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని ఏసీపీ తెలిపారు. వీరిలో ఈశ్వరరావు, రాఘవేంద్ర సుబ్బారావులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1700 గ్రాముల నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ బంగారాన్ని తనఖా పెట్టిన బ్యాంకు ఉద్యోగుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. ఎస్ఐలు ధర్మేంద్ర, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మోదకొండమ్మకు నీరాజనం
సాక్షి,పాడేరు: ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. విశ్వావసు నామసంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ అర్చకులు పూజలు చేశారు.జిల్లా కేంద్రం పాడేరులోని మోదకొండమ్మతల్లి ఆలయానికి ఉదయం 6గంటల నుంచే భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్యం పూజలు జరిపారు. సాయంత్రం వరకు భక్తుల తాకిడి నెలకొంది.ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడుల నేతృత్వంలో భక్తుల సహకారంతో ఉదయం ఉచిత ప్రసాదాలు,మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. ● పాడేరులోని గిరికై లాస్లో గల పురాతన ఉమానీలకంఠేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడు రామం,ఆలయ ధర్శకర్త కొట్టగుల్లి సింహాచలంనాయుడుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. సాయిబాబా, కనకదుర్గమ్మ, అయ్యప్ప, ఆంజనేయస్వామి ఆలయాల్లోను ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంపచోడవరం: మండలంలోని ఐ పోలవరం గోవిందగిరిపై గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు, పంచాంగ పఠనం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గోవిందగిరి మాడవీధుల్లో తిరుచ్చి వాహనంపై స్వామి వారి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, డీఎస్పీ సాయి ప్రశాంత్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు.భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఆలయ అధికారి నారాయణరాజు, వేదపండితులు సాయిరామ్ శర్మ, అర్చక స్వాములు, మణికంఠ స్వామి, శ్రీవారి సేవకుల సమన్వకర్త నల్లమిల్లి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ఉగాది వేడుకలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు పోటెత్తిన భక్తులు -
పదోన్నతుల ‘పంచాయితీ’!
మహారాణిపేట: జిల్లా పంచాయతీ ఉద్యోగుల పదోన్నతుల పంచాయితీ ఆరోపణలకు తావిస్తోంది. ముడుపులు చెల్లిస్తే తప్ప.. ఫైల్ ముందుకు కదలదని ఉద్యోగులు గుసగుసలుపోతున్నారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులకు ఎట్టకేలకు అవకాశం వచ్చినప్పటికీ.. సిబ్బంది మామూళ్ల వ్యవహారంతో ఫైల్ ఇంకా జిల్లా పంచాయతీ కార్యాలయం(డీపీవో)లోనే మూలుగుతోంది. ఈ పదోన్నతులను ఆదాయ వనరుగా మార్చుకోవాలనే కొందరి అత్యాశే ఈ ఫైల్ తొక్కిపెట్టేందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంపీడీవోలు ఫైళ్లు పంపించినా.. పంచాయతీరాజ్‌లో పదోన్నతులు కల్పించే విషయంలో సీనియార్టీ జాబితాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు(ఎంపీడీవో) తయారుచేసి డీపీవోకు పంపాలి. ఈ ప్రకారం జిల్లాలో 32 మందిని అర్హులుగా పేర్కొంటూ జాబితాను డీపీవో కార్యాలయానికి ఎంపీడీవోలు పంపారు. కానీ ఇక్కడ డీపీవో కార్యాలయం నుంచి ఈ జాబితా పంపేందుకు కొందరు బేరసారాలకు దిగుతున్నారన్న ఆరోపణలున్నాయి. పైసలు ఇస్తేనే ఫైల్ పంపుతామని, లేకపోతే పదోన్నతులుండవని తేల్చిచెప్తున్నారట. అందుకే ఈ ఫైల్ ఇంకా విశాఖను దాటలేదని సమాచారం. ఆ ఒక్కడే కారణం? ఆరోపణలపై పాడేరు నుంచి విశాఖ డీపీవో కార్యాలయానికి వచ్చిన ఓ ఉద్యోగి వల్లే పదోన్నతుల్లో తాత్సారం జరుగుతోందని సమాచారం. ఈ ఉద్యోగికి డీపీవో కార్యాలయంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఫైల్ కూడా అతని వద్దే ఉంది. డబ్బులిస్తే తప్ప, ఫైల్‌ను పంపించేది లేదని చెప్తున్నాడట. అధికారుల అండతోనే ఇలా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో 32 మంది ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. దీనిపై డీపీవో శ్రీనివాసరావును వివరణ కోరగా.. పూర్తి స్థాయి వివరాలు రాకపోవడంతో జాబితా సిద్ధం కాలేదన్నారు. కొంత మంది ఎంపీడీవోలు ఈ నెల 26న జాబితాలను పంపారని, మరి కొందరు పంపించాల్సి ఉందన్నారు. అన్ని వివరాలతో ఫైల్ తయారు చేసి, త్వరలోనే పైకి పంపించనున్నట్లు పేర్కొన్నారు. సందిగ్ధంలో 32 మంది పదోన్నతులు రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులకు ఈ నెల 21 నాటికే డీపీవో నుంచి ఫైల్ అమరావతిలో ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లాలి. కానీ ఇప్పటి వరకు జాబితా వెళ్లకపోవడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. మొత్తం 32 మందికి పంచాయతీ కార్యనిర్వహణాధికారి అండ్ రూరల్ డెవలప్మెంట్(ఈవోఆర్డీ)గా పదోన్నతులు అందించే ఫైల్.. విశాఖలోని డీపీవో కార్యాలయంలోనే ఇంకా ఉంది. ఇప్పటికే చాలా జిల్లాల నుంచి పదోన్నతుల ఫైళ్లు అమరావతికి చేరాయి. విశాఖలో మాత్రం ఫైల్‌కు ఇంకా తుది మెరుగులు దిద్దుతూనే ఉన్నారు..! ఉద్యోగుల పదోన్నతుల్లో తాత్సారం చేస్తున్న డీపీవో ఈ నెల 21కే వెళ్లాల్సిన ఫైల్.. ఇంకా డీపీవో ఆఫీస్‌లోనే.. చక్రం తిప్పుతున్న సిబ్బంది.. ఆందోళనలో ఉద్యోగులు -
ఘనంగా ఉగాది సంబరాలు
సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలోని మోదకొండమ్మ ఆలయంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. కలెక్టర్ దినేష్‌కుమార్ జ్యోతి ప్రజ్వనల చేసి ఉత్సవాలను ప్రారంభించారు. పంచాంగకర్త వేదుల సాయిప్రశాంత శర్మ సంవత్సర ఫలితాలను వివరించారు. వర్షాలు పుష్కలంగా కురిసి, పాడి పంటలతో జిల్లా సస్యశ్యామలంగా ఉంటుంద ని చెప్పారు. అనంతరం కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడు తూ జిల్లాలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జిల్లాలో వర్షాలు కురిసి గిరిజన రైతులు సాగు చేసే అన్ని పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు.ఉగాది వేడుకలు ఘనంగా జరగడంతో పాటు కవి సమ్మేళనం ఆసక్తిగా జరగడం సంతోషంగాఉందన్నారు.తెలుగు భాషాభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు.అనంతరం కలెక్టర్ పలుపద్యాలను వినిపించి,వాటి అర్థాలను వివరించారు. అర్చకులకు ఘనంగా సత్కారం ఉగాది సందర్భంగా పలువురు అర్చకులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు.అరకులోయ వేంకటేశ్వరస్వామి ఆలయ అర్చకుడు బాలగణేష్,సూకురుపుట్టు రామలింగేశ్వరస్వామి ఆలయ అర్చకుడు రామకృష్ణ పరమహంస,వంతాల,రాయిగెడ్డ రామాలయాల అర్చకుడు వంతాల అప్పలనాయుడు,కించే సత్యనారాయణలకు రూ.10,116 చొప్పున ఆర్థిక సాయం చెక్‌లను అందజేసి,దుశ్శాలువాలతో సన్మానించారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న మహిళలను కలెక్టర్ సన్మానించారు. సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్,డీఆర్వో పద్మలత,మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి,మాజీ జెడ్పీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ,సర్పంచ్ కొట్టగుళ్లి ఉషారాణి,డీఆర్డీఏ పీడీ మురళీ,జిల్లా ఉద్యానవన అధికారి రమేష్‌కుమార్‌రావు,డ్వామా పీడీ విద్యాసాగర్,ఏపీఎంఐపీ పీడీ రహీం,తహసీల్దార్ వి.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు యువకులను కాపాడిన మైరెన్ పోలీసులు
ఎస్.రాయవరం: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడుకు చెందిన యువకులు,నక్కపల్లి మండలం సారిపల్లి పాలెం గ్రామానికి అమ్మమ్మ ఇంటికి వచ్చి ఆదివారం రేవుపోలవరం తీరానికి వచ్చారు. తీరంలో స్నానం కోసం అన్నదమ్ములైన బర్ల బాలు, గోపిలు సముద్రంలోనికి దిగారు. పెద్ద కెరటం రావడంతో మునిగిపోయారు. ఒడ్డున గస్తీ కాస్తున్న మైరెన్ ఏఎస్ఐ ఎం.కృష్ణ,కానిస్టేబుల్ పి.చినబాబు.హెచ్జిలు అప్పలకొండ, జగన్నాథం వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. సకాలంలో మైరెన్ పోలీసులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. యువకులను కాపా డిన మైరెన్ పోలీసులను పెంటకోట పోలీస్‌స్టేషన్ మైరెన్ సీఐ మురళి అభినందించారు. -
నేత్రపర్వం అప్పన్న పెళ్లిరాట ఉత్సవం
● శాస్త్రోక్తంగా పంచాంగశ్రవణం ● వచ్చేనెల 8న వార్షిక కల్యాణోత్సవం ● ఆస్థానమండపం వరకు వచ్చిన సూర్యకిరణాలు సింహాచలం : ఉగాది పర్వదిన వేళ సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి పెళ్లిరాట మహోత్సవాన్ని ఆదివారం కనులపండువగా నిర్వహించారు. వచ్చే నెల 8న స్వామి వారి వార్షిక కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని భక్తజన సందోహం మధ్య మధ్యాహ్నం 3.30 గంటల నుంచి పెళ్లి రాట కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని పెళ్లికుమారుడుగా అలంకరించి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో సహా ఆలయ ఆస్థాన మండపంలో వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, షోడశోపచార పూజలు నిర్వహించారు. తొలుత దేవస్థానం పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు పంచాగ పఠనం చేశారు. అనంతరం వార్షిక కల్యాణోత్సవం జరిగే ఉత్తరరాజగోపురం ఎదుట ప్రాంగణంలోను పెళ్లిరాటను శాస్త్రోక్తంగా వేశారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, దేవస్థానం పంచాంగ రచయిత తెన్నేటి శ్రీనివాసశర్మ, అర్చకులు, వేదపండితులు, పారాయణదారులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థానం ఈవో కె.సుబ్బారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. అప్పన్న ఆదాయం–5, వ్యయం–2 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి ఆదాయం 5, వ్యయం 2గా పంచాంగం ప్రకారం ఆలయ పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు పేర్కొన్నారు. స్వాతి నక్షత్రం, తులారాశి వాడైన రశ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామివారికి విశ్వావసు నామ సంవత్సరంలో వ్యయం కంటే ఆదాయమే అధికమని పేర్కొన్నారు. ఆస్థానమండపం వరకు సూర్యకిరణాలు స్వామి మూలవిరాట్‌పై పడే సూర్యకిరణాలను చూసేందుకు వచ్చిన భక్తులకు ఈసారి నిరాశే ఎదురైంది. ఈఏడాది ఆస్థానమండపం వరకు సూర్యకిరణాలు వచ్చాయి. కానీ అప్పటికే ఉన్న భక్తులను నియంత్రించడంలో సిబ్బంది విఫలమవడం, వెంటనే మబ్బులు వచ్చేయడంతో మూలవిరాట్‌పై సూర్యకిరణాలను చూసే భాగ్యానికి భక్తులు నోచుకోలేదు. -
ఐపీఎల్ మ్యాచ్ చూసిన అనాథలు
● సీపీకి కృతజ్ఞతలు అల్లిపురం: వైఎస్సార్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ను వీక్షించేందుకు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి 65 మంది అనాథ పిల్లలకు అవకాశం కల్పించారు. భీమిలిలోని ఎస్‌వోఎస్ సంస్థ నుంచి 45 మంది, గాజువాకలోని డిజైర్ సంస్థ నుంచి 20 మంది పిల్లలు ఈ మ్యాచ్‌ను చూశారు. పోలీస్ కమిషనర్ వారితో కలిసి కొంత సమయం గడిపారు. తమకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు పిల్లలు సీపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని వారు పేర్కొన్నారు. -
గురువుతోనే ఆధ్యాత్మిక ఉన్నతి సాధ్యం
పెదబయలు: గురువులను ఆశ్రయించి సాధన చేస్తేనే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవడం సాధ్యమవుతుందని సద్గురువులు రావడి యోగేంద్ర స్వామి, బుక్కా రాజనంద స్వామి అన్నారు. మండలంలోని గోమంగి పంచాయతీ సరియాపల్లి, కుమ్మరివీధి గ్రామాల మధ్య ఆదివారం జరిగిన 77వ ఆదివాసీ గిరిజన వేదాంత తత్వప్రబోధాలు కార్యక్రమంలో తత్వమసిపై ప్రవచించారు. ముందుగా అఖండ జ్యోతిని ప్రజ్వలన చేశారు. గురువుపాదాలు పట్టుకుని జీవనం సాగిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని చెప్పారు. విశ్వావసు నామ సంవత్సరంలో అందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు.ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఈ తత్వప్రబోధాలు సాగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగం అధిపతి జర్ర అప్పారావు మాట్లాడుతూ దైవ భక్తి ఉన్నవారు ప్రేమ, దయ,జాలి, కరుణ,మానవత్వంతో జీవితం సాగిస్తారని చెప్పారు. సామూహిక కుంకుమార్చన ఉగాది సందర్భంగా ఆదివారం ఉదయం గోమంగిలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవచనాలు, హరి భజనలు, బ్రహ్మోపదేశాలు నిర్వహించారు. అనంతరం గురువులను దుశ్శాలువాలతో సన్మానించారు. మహిళలు నిర్వహించిన కోలాటం, థింసా నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సద్గురువులు కుంబిడి సత్యానంద స్వామి,లోచలి భగీరానంద స్వామి, సభాధ్యక్షులు దేపూరు వెంగలయ్య, మాజీ జెడ్పీటీసీ కొంట సూర్యనారాయణ,వైస్ సర్పంచ్ కూడ మత్స్యకొండబాబు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
స్వర్ణాభరణ అలంకరణలో కనకమహాలక్ష్మి
డాబాగార్డెన్స్: బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఉగాది పురస్కరించుకుని ఆదివారం అమ్మవారిని స్వర్ణాభరణాలతో అలంకరించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మవారు స్వర్ణాభరణాలు, పట్టుచీరలో దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గణపతి పూజ, మండపారాధన, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ తెన్నేటి శ్రీనివాస శర్మ పంచాంగ పఠనం అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి, పంచాంగ పుస్తకాలు వితరణ చేశారు. ఆలయ ఏఈవో కె.ఎస్.తిరుమల్లేశ్వరరావు, పర్యవేక్షణాధికారి తిరుపతిరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ముమ్మరంగా కూంబింగ్
వై.రామవరం: సరిహద్దు అటవీ ప్రాంతం(ఏవోబీ)లో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఒకపక్క సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో వరుస ఎన్కౌంటర్లు, మరో పక్క వై.రామవరం మండల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయన్న సమాచారంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలోను ప్రధాన రహదారులు, అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, అపరిచితులపై గట్టి నిఘాఉంచారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. -
విశ్వావసు... ఆశల ఉషస్సు
కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి జిల్లా వాసులు స్వాగతం పలికారు... విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం జిల్లాలో అంబరాన్నంటాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పలు గ్రామాల్లో ఉత్సవాలు జరిగాయి. ఆలయాలను మామిడి తోరణాలు, పూలతో విషేషంగా అలంకరించారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. పండగ సందర్భంగా ప్రజలు నూతన వస్త్రాలు ధరంచి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మోదకొండమ్మకు నీరాజనం తిరుచ్చి వాహనంపై స్వామివారి తిరువీధి ఉత్సవం8లో -
ముంచంగిపుట్టులో భారీ వర్షం
ముంచంగిపుట్టు: మండలంలో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు వెళ్లే రోడ్డు, జోలాపుట్టు ప్రధాన మార్గం వర్షం నీటితో నిడిపోయాయి.రహదారులపై వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. లుక్కురులో ఇంటిపై పడిన పిడుగు పనసపుట్టు పంచాయతీ లుక్కురులో వీర్రాజు అనే వ్యక్తి ఇంటిపై సాయంత్రం 5గంటల సమయంలో పిడుగు పడి మంటలు చెలరేగాయి. విద్యుత్ మీట రు, వైర్లు,టీవీ,ఫ్యాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.ఇంటిపైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. సుమారు రూ. 80వేలవరకు నష్టం సంభవించిందని,ప్రభు త్వం ఆదుకోవాలని బాధితుడు వీర్రాజు కోరారు. డుంబ్రిగుడ: మండల కేంద్రం డుంబ్రిగుడలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈవర్షాలు రాకతో మామిడి పూతకు కొంత మేలు జరుగుతుందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఘనంగా శివలింగ ప్రతిష్టాపన
జి.మాడుగుల: మండలంలోని గాంధీనగరంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వెనుక కొండపై నూతనంగా నిర్మించిన ఆది పురుష శివలింగేశ్వర స్వామి ఆలయంలో భీమిలి సద్గురు సేవాశ్రమం ప్రతినిధి సాయిరాం స్వామీజీ ఆధ్వర్యంలో ఆదివారం శివలింగ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండంనాయుడు దంపతులు, ఎస్ఎస్ఎఫ్ జిల్లా నాయకుడు మత్స్యరాస మత్స్యరాజు దంపతులు, భక్తులు హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతికి కార్యక్రమాలు, అన్నసమారాధన నిర్వహించారు. పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు పాల్గొన్నారు. -
రూ.9.84 లక్షలఅపరాధ రుసుం వసూలు
రాజవొమ్మంగి : మండలంలోసూరంపాలెం అటవీ ప్రాంతం నుంచి గ్రావెల్ తరలిస్తుండగా పట్టుబడిన వాహనాల యజమానుల నుంచి రూ.9.84 లక్షల అపరాధ రుసుం వసూలు చేసినట్టు రేంజ్ ఆఫీసర్ ఉషారాణి తెలిపారు. మొత్తం సొమ్ము చెల్లించడంతో సీజ్ చేసిన రెండు టిప్పర్లు, ఒక పొక్లెయిన్‌ను శనివారం యజమానులకు తిరిగి అప్పగించినట్టు చెప్పారు. నెలరోజుల కిందట తూర్పుగోదావరి జిల్లా కొయ్యూరుకు చెందిన కొంత మంది అటవీ ప్రాంతం నుంచి గ్రావెల్ తరలిస్తుండగా అటవీ అధికారులు పట్టుకుని వాహనాలను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేయగా వాహనాల యజమానులు అపరాధ రుసుం చెల్లించారు. కాగా అటవీ ప్రాంతం నుంచి గ్రావెల్, ఇసుక, మట్టి తరలిస్తే ఉపేక్షించేదిలేదని రేంజ్ ఆఫీసర్ ఉషారాణి హెచ్చరించారు. -
అంబరాన్నంటిన అమాస సంబరాలు
నూకాలమ్మ దేవాలయాల్లో భక్తులు వేకువజామునుంచే ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం నూకాలమ్మ ఉత్సవ విగ్రహం, ఘటాలను ఘనంగా ఊరేగించారు.జి.మాడుగుల: మండలంలో బొయితిలి,మద్దిగరువు గ్రామాల్లో శనివారం రాసకొండ బాలచెల్లమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. మద్దిగరువు నుంచి అమ్మవారి ఘటాలను ఉత్సవ కమిటీ అధ్వర్యంలో డప్పు వాయిద్యాలతో పెదబయలు మండలం కుంటిమామిడి గ్రామ సమీపాన గల రాస గుహలో కొలువై ఉన్న రాసకొండ బాలచెల్లమ్మ అమ్మవారి సన్నిధికి చేర్చి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.ఆంధ్ర–ఒడిశా రాష్ట్ర సరిహద్దు గిరిజన గ్రామాలను నుంచి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో రాసకొండ బాలచెల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.భక్తుల కోసం ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఘనంగా ధారాలమ్మ జాతర సీలేరు:ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం ఘాట్‌రోడ్డులోని ధారాలమ్మ అమ్మవారి ప్రధాన పండగ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ పండగ నెల 20న ప్రారంభమైంది. ఒడశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రాలో పలు ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. శనివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆలయ ఈవో సాంబశివరావు ధారకొండ గ్రామానికి చెందిన భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, దూప దీప నైవేద్యాలను సమర్పించారు.ఈ సందర్భంగా అన్నసమారాధన నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ మహాద్వారాన్ని మూసివేశారు. మళ్లీ ఉగాది రోజు ఉదయం ఆలయ తలుపులు తెరవనున్నట్టు ఈవో తెలిపారు.మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ● సీలేరు జల విద్యుత్ కేంద్రం వద్ద నూకాలమ్మ అమ్మవారి పండగను ఘనంగా నిర్వహించారు.అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.విజయవాడకు చెందిన జెన్కో ఇంజినీరు బుద్ధాన రమేష్ కుమార్ దంపతులు అమ్మవారికి చీర,సారె సమర్పించారు.అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.మంగళవారం మరుపూజ చేసేందుకు కమిటీసభ్యులు ఏర్పాట్లు చేశారు. రాజవొమ్మంగి: కొత్త అమావాస్య సందర్భంగా రాజవొమ్మంగి గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారి దర్శనం కోసం శనివారం భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు. అమ్మవారికి పసుపు కుంకుమలు, పిండివంటలు, పూలు, గాజులు, నూతన వస్త్రాలు సమర్పించారు. గత రెండు రోజులుగా గ్రామదేవత సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గరగనృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పెట గుళ్లు, జానపద నృత్యాలు ఆకట్టుకొంటున్నాయి.Iవ పేజీ తరువాయి -
ప్రపంచ రికార్డు సాధనకు కృషి
అరకులోయటౌన్: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 7వ తేదీన 20 వేల మంది విద్యార్థులతో 108 సూర్య నమస్కారాలు, యోగభ్యాసన కార్కక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఏ.ఎన్.దినేష్‌కుమార్ చెప్పారు. యోగా సాధన చేస్తున్న అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. వచ్చే నెల 7న నిర్వహించనున్న కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థుల తరలిస్తున్నట్టు చెప్పారు. భోజన సదుపాయం, బస్సుల పార్కింగ్ వంటివి ఏర్పాటు చేయాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని, డీ ౖహైడ్రేషన్కు గురికాకుండా చూడాలన్నారు. మైదానం పరిసరాల్లో తాగునీటి సమస్య, మురుగుకాలువల నుంచి దుర్వాసన లేకుండా చూడాలన్నారు. మైదానం ఆవరణలో వైద్య శిబిరం ఏర్పాటుచేయాలని, అవసరమైన అన్ని ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, టీడబ్ల్యూ డీడీ రజని, ఈఈ వేణుగోపాలరావు, డిఈవో బ్రహ్మాజీరావు, ఏసీపీ స్వామి నాయుడు, గురుకులం ఓఎస్డీ మూర్తి, ఆర్టీసీ డీఎం ఉమా మహేశ్వరరావు, రవాణాశాఖాధికారి లీలా ప్రసాద్, యోగ గురువు పతంజలి శ్రీనివాస్, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో లవరాజు పాల్గొన్నారు. ఏప్రిల్ 7న 20 వేల మంది విద్యార్థులతో యోగభ్యాసన కలెక్టర్ దినేష్‌కుమార్ -
పీడీఎఫ్ కమిటీ అభిప్రాయ సేకరణ
చింతూరు: పోలవరం ముంపులో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన చింతూరు గ్రామానికి చెందిన నిర్వాసితులు ఏ ప్రాంతాన్ని కోరుకుంటున్నారనే దానిపై పీడీఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ నిర్వహించారు. నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో 21 క్లస్టర్లకు చెందిన 1,258 మంది గిరిజనేతర నిర్వాసితుల అభిప్రాయాన్ని సేకరించారు. అభిప్రాయ సేకరణ వివరాలను శనివారం స్థానిక సాపిడ్ సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు వెల్లడించారు. వీరిలో 901 మంది తూర్పు గోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కృష్ణునిపాలెం ప్రాంతంలో తమకు పునరావాసం కల్పించాలంటూ అభిప్రాయం వ్యక్తం చేయగా, 351 మంది ఏలూరు జిల్లా తాడువాయి వెళ్లేందుకు సుముఖత వ్యక్తంచేశారు. అభిప్రాయ సేకరణ వివరాలను పోలవరం ఆర్అండ్ఆర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయా ప్రాంతాల్లో పునరావాసం కల్పించేలా చర్యలు చేపట్టాలని పీడీఎఫ్ కమిటీ సభ్యులు తీర్మానించారు. దీంతోపాటు ఆర్అండ్ఆర్ సొమ్ములు పెంచడంతో పాటు పునరావాస కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేలా అధికారులకు విజ్ఞప్తి చేయాలని వారు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బొజ్జా పోతురాజు, పయ్యాల నాగేశ్వరరావు, అహ్మద్అలీ, గంగాధరప్రసాద్, ఆసిఫ్, రంజాన్, యాసీన్, జీవన్, ఈశ్వరాచారి, సుభానీ, రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇద్దరు మావోయిస్టుల అరెస్ట్
పాడేరు : జిల్లాలో చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తడికవాగు గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి చెందిన ఒక కమాండర్‌తో పాటు సభ్యుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ అమిత్‌బర్దర్ శనివారం విలేకరులకు తెలిపారు. పోలీసులను హతమార్చడానికి పేలుడు పదార్థాలు ఏ విధంగా అమర్చాలి అనే విషయంపై తడికవాగు శివారు అటవీప్రాంతంలో సమావేశమైనట్టు అందిన ముందస్తు సమాచారంతో ఈనెల 28న కూంబింగ్ నిర్వహిస్తుండగా పోలీసులపై తుపాకులు, కత్తులతో దాడులతో దాడి చేయడానికి ప్రయత్నించారన్నారు. దీంతో పోలీసు బలగాలు చాకచక్యంగా ఇద్దరిని పట్టుకోగా, మిగిలిన వారు పరారైనట్టు చెప్పారు. పట్టుబడిన వారిలో శబరి కమాండర్‌గా పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా డోకుపదు గ్రామానికి చెందిన మడకం మంగా అలియాస్ మంగల్, దబ్బపాదు గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యుడు మడివి రమేష్లున్నారని చెప్పారు. వీరి నుంచి మారణాయుధాలు, తుపాకులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీరిపై 2015 సంవత్సరం నుంచి 2025 వరకు సుమారు 18 కేసులు నమోదైనట్టు వివరించారు. పలు హింసాత్మక ఘటనలు, నేరాల్లో పాల్గొన్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి తుపాకులు, తూటలు, వాకీటాకీలు, విప్లవ సాహిత్యం, ప్లాస్టిక్ బాక్స్‌లు, నాలుగు రంగు ప్లాస్టిక్ షీట్స్, రూ.24,900 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మావోయిస్టులకు ఎవరైనా సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఉంటే నేరుగా పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం అడిషనల్ ఎస్పీ(ఆపరేషన్స్) జగదీష్ అడహాల్లీ, చింతూరు సబ్ డివిజన్ సీఆరీపీఎఫ్ అధికారి టి. దుర్గారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్‌బర్దర్ -
సంకల్పం
సహస్రవెయ్యి విగ్రహాల ప్రతిష్టే లక్ష్యం సనాతన ధర్మ సంరక్షణకు సద్గురు సేవాశ్రమం కృషికొండంత దేవుడికి అంత గుడిని కట్టలేకపోవచ్చు.. కానీ అనన్య భక్తితో విగ్రహాన్ని ప్రతిష్టించి, నిండు మనసుతో అర్చిస్తే అంతటి ఆనందం సొంతమవుతుంది. ఆ విధంగా వెయ్యి విగ్రహాల ప్రతిష్టే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తోంది సద్గురు సేవాశ్రమం. ఆలయాలు అంతగా లేని ప్రాంతాలను ఎంచుకుని ఈ విగ్రహాలను ప్రతిష్టిస్తోంది. ఇప్పటికే 899 విగ్రహాలను ప్రతిష్టించగా అందులో సుమారు 20 మినహా అన్నీ ఆంజనేయస్వామివే కావడం విశేషం. ఇప్పుడు 900వ విగ్రహంగా శివలింగాన్ని ఉగాది పర్వదిన వేళ అల్లూరి జిల్లా జి.మాడుగులలో ప్రతిష్టించనున్నారు. ఇప్పటికి 899 విగ్రహాల ప్రతిష్టాపన పూర్తినేడు జి.మాడుగులలో 900వ విగ్రహం ప్రతిష్ట విజయసాయి యోగా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా యోగాలో ఉచిత శిక్షణ, వైద్య శిబిరాల నిర్వహణ, తాగునీటి కొరత ఉన్నచోట బోర్ల తవ్వకాలు, టాంకర్ల ద్వారా తాగునీరు, పైపులైన్ల నిర్మాణం, గిరిజనులకు దుస్తులు, వంటపాత్రలు, చిత్రపటాల పంపిణీ చేపడుతూనే ఉన్నారు. ఈ సేవా కార్యక్రమాలు అన్నింటికీ ఇప్పటి వరకు దాతల సహకారంతో రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. తగరపువలస: మానవసేవ, మాధవసేవ, గోసేవ పరమావధిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది జీవీఎంసీ 4వ వార్డు రామయోగి అగ్రహారానికి చెందిన సద్గురు సేవాశ్రమం. 2010 మే నెలలో ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన కోన అప్పలరాజు అలియాస్ యోగా రాజు 60 మంది వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం కల్పించడమే కాకుండా 60 దేశవాళీ ఆవులతో గోశాల నిర్మించారు. మొదట్లో భీమిలి తీరప్రాంతాలైన అన్నవరం, కాపులుప్పాడ, నిడిగట్టు, చేపలుప్పాడ గ్రామాలలో పదుల సంఖ్యలో ఆలయాలు నిర్మించి, అందులో విగ్రహాలు ప్రతిష్టించారు. 2020 నుంచి మాధవసేవను విస్తృతం చేయాలన్న సంకల్పం కారణంగా మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలలో ఆంజనేయుని విగ్రహాలు ప్రతిష్టించడానికి నడుం బిగించారు. ఇప్పటి వరకు అరకు, పాడేరు, పెదబయలు, జీకే వీధి, హుకుంపేట, కొయ్యూరు, రాజఒమ్మంగి, జి.మాడుగుల, చింతూరు, ముంచంగిపుట్టు, అనంతగిరి, చింతపల్లి, డుంబ్రిగుడ మండలాలు శ్రీకాకుళంతో పాటు ఒడిశాలోని కోరాపుట్, జైపూర్, నవరంగ్‌పూర్ జిల్లాలలో విగ్రహాలు, ఆలయాలు కలిపి 899 నిర్మించారు. వీటిలో 20 వరకు మాత్రమే వేంకటేశ్వరస్వామి, శివాలయం, అమ్మవార్ల ఆలయాలు కాగా మిగిలినవన్నీ హనుమంతుని విగ్రహాలే కావడం విశేషం. మూడేళ్ల క్రితం జి.మాడుగులలో రూ.50 లక్షలతో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆలయాన్ని నిర్మించా రు. హుకుంపేట మండలం మద్దివీధి శివాలయాన్ని పునరుద్ధరించారు. ములుసోబలో వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. విగ్రహాలు ప్రతిష్టించిన అన్ని ప్రాంతాల్లో మొదటి ఏడాది వరకు పూజా సామగ్రిని వారే అందిస్తారు. ఇప్పటి వరకు అలా రూ.54 లక్షల విలువైన సామగ్రిని అందించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ప్రతిష్టించిన ఆంజనేయుని విగ్రహం విస్తృతంగాసేవా కార్యక్రమాలు -
దాహాకారాలు
పట్టణాల్లో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. బిందెడు నీటి కోసం కుళాయిలు, బావులు, బోర్ల వద్ద బారులు తీరుతున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి ప్రజలను కష్టాల్లోకి నెట్టేసింది. జిల్లాలో పాడేరు, అరకులోయ, రంపచోడవరం నియోజకవర్గ కేంద్రాల్లో గత్యంతరం లేక ప్రాణాలు నిలుపుకొనేందుకు కొంతమంది సుదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటుంటే, మరికొంత మంది డబ్బులిచ్చి మరీ కొనుక్కుంటున్నారు. ఇంకొంతమంది పక్క ఇళ్లలో గల బోరుల నుంచి నీటి తెచ్చుకుంటూ దాహార్తి తీర్చుకుంటున్నారు. అరకులోయటౌన్: పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వేసవి ప్రారంభంలోనే తాగునీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎటువంటి ఊట గెడ్డలు, ఇతర నీటి వనరులు లేకపోవడంతో పాటు పంచాయతీ కుళాయిల ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెదలబుడు పంచాయతీలో 16 వార్డులున్నాయి. ఈ పంచాయతీ పరిధిలో గల అరకులోయ టౌన్ షిప్లో తొమ్మిది వార్డులున్నాయి. ఈ వార్డుల పరిధిలో ఎనిమిది కాలనీలు ఉన్నాయి. సుమారు 16 వేల మంది జనాభా నివసిస్తున్నారు. వీరందరికీ ఒకే ఒక్క రక్షిత తాగు నీటి పథకం నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ పథకం మరమ్మతులకు గురైన సమయంలో, పైపులు పగిలిపోయిన సమయంలో నీరందక పలు కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బోరు నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్‌కు నీటి సరఫరా చేసే మెయిన్ పైప్‌లైన్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మెయిన్ రోడ్డు వద్ద నెలరోజుల కిందట మరమ్మతుకు గురైంది. దీంతో అప్పటి నుంచి అరకులోయలో పలు కాలనీలకు నీటి సరఫరా నిలిచిపోయింది. అరకులోయ పట్టణ వాసులతోపాటు బి. కాలనీ, ఆస్పత్రి కాలనీ, శరభగుడ కాలనీ, శరబగుడ, పాత పోస్టాఫీసు కాలనీ, కంఠబౌంషుగుడ, జెడ్పీకాలనీ, ఎలక్ట్రికల్ కాలనీ, సి కాలనీ వాసులకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా జరగడం లేదు. సి కాలనీ వాసులకు గత కొన్నేళ్లుగా అసలు నీటి సరఫరాయే జరగడం లేదు. దూరంగా ఉన్న బోరుల నుంచి వీరు నీటిని తెచ్చుకోవలసి వస్తోంది. కొండవీధిలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉన్నప్పటికీ పంచాయతీ అధికారులు నిర్వహణ బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆ వీధి వాసులే పథకాన్ని నిర్వహిస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ అధికారులు స్పందించి తమ కాలనీల్లో ప్రతి రోజు నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.రంపచోడవరం: నియోజకవర్గ కేంద్రమైన రంప చోడవరంలో దాహం కేకలు మిన్నంటుతున్నా యి. మేజర్ పంచాయతీ అయిన రంపచోడవరంలో 16వార్డుల్లో 15వేల మంది జనాభా ఉన్నారు. ప్రతి రోజు నిబంధనల ప్రకారం నాలుగు లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే రోజుకు 2.30 లక్షల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. స్థానికంగా ఉన్న రక్షిత తాగునీటి పథకం మరమ్మతులు గురవడంతో శివారు ప్రాంతానికి నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు. దీంతో శివారు ప్రాంతాల ప్రజల పరిస్థితి దుర్భంగా ఉంది. సీతపల్లి వాగు నుంచి నీటిని తోడి పంపు హౌస్ వద్ద సంపు నుంచి సినిమా హాల్ వెనుక వైపు ఉన్న ట్యాంక్‌కు పంపిస్తున్నారు. సత్యసాయి వాటర్ స్కిమ్ నుంచి కూడా నీటి తీసుకుని ట్యాంకులకు పంపించి సరఫరా చేస్తున్నారు. నీటిని శుద్ధి ప్రక్రియ కూడా సక్రమంగా జరగడం లేదు.మూడు, నాలుగు వార్డుల్లోని ఎర్రంరెడ్డి నగర్లో ఒక్క వీధి కుళాయి కూడా పనిచేయడం లేదు. దీంతో ఇంటి కుళా యిలు లేని వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న ఒక్క బోరు పైనే ఆధారపడాల్సి వస్తోంది. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో బోరు మరమ్మతులు గురైంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని స్థానికులు వాపోయారు. -
తాగు నీటి సమస్య ఎక్కువగా ఉంది
సీతారం ఆర్అండ్ఆర్ కాలనీలో 60 కుటుంబాలు ఉన్నప్పటికీ 10 ఇళ్లకు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. మిగిలిన వారికి ఊరిలో ఉన్న చేతి బోరులే దిక్కు. ఒక్కో సారి అవీ పనిచేయడం లేదు. కాలనీకి వచ్చినప్పటి నుంచి తాగు నీరే మాప్రధాన సమస్యగా ఉంది. ట్యాంకును గ్రామానికి దిగువన నిర్మించడం, మోటార్ సరిగా పనిచేయకపోవడ వల్ల మా గ్రామానికి పూర్తిస్థాయిలో నీరు అందడం లేదు.వేసవిలో మరీ ఇబ్బందిగా ఉంటోంది. – కుంజం బాసనమ్మ,సీతారం ఆర్అండ్ఆర్ కాలనీ -
కన్నీటి ఊట
జిల్లాలో గిరిపుత్రుల గొంతులెండుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే అంతటా దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ఊట బావులు, చలమల్లో నీరు ఎండిపోయింది. గ్రావిటీలు చుక్కనీరివ్వడం లేదు. కొన్ని చోట్ల బోర్లు, సోలార్ వాటర్ స్కీములు పనిచేయడం లేదు. తాగునీటి సమస్య రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో బిందెడు నీటి కోసం వారు మైళ్లకొద్దీ నడిచి వెళ్లవలసి వస్తోంది. గొంతు తడుపు కొనేందుకు గుక్కెడు నీరు దొరక్క అల్లాడుతున్నారు. పాలకుల, అధికారుల నిర్లక్ష్య ధోరణి ప్రజలను నీళ్ల కష్టాల్లోకి నెట్టేసింది. జల దారిలో..కలుషిత ఊటనీటిని సేకరిస్తున్న కొమ్ములుకొండ మహిళలుసాక్షి,పాడేరు/అరకులోయటౌన్/పాడేరు/ రంపచోడవరం: జిల్లాలోని వందలాది గ్రామాల్లో గిరిజనులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వేసవికి ముందే తాగునీటి సమస్య పరిష్కరిస్తామని పాలకులు,అధికారులు చేసిన ప్రకటనలు నీటి మూటలయ్యాయి. పలు గ్రామాల్లో తాగునీటి పథకాలతో పాటు గతంలో నిర్మించిన గ్రావిటి పథకాలు,ఇంటింటికీ వేసిన కుళాయిలు,బోరుబావులు సక్రమంగా పనిచేయకపోవడతో గిరిజనులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ అధికారులు నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల్లో తాగునీటి పథకాలు,బోరుబావులు వినియోగంలోకి తేవాలని అర్జీలు ఇస్తున్నా వాటిని పరిష్కరించ లేదని గిరిజనులు వాపోతున్నారు. ఇదీ పరిస్థితి నాలుగైదు గ్రామాలకు ఒక తాగునీటి పథకం మాత్రమే ఆధారమవుతోంది. పలు గ్రామాల మహిళలు మైళ్ల కొద్దీ నడిచి వెళ్లి గ్రామ శివారు ప్రాంతాలు, పక్క గ్రామాల నుంచి మండుటెండలో బిందెలతో నీటిని మోసుకుని రావలసిన దుస్థితి నెలకొంది. ● జి.మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో తాగు నీటి పథకాలు పనిచేయక పోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలోని రామాలయం వీధిలో మంచినీటి పథకం మరమ్మతులకు గురికావడంతో ఆ వీధి వాసులు బిందెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. స్థానిక డీఆర్ డిపో ఆవరణలో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నీటి పథకం నుంచి రామాలయం వీధిలో ఇంటింటికీ కుళాయిలను ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేశారు. అది ఇటీవల మరమ్మతులకు గురైంది. దీంతో వీధిలో చేతి బోరును ఆశ్రయించాల్సి వస్తోంది. మండలంలో పలు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ● గూడెం కొత్తవీధి మండలంలో తాగునీటి పథకాలు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. దీంతో నీటి ఎద్దడి నెలకొంది. గెడ్డలు, వాగులు, చెరువుల్లోని కలుషిత నీరే ఆధారమవుతోంది. ● కొయ్యూరు మండలంలోని మారుమూల గ్రామాల్లో తాగునీటి ఎద్దడి అధికంగా ఉంది. సుమారు 30కి పైగా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎం.భీమవరం, యూ.చీడిపాలెం, బూదరాళ్ల పంచాయతీల్లో నీటి ఎద్దడి అధికంగా ఉంది. బోర్లు తవ్వేందుకు కొన్నిచోట్లకు రిగ్వాహనం వెళ్ల డం సాధ్యం కాదు.అలాంటి ప్రాంతాల్లో ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు చేసినా సమస్య పరిష్కారం కావడం లేదు.కొయ్యూరు పంచాయతీలో మోటారు పాడైపోవడంతో నాలుగు రో జులనుంచి తాగునీరుసరఫరా కావడం లేదు. ● రంపచోడవరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.రంపచోడవరం ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో దేవీపట్నం, గంగవరం, రంపచోడవరం,మారేడుమిల్లి మండలాల్లో 252 మంచినీటి పథకాలు ఉన్నాయి.వీటిలో మారేడుమిల్లి మండలం వైదిపూడి, రంపచోడవరం మండలం సుద్దగొమ్మి గ్రామాల్లో తాగునీటి పథకాలు పనిచేయకపోవడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బోరు వేసి, మోటారు పెట్టి పైపు లైను ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరా లేనప్పుడు మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తప్పడం లేదు. సుద్దగొమ్మి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ కొంత కాలంగా పనిచేయడం లేదు. దీంతో ఆ గ్రామస్తులు 12 కిలోమీటర్ల దూరంలో గల గోకవరం నుంచి ఆటోలు, ద్విచక్ర వాహనాలతో నీటిని తెచ్చుకోవలసి వసో ్తంది. ● దేవీపట్నం మండలం కొండమొదలు కాలనీలో మంచినీటి పథకం నిర్మించినా అందరికీ పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగడం లేదు. తగిన సామర్థ్యంతో నీటి ట్యాంకు నిర్మించకపోవడమే కారణం. రంపచోడవరం, గంగవరం, మారేడుమిల్లి, రంపచోడవరం మండలాల్లో 1702 బోర్లు ఉన్నాయి. వీటిలో 1,669 బోర్లు పనిచేస్తున్నాయి. ● రాజవొమ్మంగి : మండలంలోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సక్రమంగా తాగునీరు సరఫరా కావడం లేదని మండలవాసులు వాపోతున్నారు. వాతంగిలో మంచినీటి పథకం నిర్మించి, కుళాయిల ఏర్పాటు చేయకపోవడంతో మూడు వందల కుటుంబాల వారు చేతి పంపుపైనే ఆధారపడుతున్నారు. అదే పంచాయతీ కొమరాపురంలో రక్షిత మంచినీటి పథకం నిర్మాణం పూర్తయినప్పటికీ కుళాయిలకు నీటి సరఫరా ఇవ్వలేదు. హెచ్‌క్వార్టర్ అమీనాబాద్‌లో, ఏబీ కాలనీలో ట్యాంకుల నిర్మాణం పూర్తయినా వీధికుళాయిలకు నీరు రావడం లేదని మహిళలు తెలిపారు. దీంతో బోరు నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నట్టు చెప్పారు. అప్పలరాజుపేటలో రక్షిత మంచి నీటిపథకం కుళాయిలు పని చేయడం లేదు. దీంతో ఆ గ్రామస్తులు నీటికోసం అల్లాడుతున్నారు. అధికారిక లెక్కలు ఇలా.. తాగునీటి పథకాలపునరుద్ధరణకు చర్యలు మరమ్మతులకు గురైన జిల్లాలోని అన్ని తాగునీటి పథకాలు, బోరుబావుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాం.కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు సకాలంలో పూర్తి చేసి తాగునీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తాం. – జవహర్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ఇంజినీర్, ఆర్‌డబ్లూఎస్, పాడేరు గెడ్డ, ఊట నీరే దిక్కు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పలుమార్లు అధికారులకు సమస్యను వివరించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో గెడ్డ, ఊట నీటిని సేకరించి వినియోగిస్తున్నాం. కలుషిత నీటిని తాగడం వల్ల రోగాల బారిన పడుతున్నాం. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సౌకర్యం కల్పించాలి. – పోయా దేవి, గిరి మహిళ,ఉరుములు, అరకులోయ మండలంపథకాలు మూలకు చేరాయి ఇరగాయి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. తాగునీటి పథకాలు మూలకు చేరాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టాలి. – మాదల బుటికి, సర్పంచ్, ఇరగాయి పంచాయతీ, అరకులోయ మండలం పోలవరంప్రాజెక్టు నిర్వాసిత కాలనీల్లో తాగు నీటిసరఫరా సక్రమంగా జరగడం లేదు. కొండమొదలు కాలనీలో అంతంత మాత్రంగా సరఫరా జరుగుతోంది. అధికారుల కు చెప్పినా పట్టించుకోవడం లేదు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. – కొండ్ల సురేష్‌రెడ్డి, కొండమొదలు కాలనీ, దేవీపట్నం మండలం అధికారులకు పట్టడం లేదు ఇబ్బందులకు గురవుతున్నాం నిర్వాసిత కాలనీలో తీవ్ర ఇబ్బందులు జిల్లాలోని 22 మండలాల పరిధిలో 4,860 గ్రామాలున్నాయి. గ్రామాల్లో తాగు నీటి సమ స్యను గుర్తించేందుకు ఇంతవరకు 4,370 గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు,ఎంపీడీవోలు,పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహించారు. మిగిలిన గ్రామాల్లో సర్వే జరపాల్సి ఉంది.ఈ సర్వేలో జిల్లా వ్యాప్తంగా 613 ఎంపీడబ్ల్యూ తాగునీటి పథకాలకుగాను 43 పథ కాలు, 2,237 పీడబ్ల్యూఎస్ పథకాలకు గాను 142 పథకాలు, 9,057 బోరు బావులకు గాను 1,340 పనిచేయడం లేదని నిర్ధారించారు. అయితే పనిచేయని పథకాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది. జిల్లాలో సుమారు 300 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గతంలో నిర్మించిన తాగునీటి పథకాలు,బోరుబావులు వినియోగంలోకి వస్తే తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు, మండల,డివిజన్,జిల్లా స్థాయి అధికారులకు విన్నవించుకుంటున్నారు. మా గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. 50 కుటుంబాలకు ఒక మంచినీటి పథకం మాత్రమే ఉంది. ఆ పథకం కూడా మూలకు చేరడంతో బిందెడు నీటి కోసం మైళ్లదూరం వెళ్లాల్సి వస్తోంది. అధికారులకు విన్నవించినా స్పందన లేదు. ఊట గెడ్డల నుంచి కలుషిత నీటి తెచ్చుకుని వినియోగిస్తున్నాం. –మజ్జి సుశీల, గుమ్మపుట్టు గ్రామం, డోకులూరు పంచాయతీ, పాడేరు మండలం. మా గ్రామంలో 30 కుటుంబాలకు ఒక మంచినీటి పథకం ఉంది. వేసవి కావడంతో తాగునీరు సరిపడా సరఫరా కావడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదు. – కిల్లో లక్ష్మి, చింతగొంది గ్రామం, ఇరడపల్లి పంచాయతీ పాడేరు మండలం. -
అంతిమ యాత్రలో తేనెటీగల దాడి
ఎటపాక: అంతిమ యాత్రలో పాల్గొన్న వారిపై తేనెటీగలు దాడి చేయడంతో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఎటపాక మండలం గౌరిదేవిపేటలో శుక్రవారం జరిగింది. గ్రామంలోని కొప్పుల పల్లమ్మ(86) అనే వృద్ధురాలు గుండెపోటుతో గురువారం రాత్రి మరణించింది. శుక్రవారం ఉదయం ఆమె అంతిమయాత్ర నిర్వహించారు. ఈక్రమంలో దింపుడుకల్లం ఆశతో మృతదేహాన్ని కిందకి దించిన సమయంలో బాణసంచా కాల్చుతుండగా సమీపంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు అంతిమ యాత్రలో పాల్గొన్న వారిపై దాడిచేశాయి. దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి ప్రాణభయంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో గాయపడిన వారిలో 26 మందికి గౌరిదేవిపేట పీహెచ్సీలో డాక్టర్లు దేవినాగ్,శ్రీదేవి ప్రథమచికిత్స చేశారు. నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని 108 వాహనంలో భద్రాచలంలోని ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కారణంగా సుమారు రెండు గంటల పాటు మృతదేహం రహదారిపై ఉండిపోయింది. తేనెటీగల ప్రభావం తగ్గిన తరువాత మృతదేహాన్ని గోదావరి నది వద్దకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. 40 మందికి గాయాలు మృతదేహాన్ని రోడ్డుపై వదిలేసి పరుగులు తీసిన బంధువులు -
సీలేరు జలవిద్యుత్ కేంద్రం మరో ఘనత
సీలేరు: సీలేరు జల విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తిలో రికార్డులపై రికార్డులు సృష్టిస్తోందని ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు. గత బుధవారం 5.126 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి ఆల్ టైం రికార్డు సృష్టించగా, తాజాగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు 5.325 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పిందని చెప్పారు. ఈ స్థాయిలో ఉత్పతి సాధించి,రికార్డు నెలకొల్పడం గొప్ప విషయమని ఈఈ తెలిపారు. జెన్కో ఎండీ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు నేరుగా ఫోన్ చేసి అధికారులు,ఇంజినీర్లు, కార్మికులను అభినందించారని చెప్పారు. -
పార్లమెంట్‌లోనే ప్రొటోకాల్ పాటించకపోతే ఎలా?
పెదబయలు: దేశానికి దిశా నిర్ధేశం చేసే పార్లమెంట్‌లోనే ప్రొటోకాల్‌ను పాటించకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యమైనట్టు కాదా? అని సర్పంచ్ల ఫోరం పెదబయలు మండల అధ్యక్షుడు కాతారి సురేష్‌కుమార్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విలువలు పాటించాల్సిన పార్లమెంట్‌లోనే అరకులోయ ఎంపీ గుమ్మా తనూజరాణిని ఎన్డీఏ ప్రభుత్వం అగౌరవపరిచిందని మండిపడ్డారు. పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి అరకులోయ ఎంపీ తనూజరాణిని ఆహ్వానించకపోవడం.. కేవలం ఆమెకు జరిగిన అన్యాయంగా లేదా వైఎస్సార్సీపీ నేతల పట్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవహించిన తీరు గానో భావించకూడదన్నారు. ఇది యావత్ గిరిజన జాతిని చులకనగా చూస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఓట్ల రాజకీయం కోసమే గిరిజనులకు మేలు చేస్తున్నామని చెబుతున్నారే తప్ప, అధికారం వచ్చిన తర్వాత వారి పట్ల ఎంత వక్రబుద్ధి ఉందో అర్థం అవుతుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికై నా ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అరకులోయ ఎంపీకి ఢిల్లీలో దక్కని గౌరవం ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు సురేష్‌కుమార్ ధ్వజం -
మత్స్యకారులే సముద్ర సంపద పరిరక్షకులు
సాక్షి, విశాఖపట్నం : సముద్రాన్ని పరిరక్షిస్తూ.. మత్స్య సంపదతో పాటు జీవవైవిధ్యాన్ని కాపాడుతోంది మత్స్యకారులేనని ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఐ) వైజాగ్ జోన్ డైరెక్టర్ భామిరెడ్డి అన్నారు. ఎఫ్ఎస్ఐ విశాఖ కార్యాలయాన్ని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న మైరెన్ మ్యూజియంలో సముద్ర జీవజాలాన్ని ఆసక్తిగా తిలకించారు. జోన్ డైరెక్టర్ భామిరెడ్డి.. వీరితో ముఖాముఖి మాట్లాడుతూ సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతుండటంతో సముద్ర వాతావరణానికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యర్థాల్ని తొలగించే బాధ్యతపై అవగాహన కల్పిస్తూ ఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ముఖ్యంగా ఘోస్ట్ ఫిషింగ్ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 400 నాటికల్ మైళ్ల దూరంలో నౌకలు సర్వే చేసినప్పుడు దొరికిన వలల వ్యర్థాలు చేస్తున్న కీడుకి సంబంధించిన వీడియోల్ని మత్స్యకారులకు చూపిస్తూ.. చైతన్యవంతుల్ని చేస్తున్నామని వివరించారు. తమ సంస్థ చేపట్టిన కార్యక్రమాలకు ఆకర్షితులై.. కొందరు మత్స్యకారులు సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడుకునే బాధ్యతని తమ భుజస్కందాలపైకి ఎత్తుకున్నారని తెలిపారు. మత్స్యకారులతో పాటు.. సందర్శకులు, సామాన్య పౌరులు కూడా సముద్రాలు కాలుష్యం కాకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఐ శాస్త్రవేత్త జీవీఎ ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఎఫ్ఎస్ఐ విశాఖ జోన్ డైరెక్టర్ భామిరెడ్డి -
మద్యం.. తీసింది ప్రాణం
భవనంపై నుంచి జారిపడి తెలంగాణ వాసి మృతి కొమ్మాది: జీవీఎంసీ 8వ వార్డు రుషికొండ ప్రాంతంలోని భవనంపై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాలివి. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన తవిడిబోయిన సతీష్ (35) భవన నిర్మాణాల్లో గ్రానైట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన పది మంది బృందంగా ఏర్పడి రుషికొండకు వలస వచ్చారు. ఈ నెల 23న రుషికొండ స్వర్ణభారతి నగర్లో ఓ భవనం 4వ అంతస్తుపై ఇల్లు అద్దెకు తీసుకుని దిగారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గ్రానైట్ పనులు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా.. వీరంతా బుధవారం రాత్రి గది బయట బాల్కనీలో మద్యం సేవించారు. రేచీకటి సమస్య ఉన్న సతీష్ మద్యం మత్తులో అర్ధరాత్రి 12 గంటలకు భవనం గోడ వద్దకు వెళ్లి.. ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సహచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
లోకేష్.. హామీల అమలెప్పుడు?
● స్మార్ట్ మీటర్లతో మా పొట్ట కొట్టొద్దు ● ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె ● విద్యుత్ మీటర్ రీడర్ల ఆందోళన సీతమ్మధార(విశాఖ): ఉద్యోగ భద్రత కల్పించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల విద్యుత్ మీటర్ రీడర్లు డిమాండ్ చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె చేస్తామని ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్‌కు డిమాండ్ల పత్రం సమర్పించారు. గురుద్వారా వద్ద గల ఈపీడీసీఎల్ జోనల్ కార్యాలయం వద్ద గురువారం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో మీటర్ రీడర్లు పాల్గొన్నారు. ఈ ధర్నానుద్దేశించి అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బాల కాశి, ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె.అచ్యుతరావు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడి, అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తామని, విద్యుత్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలైనా నేటికీ ఆ హామీని అమలు చేయకపోవడం దారుణమన్నారు. గత 15, 20 ఏళ్లుగా సంస్థనే నమ్ముకుని పనిచేస్తున్న తమను స్మార్ట్ మీటర్ల పేరుతో రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అదానీ, అంబానీలకు కొమ్ముకాస్తోందని, విద్యుత్ మీటర్ రీడర్లను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ నాయకులు రామకృష్ణ, శివారెడ్డి, క్రాంతికుమార్, ఎస్.కె.రెహమాన్, మన్మధరావు, రామలింగారెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, శ్రీనివాస్ శేఖర, చిరంజీవి, శ్రీనివాసరావు, నాగబాబు, ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న మీటర్ రీడర్లు -
కేజీహెచ్ అభివృద్ధికి ఎన్టీపీసీ రూ.2 కోట్ల విరాళం
మహారాణిపేట: విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్)లో మౌలిక సదుపాయాల కల్పనకు సింహాద్రి ఎన్టీపీసీ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల వినియోగంపై సంస్థ అధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్ మధ్య గురువారం ఎంవోయూ కుదిరింది. నెఫ్రాలజీ విభాగంలో ఆరు డయాలసిస్ యూనిట్లు, భావనగర్ వార్డులో నాలుగు యూనిట్లు, ఆపరేషన్ థియేటర్లో ఆధునిక పరికరాల కొనుగోలు, ఇతర సదుపాయాల కల్పనకు ఈ నిధుల్ని వెచ్చించనున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.శివానంద్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టరు, సంస్థ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్ఆర్) బి.బి.పాత్ర, సీఎస్సార్ మేనేజర్ కె.ప్రకాశరావు, సీపీవో పాల్గొన్నారు. -
విశాఖలో ఆక్టోపస్ యూనిట్?
మహారాణిపేట (విశాఖ): అనుకోని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్.భవానీ శంకర్ సూచించారు. అగ్ని ప్రమాదాలు, టెర్రరిస్టుల దాడుల విషయంలో అలారం వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. టెర్రరిస్టు దాడులు, ఇతర ఆపదలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆక్టోపస్ రాష్ట్ర ఆపరేషన్ అధికారి డీఎస్పీ జగ్గునాయుడు, డీఎస్పీ మధుసూదనరావు ఆ సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. ఊహించని ప్రమాదాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఆక్టోపస్ పని చేస్తోందని, రాష్ట్రంలోని తిరుపతి, గన్నవరం కేంద్రాలుగా రెండు ఆపరేషన్ యూనిట్లు ఉన్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో మూడో యూనిట్‌ను నెలకొల్పేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆక్టోపస్ శిక్షణ, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్టోపస్ మిగతా రాష్ట్రాల్లోని సంస్థల కంటే భిన్నంగా సేవలందిస్తోందని గుర్తు చేశారు. ఆక్టోపస్ ఆపరేషన్ టీం అధికారులు, కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, ఈపీడీసీఎల్ ఎస్ఈ శ్యాంబాబు, అగ్నిమాపక శాఖ ఏడీఎఫ్‌వో సింహాచలం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మానసిక దివ్యాంగులపై కక్ష!
● మానసిక ఆస్పత్రిలో కొనసాగుతున్న పరీక్షలు ● పింఛన్ల కోతకు కూటమి సర్కార్ కుట్ర? మహారాణిపేట(విశాఖ): నెలకు ఆరు వేల రూపాయల పింఛన్లు తీసుకుంటున్న మానసిక దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు దివ్యాంగులకు భారీగా పింఛన్లు పెంచుతామని గొప్పలు చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు అధికారంలోకి రాగానే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు కుట్రపూరితంగా సర్వేలు చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రస్తుతం ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో జరుగుతున్న తనిఖీలే నిదర్శనమని ఆరోపిస్తున్నారు. మానసిక దివ్యాంగులను బలవంతంగా ఆస్పత్రులకు రప్పించి, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులచే పరీక్షలు చేయిస్తున్నారు. ఇప్పటికే సదరం సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ.. మళ్లీ మళ్లీ తనిఖీలు నిర్వహించడం దివ్యాంగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు సదరం సర్టిఫికెట్ల పరిశీలన, మరోవైపు వైద్య పరీక్షల పేరుతో జరుగుతున్న ఈ తతంగాన్ని దివ్యాంగుల పెన్షన్ల కోత కోసమేనని అనుమానిస్తున్నారు. రోజుకు 20 మంది తనిఖీ వైద్య పరీక్షల కోసం మానసిక ఆస్పత్రిలో పలు ఏర్పాట్లు చేశారు. సదరం సర్టిఫికెట్ల తనిఖీ కోసం ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. అలాగే ఆస్పత్రిలో మరో మూడు కౌంటర్లు ఏర్పాటు చేసి.. అక్కడ రోగులకు వివిధ పరీక్షలు చేయిస్తున్నారు. రోజుకు 20 మంది రోగులకు చొప్పున తనిఖీ చేసేందుకు ఏర్పాట్లు చేఏశారు. కాగా.. గురువారం 20 మంది మానసిక దివ్యాంగుల సర్టిఫికెట్లను పరిశీలించారు. అనంతరం వైద్యులు వారికి కేటాయించిన శాతంను వివిధ పరీక్షలు చేసి నిర్ధారిస్తున్నారు. మనోవేదనలో దివ్యాంగులు చిన్నవాల్తేరులోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో జరిగిన తనిఖీలకు హాజరైన దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఎన్నో ఏళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న తమకు ఇప్పుడు మళ్లీ పరీక్షలు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల దుస్థితి చూసి బాధపడుతుంటే.. ఇలాంటి చర్యలతో మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో కారణం చెప్పి పింఛన్లు తొలగించాలనే దురుద్దేశంతోనే ఈ సర్వేలు, తనిఖీలు నిర్వహిస్తున్నారని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కాగా.. ప్రస్తుతం జిల్లాలో నెలకు రూ.6 వేల పింఛను పొందుతున్న 4,408 మంది మానసిక దివ్యాంగులకు నోటీసులు జారీ చేసి.. పరీక్షలకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 21,306 మంది దివ్యాంగులు, మంచంపై ఉన్న వారిని దశలవారీగా పరిశీలించనున్నారు. వయసు పెరుగుతున్నా.. ఎదుగుదల లేదు ఎందుకు రమ్మన్నారో అర్థం కావడం లేదు మా అమ్మాయి పుట్టుకతో ఎలా ఉందో.. మానసికంగా ఇప్పుడూ అలానే ఉంది. మనిషిలో ఎదుగుదల లేదు. తిండి పెడితే తింటుంది. లేకపోతే లేదు. ఏమీ తెలియదు. స్నానం చేయించడం, దుస్తులు వేయడం, ఆహారం తినిపించడం అన్నీ మేమే చేస్తున్నాం. అమ్మాయిని ఇంత దూరం తీసుకురావడానికి ఇద్దరం ఉండాల్సి వచ్చింది. వైద్యులు చూస్తారని చెప్పడంతో వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక ఏదో చెబుతున్నారు. ఏం అర్థం కాలేదు. – శ్రీనివాస్, వెంకట లక్ష్మి దంపతులు, రామలక్ష్మి తల్లిదండ్రులు, శ్రీహరిపురం మా బాబుకు వయసు పెరుగుతున్నా.. శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లేదు. ఇంట్లో ఏ పనీ చేయలేడు, కనీసం అన్నం కూడా తినలేడు. నేను గానీ, నా భర్త గానీ ఇంట్లో దగ్గర ఉండి బాబుకు అన్నం తినిపించాల్సి వస్తోంది. మా కుమారుడికి పరీక్షలు చేయించడానికి ఇక్కడికి వచ్చాం. వైద్యుల సలహా మేరకు మందులు వాడుతున్నాం. ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేలు మందులకు సరిపోవడం లేదు. పింఛన్ మొత్తాన్ని పెంచి మమ్మల్ని ఆదుకోవాలి. –పద్మశ్రీ, శ్రీనివాస్ తల్లి, జనతాకాలనీ, మల్కాపురం వైద్య పరీక్షం కోసం వేచి ఉన్న దివ్యాంగులు -
ప్రసవాల్లో రికార్డ్
ముంచంగిపుట్టు సీహెచ్‌సీ ఘనతముంచంగిపుట్టు: మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రసవాలలో రికార్డు సృష్టించింది. ఈ ఆస్పత్రిలో ఒక్క నెల రోజుల్లోనే 100 మందికి పురుడు పోశారు. సీహెచ్‌సీ చరిత్రలో ఇప్పటి వరకు నెలలో 100 డెలివరీలు ఎప్పుడూ జరగలేదు. అన్నీ సాధారణ ప్రసవాలే కావడం విశేషం. 200 పడకలు ఉన్న చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో మార్చి నెలలో 82 ప్రసవాలు జరగగా, 200 పడకలు ఉన్న అరకువేలి ఏరియా ఆస్పత్రిలో 109 జరిగాయి. కేవలం 30 పడకలు ఉన్న ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో 100 ప్రసవాలు జరగడం వైద్యులు, సిబ్బంది కృషికి అద్దం పడుతోంది. స్థానిక సీహెచ్‌సీ సూపరింటెండెంట్ కిముడు గీతాంజలి పర్యవేక్షణలో వైద్యులు సంతోష్, ధరణి, హెడ్ నర్స్ సింహాచలం, స్టాఫ్ నర్సులు, నర్సులు, సపోర్టింగ్ స్టాఫ్, వైద్య సిబ్బంది శ్రమించి నెల రోజుల్లో 100 మంది గర్భిణులకు పురుడు పోశారు. ఈ సందర్భంగా సీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఇంటి వద్ద ప్రసవాల వల్ల కలిగే నష్టాలను క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది వివరించి, ఆస్పత్రులలో పురుడు పోసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేసి, చైతన్యవంతులను చేయడంతో ప్రభుత్వ ఆస్పత్రులలో డెలివరీల సంఖ్య పెరుగుతుందని అన్నారు. సీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది కృషి వల్లనే 100 ప్రసవాలు చేయడం జరిగిందని, 51మంది మగ పిల్లలు, 47 మంది ఆడపిల్లలు జన్మించారని, ఇద్దరు శిశువులు చనిపోయి పుట్టారని వివరించారు. ఆస్పత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. సీహెచ్‌సీలో సదుపాయాలు కరువైనా.. ముంచంగిపుట్టు సీహెచ్‌సీలో గర్భిణుల ప్రసవాలకు సదుపాయాలు అంతంతమాత్రమే. ముఖ్యంగా గర్భిణులకు గైనికాలజిస్ట్ లేరు. దీంతో అల్ట్రాసౌండ్ పరీక్షలు గత కొన్ని నెలలుగా జరగడం లేదు. అన్ని విభాగాలకు చెందిన 8మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ముగ్గురు మాత్రమే ఉన్నారు. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లోని 46 పంచాయతీలకు చెందిన 724 గ్రామాలకు ముంచంగిపుట్టు సీహెచ్‌సీ ప్రధాన దిక్కుగా ఉంది. ప్రతి రోజు 200 నుంచి 250 వరకు ఓపీ నమోదవుతుంది. మలేరియా, టైఫాయిండ్ వంటి జ్వరాలతో రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారు. కేవలం 30 పడకల ఆస్పత్రి కావడంతో గర్భిణులకు, రోగులకు వార్డులలో పడకల కేటాయింపులో వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు సీహెచ్‌సీలో పెరుగుతున్న రోగుల సంఖ్య, గర్భిణుల ప్రసవాలను దృష్టిలో పెట్టుకొని సీహెచ్‌సీని అప్‌గ్రేడ్ చేసి వంద పడకల ఆస్పత్రిగా చేస్తే గిరిజనులకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందేందుకు ఆస్కారం ఉంది. ఆ దిశగా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో, వైద్యశాఖ ఉన్నతాధికారులు చొరవ చూపాలని గిరిజనులు కోరుతున్నారు.అన్నీ సాధారణ ప్రసవాలే.. ఒక్క నెలలోనే 100 మందికి పురుడు పోసిన వైద్యులు -
సీలేరు జల విద్యుత్ కేంద్రం అరుదైన ఘనత
సీలేరు: సీలేరు కాంప్లెక్సు పరిధిలోని ఎగువ సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో 24 గంటల్లో అత్యధికంగా 5.126 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేసి సీలేరు జలవిద్యుత్ కేంద్రం ఆల్ టైం రికార్డును నెలకొల్పిందని ఏపీ జెన్కో కాంప్లెక్సు చీఫ్ ఇంజనీర్ వాసుదేవరావు తెలిపారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో 1967లో ఉత్పత్తిని ప్రారంభించారని, అప్పటి నుంచి జలవిద్యుత్ కేంద్రంలో 24 గంటల్లో 3 నుంచి 4 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి మాత్రమే జరిగేదని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న 4.949 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించి రికార్డు నెలకొల్పగా, మార్చి 24 ఉదయం 6 గంటల నుంచి 25వ తేదీ ఉదయం 6 గంటల వరకు 24 గంటల్లో 5.126 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి జలవిద్యుత్ కేంద్రం 58 ఏళ్ల చరిత్రలో అత్యధిక రికార్డును నెలకొల్పిందన్నారు. ఈ ఏడాది కేంద్ర విద్యుత్ అథారిటీ సీలేరు జల విద్యుత్ కేంద్రానికి 477 మిలియన్ యూనిట్లు టార్గెట్ నిర్దేశించగా ఆ లక్ష్యాన్ని ఫిబ్రవరి 27 నాటికి పూర్తి చేసి, జెన్కో ఉన్నతాధికారుల మన్ననలను పొందిందన్నారు. సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు, డొంకరాయి, ఎగువ సీలేరు, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాలకు 2024–25 సంవత్సరానికి 2286.14 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని టార్గెట్‌గా సెంట్రల్ విద్యుత్ అథారిటీ నిర్దేశించదని, సీలేరు కాంప్లెక్సుకు నిర్దేశించిన లక్ష్యాన్ని మించి విద్యుదుత్పత్తిని చేసిందని గురువారం సీఈ వాసుదేవరావు తెలిపారు. 24 గంటల్లో 5.126 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి -
కో ఆప్షన్ పదవి వైఎస్సార్సీపీ కై వసం
చింతూరు: స్థానిక మండల పరిషత్ కో ఆప్షన్ పదవిని వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. కో ఆప్షన్ సభ్యుడిగా మొహమ్మద్ జిక్రియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత కో ఆప్షన్ సభ్యుడు మొహమ్మద్ అక్బర్అలీ అనారోగ్యంతో మృతి చెందడంతో కో ఆప్షన్ పదవికి గురువారం ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారి డీఎల్డీవో కోటేశ్వరరావు, ఎంపీడీవో రామకృష్ణలు ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించారు. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలుండగా వైఎస్సార్సీపీకి ఎనిమిది మంది, సీపీఎంకు ఇద్దరు, టీడీపీ, ఇండిపెండెంట్‌కు ఒక్కరు చొప్పున సభ్యులున్నారు. కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక ప్రక్రియకు వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రమే హాజరుకాగా సీపీఎం, టీడీపీ, ఇండిపెండెంట్ సభ్యులు గైర్హాజర య్యారు. వైఎస్సార్సీపీ తరపున జిక్రియా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో కో ఆప్షన్ సభ్యుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అధికారులు ప్రకటించారు. సభ్యుడిగా ఎన్నికై న జిక్రియాతో ప్రతిజ్ఞ చేయించడంతో పాటు ఎన్నికై నట్లు ధ్రువీకరణ పత్రం అందచేశారు. అభినందలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, నాయకులు కో ఆప్షన్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై న మొహమ్మద్ జిక్రియాను వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు చిచ్చడి మురళి, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీలు మేడేపల్లి సుధాకర్, యడమ అర్జున్, ఎంపీటీసీలు గౌరమ్మ, నరేష్, నాగరాజు, లక్ష్మి, నాగమణి, సర్పంచ్‌లు సత్తిబాబు, కన్నారావు, చంద్రయ్య, సీత, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామలింగారెడ్డి, నాయకులు కోట్ల కృష్ణ, మహేష్, విప్లవ్‌కుమార్ పాల్గొన్నారు. -
జి.మాడుగుల ఎంపీపీగా లంబూరి అప్పలరాజు
జి.మాడుగుల: మండల ప్రజా పరిషత్ నూతన అధ్యక్షుని ఎన్నిక గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రశాంతంగా జరిగింది. టీడీపీ అభ్యర్థి లంబూరి అప్పలరాజు ఎంపీపీగా ఎన్నికయ్యారు. మండల పరిషత్‌లో మొత్తం 13 స్థానాల్లో వైఎస్సార్సీపీ సంఖ్యాబలం 7 ఉన్నప్పటికీ ప్రలోభాలతో ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కై వసం చేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు గైర్హాజరు కాగా, గతంలో వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు అధికారి పార్టీ ప్రలోభాలతో మళ్లీ టీడీపీలో చేరారు. నిజానికి ఈ మండలంలో తొలుత మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏడింటిలో వైఎస్సార్సీపీ, ఏడింటిలో టీడీపీ, ఒక స్థానంలో ఇండిపెండెంట్ గెలిచారు. ఇండిపెండెంట్ మద్దతుతో అప్పట్లో టీడీపీ ఎంపీపీ స్థానాన్ని గెలుచుకుంది. ఇండిపెండెంట్‌గా గెలిచిన కొర్రా పద్మకు ఎంపీపీగా అవకాశమిచ్చారు. ఒప్పందం ప్రకారం ఆమె రాజీనామా చేయడంతో గురువారం ఉప ఎన్నిక జరిగింది. 2021 స్థానిక ఎన్నికల తర్వాత ఒక టీడీపీ ఎంపీటీసీ వైఎస్సార్సీపీలో చేరారు. ఒక వైఎస్సార్సీపీ ఎంపీటీసీ మరణించగా.. టీడీపీ ఎంపీటీసీ ఒకరు రాజీనామా చేశారు. దీంతో స్థానాల సంఖ్య 13కి తగ్గింది. ప్రస్తుత సంఖ్యాబలం వైఎస్సార్సీపీ 7 (టీడీపీ ఎంపీటీసీతో కలిపి)–టీడీపీ 6 (ఇండిపెండెంట్‌తో కలిపి). వైఎస్సార్సీపీ అభ్యర్థి కుడుముల సత్యనారాయణ ఎంపీపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరపున లంబూరు అప్పలరాజు నామినేషన్ వేశారు. అయితే గతంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన సొలభం ఎంపీటీసీ సభ్యుడు చిన్నారావుకు టీడీపీ నేతలు ప్రలోభాలకు గురి చేయడంతో నాటకీయంగా మళ్లీ టీడీపీ గూటికి చేరాడు. ఇదికాక వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. దీంతో 11మంది సభ్యులే హాజరు కాగా టీడీపీకి ఏడు ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి లంబూరు అప్పలరాజు గెలిచినట్టు ప్రకటించారు. గైర్హాజరైన వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు గబ్బాడి సన్యాసిదొర, అంగనైని నానాజీలు టీడీపీ ప్రలోభాలకు గురైనట్టు ప్రచారం జరుగుతోంది. సొలభం ఎంపీటీసీ సభ్యుడు చిన్నారావు తిరిగి టీడీపీలో చేరకుండా, ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు హాజరై వైఎస్సార్సీపీ అభ్యర్ధి కుడుముల సత్యనారాయణకు సహకరిస్తే ఆయనే ఎంపీపీ అయ్యేవారు. ఉప సర్పంచ్ పదవి వైఎస్సార్సీపీకే జి.మాడుగుల మండలం గెమ్మెలి ఉప సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు, 14వ వార్డు సభ్యుడు కోటేశ్వరరావు కైవసం చేసుకున్నారు. సర్పంచ్‌తో సహా మెజార్టీ వార్డు సభ్యులంతా కోటేశ్వరరావుకు మద్దతిచ్చారు. ప్రలోభాలతో గెలుచుకున్న టీడీపీ -
ఏసీఏ అడ్డగోలు దోపిడీ!
ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో ధర సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ ప్రేమికుల ఉత్సాహాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సొమ్ము చేసుకుంటోంది. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో ధరను వసూలు చేస్తూ దోపిడీకి తెరలేపుతోంది. ఈ నెల 24వ తేదీన జరిగిన ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను రూ.వెయ్యి నుంచి రూ.15 వేల వరకు ధర నిర్ణయించి విక్రయాలు చేపట్టింది. ఈ నెల 30వ తేదీన ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌కు ఒకేసారి టికెట్ల ధరలను పెంచేసింది. రూ.1,250 నుంచి రూ. 20 వేల వరకూ టికెట్ల ధరలను నిర్ణయించింది. టికెట్ల విక్రయాలు కూడా ఒక పద్ధతి ప్రకారం చేపట్టడం లేదు. ఢిల్లీ క్యాపి టల్స్–లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యా చ్లో టికెట్ల అమ్మకాలు కూడా సరిగ్గా జరగలేదు. దీంతో గ్రౌండ్లో సగం మంది కూడా ప్రేక్షకులు కనిపించలేదు. ఇటువంటి పరిస్థితుల్లోనూ టికెట్ల విక్రయాల్లో పారదర్శకత పాటించకుండా గుంభనంగా ఇష్టారీతిలో ఏసీఏ పెద్దలు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా పూర్తిగా టీడీపీ నేతలతోనే ఏసీఏ నిండిపోవడంతో తమకు అడ్డేముందనే రీతిలో వీరి ప్రవర్తన ఉందని క్రికెట్ ప్రేమికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు చేపట్టకుండా ఏసీఏ పెద్దలు అంతా లోలోపల వ్యవహారాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. టికెట్ల ధరలు అమాంతం పెంచేశారు విశాఖలో ఐపీఎల్ టికెట్ల విక్రయాల్లో అడ్డగోలు దోపిడీ జరుగుతోందనే ఆరోపణలున్నాయి. మ్యాచ్ మ్యాచ్‌కు టికెట్ల ధరల్లో వ్యత్యాసం ఉండటంతో పాటు భారీ ధరలతో క్రికెట్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. గత మ్యాచ్‌లో రూ.వెయ్యి ఉన్న లోయర్ డినామినేషన్ టికెట్ ధరను రూ.1250లకు పెంచారు. బీ స్టాండ్‌లోని రూ.2 వేల టికెట్‌ను రూ.2,500లకు, ఐ, సీ స్టాండ్ రూ.3 వేలు టికెట్ ధరను రూ.4 వేలకు పెంచి విక్రయిస్తున్నారు. ఇక సౌత్ వెస్ట్ అప్పర్, సౌత్ ఈస్ట్ అప్పర్ స్టాండు టికెట్ ధర గత మ్యాచ్‌లో రూ.5 వేలు ఉండగా.. ఇప్పుడు కాస్తా రూ.6 వేలకు పెంచేశారు. ఇక సౌత్ వెస్ట్ లోయర్, సౌత్ ఈస్ట్ లోయర్ ధరలను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు అమాంతంగా పెంచి విక్రయిస్తున్నారు. ఇక బాక్సుల ధరలు కాస్తా రూ.15 వేల నుంచి రూ.20వేలకు పెంచేశారు. క్రికెట్ అభిమానాన్ని ఈ విధంగా అడ్డగోలుగా దోచుకునేందుకు ఏసీఏ ప్రయత్నిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఇవేవీ సదరు ఏసీఏ కార్యవర్గం పట్టించుకునే స్థితిలో లేకపోవడం గమనార్హం. అన్నీ ఆన్లైన్లోనే..! : గతంలో ఏ మ్యాచ్ అయినా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోను టికెట్ల విక్రయాలు చేపట్టేవారు. ఈసారి మాత్రం ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు జరగలేదు. గతంలో క్యూలో ఉంటే తమకు టికెట్ దొరుకుతుందనే ఆశతో క్రికెట్ అభిమానులు కొనుగోళ్లకు ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం ఆన్లైన్లో ఎప్పుడు టికెట్లను విక్రయిస్తారా అని వేచిచూడాల్సి వస్తోంది. ఒకవేళ ఆ సమయానికి సరిగ్గా ఆన్లైన్లో ఉండి.. టికెట్లను కొనుగోలు చేద్దామంటే మీ కంటే ఇంకా కొన్ని వేల మంది క్యూలో ఉన్నారంటూ వస్తోంది. అంత సమయం ఓపికగా వేచి ఉండి.. టికెట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే.. ముందు వరుసలోని సీట్లన్నీ అప్పటికే అమ్మకాలు జరిగినట్టుగా చూపెడుతోంది. ఈ ముందు వరుసలోని సీట్లన్నీ ఏసీఏలోని నేతలు వారి అనుచరులకే కట్టబెడుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.6 వేలు, రూ.12 వేలు, రూ.20 వేల వరకూ చెల్లించి కొనుగోలు చేసే టికెట్లను కూడా వెనుక వరుసలో ఉండి చూడాల్సి వస్తోందని క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. ఫలితంగా అనేక మంది టికెట్లను కొనుగోలు చేయకుండానే ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గత మ్యాచ్‌లో గ్రౌండ్ సగం వరకు ఖాళీగా దర్శనమిచ్చింది. ఈ దఫా కూడా ఏసీఏలో ఎటువంటి మార్పు రాలేదని అభిమానులు మండిపడుతున్నారు. అయితే టికెట్ల విక్రయంతో తమకు నేరుగా సంబంధం లేదని.. సదరు ఫ్రాంచైజీలే చూసుకుంటాయంటూ ఏసీఏ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. హడావుడితో అభాసుపాలు : డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకుంది. ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో స్టేడియాన్ని ఆధునికీకరించాలని ఏసీఏ భావించింది. ఇందులో భాగంగా స్టేడియానికి గల డాక్టర్ వైఎస్సార్ పేరును తొలగించి విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత పేరు తొలగించలేదంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. టికెట్ల విక్రయాల్లోనూ అదే పంథాను కొనసాగించింది. రెండో మ్యాచ్‌కు అధిక ధరలకు టికెట్లు విక్రయించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏసీఏ వ్యవహారశైలితో క్రికెట్ ప్రేమికులకు నిరాశే మిగులుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత మ్యాచ్‌లో రూ.వెయ్యి నుంచి రూ.15 వేల వరకు ధరలు 30 నాటి మ్యాచ్‌కి రూ.1,250 నుంచి రూ.20 వేల వరకు పెంపు రూ.5 వేల టికెట్.. రూ.6 వేలకు పెంచిన వైనం రూ.15 వేల టికెట్ కాస్తా రూ.20 వేలకు అమ్మకం భారీ ధరలతో క్రికెట్ ప్రేమికులకు నిరాశ -
● పాడేరు ఐటీడీఏ పరిధిలో 21 టీచర్ పోస్టులు ఖాళీ ● విద్యా సంవత్సరం పూర్తవుతున్నా భర్తీ కానీ ఖాళీలు ● గత ఏడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు ● నవంబర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించి, భర్తీ చేయని వైనం ● ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బందిపడుతున్న విద్యార్థులు
ఏకలవ్యుడు... ప్రత్యక్షంగా గురువు ద్వారా నేర్చుకునే అవకాశం లేకపోవడంతో ప్రతిమ ముందు సాధన చేసి ఎదురులేని విలుకాడుగా నిలిచిన ఆదివాసీ బిడ్డ. ఆ పేరుతో ఏర్పాటు చేసిన పాఠశాలల్లో విద్యార్థులు కూడా గురువులు లేకుండానే గొప్పవాళ్లు కావాలని ప్రభుత్వం భావిస్తోందో ఏమో గాని విద్యా సంవత్సరం పూర్తవుతున్నా ఉపాధ్యాయులను నియమించలేదు. పలు పాఠశాలల్లో కొన్ని సబ్జెక్టులను బోధించకుండానే విద్యార్థులు పరీక్షలు రాయవలసి వస్తోంది. దీంతో ఎన్నో ఆశలతో ఈ పాఠశాలల్లో చేరిన గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెదబయలు: జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని మండలాల్లో ఈ పాఠశాలలున్నాయి. గత ఏడాది ఇతర ప్రాంతాల నుంచి కొంత మంది ఉపాధ్యాయులను ఇక్కడ నియమించినా పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టలేదు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని పాడేరు, జి.మాడుగుల, కొయ్యూరు, చింతపల్లి, జీకే వీధి, అరకులోయ, పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అనంతగిరి మండలాలకు సంబంధించి 11 ఏకలవ్య పాఠశాలలున్నాయి. ముంచంగిపుట్టు, జీకే వీధి, డుంబ్రిగుడ, చింతపల్లి మండలాల్లో పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి ఇంటర్మీడియెట్ వరకూ నిర్వహిస్తుండగా, మిగతా మండలాల్లో ఆరవ తరగతి నుంచి పదో తరగతి వరకూ నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో 21 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో పెదబయలు మండలంలో ఆరు, ముంచంగిపుట్టు మండలంలో మూడు, ఇతర మండలాల్లో మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ గెస్ట్ టీచర్లను నియమించేందుకు గత ఏడాది అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో సుమారు 900 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 14న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడంతో పాటు ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరిపారు. అనంతరం మెరిట్ లిస్ట్ కూడా పెట్టి పోస్టులు భర్తీ చేయకుండా వదిలేశారు. దీంతో చాలా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో పలు సబ్జెక్టుల్లో బోధన జరగడం లేదు. ఉపాధ్యాయులు లేని సబ్జెక్టులను పాఠశాలల్లో ఇతర ఉపాధ్యాయులు అదనంగా తీసుకుని బోధిస్తున్నారు. దీంతో అరకొరగా బోధన జరుగుతోంది. కొన్ని పాఠశాలల్లో ఆయా సబ్జెక్టులను అసలు బోధించలేదు. పెదబయలు ఏకలవ్య పాఠశాలలో ఆరు టీజీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.తెలుగు, కంప్యూటర్, బయాలజీ, ఇంగ్లిష్ బోధించేందుకు టీచర్లు లేరు. ముంచంగిపుట్టు ఏకలవ్య పాఠశాలలో తెలు గు సబ్జెక్టులో రెండు (టీజీటీ –1, పీజీటీ–1) పోస్టులు, ఒక బయాలజీ (పీజీటీ)పోస్టు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం, కలెక్టర్,ఐటీడీఏ పీవో స్పందించి పోస్టులు భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. మరో వైపు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల కోడ్ వల్ల భర్తీలో జాప్యం పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో 11 ఈఎంఆర్‌ఎస్‌లకు సంబంధించి 21 ఉపా ధ్యాయ ఖాళీల భర్తీని ఎన్నికల కోడ్ వల్ల నిలిపివేయవలసి వచ్చింది. కోడ్ ముగిసిన తరువాత కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు మళ్లీ మెరిట్ లిస్టు అందజేశాం. ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే పోస్టులు భర్తీ చేస్తాం. –మూర్తి, గురుకుల నోడల్ ప్రిన్సిపాల్, పాడేరు. పెదబయలు ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల -
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
హుకుంపేట: మండలంలోని కొట్నాపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ పాములపుట్టు గ్రామానికి చెందిన గెమ్మెలి నూకరాజు(45), దొసుద(43) కొట్నాపల్లిలో జరిగిన క్రైస్తవ సమావేశానికి మంగళవారం సాయంత్రం వచ్చారు. సమావేశం అనంతరం తమ స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై మూడు సంవత్సరాల కుమారుడితో కలిసి బయలుదేరారు. కొట్నాపల్లిలో ఎదురుగా వచ్చిన లారీ వీరిని ఢీకొంది. బాలుడికి తీవ్ర గాయాలు కాగా, భార్యాభర్తలు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు హుకుంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాలుడిని పాడేరు ఆస్పత్రికి పంపారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ సురేష్ తెలిపారు. ఆదుకోవాలని ఆందోళనకొట్నాపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నూకరాజు,దొసుద కుటుంబ సభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం హుకుంపేట పోలీస్ స్టేషన్ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు సీసీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు తాపుల కృష్ణారావు,సొంటెన హైమవతి మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో పలు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. మృతుల కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
సాక్షి, పాడేరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో అనుబంధ విభాగాలకు అధ్యక్షు లను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా ఆవుల మరియాదాస్(రంపచోడవరం),ఎస్టీసెల్ అధ్యక్షుడిగా కుంజెం మురళీ(రంపచోడవరం),మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా షేక్ కాజావలీ(రంపచోడవరం), విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా లోచలి వరప్రసాద్(పాడేరు),ఆర్టీఐ విభాగం అధ్యక్షుడిగా బొడ్డు సత్యనారాయణ(రంపచోడవరం),వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కోట్ల కృష్ణ(రంపచోడవరం),సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిగా జంపరంగి విజయ్‌కుమార్(పాడేరు), దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా వనగల వెంకటేశ్వర్లు(పాడేరు),డాక్టర్ల విభాగం అధ్యక్షుడిగా గండేరు చినసత్యం(అరకులోయ),బూత్ కమిటీల విభాగం అధ్యక్షుడిగా చింతపల్లి దుర్గా రఘనాఽథ్(రంపచోడవరం) నియమితులయ్యారు. పాడేరు నియోజకవర్గంలో మండలాల అధ్యక్షులు వీరే వైఎస్సార్సీపీ అధ్యక్షులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాడేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్షులను నియమించారు. చింతపల్లి మండల అధ్యక్షుడిగా పాంగి గణబాబు, జి.మాడుగుల మండల అధ్యక్షుడిగా నుర్మాని మత్స్యకొండంనాయుడు, జీకే వీధి మండల అధ్యక్షుడిగా కంకిపాటి గిరిప్రసాద్,కొయ్యూరు మండల అధ్యక్షుడిగా బిడిజాన అప్పారావు,పాడేరు మండల అధ్యక్షుడిగా సీదరి రాంబాబును నియమించారు. -
సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి
సీపీఎం ఆందోళనచింతూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటుతున్నా సూపర్‌సిక్స్ హామీలు నేటికీ అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం చింతూరు ఐటీడీఏను ముట్టడించారు. చింతూరు నుంచి ర్యాలీగా వెళ్లి హామీలు అమలు చేయాలంటూ ఐటీడీఏ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ సూపర్‌సిక్స్ హామీలు ఎక్కడా అమలు కావడం లేదని, మహిళలకు నెలకు రూ.1,500, ఏభైఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్లు అమలు చేయలేదన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అవగాహన లేని అధికారులను గ్రామసభలకు పంపి నిర్వాసితులను గందరగోళ పరుస్తున్నారని ఆయన విమర్శించారు. గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వలస ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని, రేషన్‌కార్డుల సమస్యలు పరిష్కరించాలని, గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పార్టీ నాయకులు ఐటీడీఏ పీవో అపూర్వభరత్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి, సీసం సురేష్, పులి సంతోష్, సుబ్బమ్మ, శ్రీనివాసరావు, వెంకట్, ప్రదీప్, వెంకమ్మ, రాజయ్య పాల్గొన్నారు. -
30న శ్రీవారి సన్నిధిలో ఉగాది వేడుకలు
కొమ్మాది: రుషికొండలోని శ్రీమహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30న టీటీడీ అర్చకులచే పంచాంగ పఠనం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు వేకువజామున 4 నుంచి 4.30 గంటల వరకు సుప్రభాతం, 4.30 నుంచి 6 గంటల వరకు అర్చన, కొలువు, తోమాల, సహస్ర నామార్చన, 6 నుంచి 8.30 గంటల వరకు సర్వ దర్శనాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 8.30 నుంచి 9 గంటల వరకు అర్చన, 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఆస్థానం, పంచాంగ పఠనం, రాత్రి 7 గంటల వరకు సర్వ దర్శనం, 7 నుంచి 7.40 వరకు అర్చన, 7.40 నుంచి 9.30 గంటల వరకు సర్వ దర్శనం, 9.30 నుంచి 10 గంటల వరకు ఏకాంత సేవ ఉంటుందని, భక్తులు గమనించాలని సూచించారు. -
వందేళ్ల జ్ఞాపకం.. విశాఖ విజయ రథం
దేశంలో ఎలక్ట్రిక్ రైలు కార్యకలాపాలు ప్రారంభమై వందేళ్లు పూర్తయ్యాయి. ఈ శతాబ్ది వేడుకల సందర్భంగా వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్తగా సంబరాలు చేసుకుంది. ఎలక్ట్రికల్ రైల్వే వ్యవస్థకు చిహ్నంగా థీమ్ బేస్డ్ స్పెషల్ ఇంజిన్‌ను రూపొందించింది. ఈ లోకో ఇంజిన్‌ను ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానించింది. త్రివర్ణ పతాకం ఐకానిక్‌గా.. విశాఖ చరిత్రను, విశిష్టతను స్పృశిస్తూ రైల్వే యంత్రాంగం ‘విశాఖ విజయరథం’పేరుతో ఈ అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. – సాక్షి, విశాఖపట్నం బాంబే విక్టోరియా టెర్మినస్ (ప్రస్తుతం సీఎస్ఎంటీ), కుర్లా మధ్య 1925 ఫిబ్రవరి 3న మొదటి ఎలక్ట్రిక్ రైలు పరుగులు పెట్టింది. ఈ చారిత్రక రోజున భారతీయ రైల్వే వ్యవస్థ ఒక అద్భుతమైన మైలురాయిని అందుకుంది. ఆ తర్వాత ఇండియన్ రైల్వే వరుస విజయాలతో దూసుకుపోయింది. వందేళ్ల పండగకు ప్రతీకగా, వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త ఆలోచనతో అద్భుతాన్ని ఆవిష్కరించింది. దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ లోకో షెడ్లలో ఒకటైన వాల్తేరు లోకోషెడ్ ఆధ్వర్యంలో థీమ్ బేస్డ్ లోకోను రూపొందించింది. దీనికి విశాఖ విజయరథంగా నామకరణం చేశారు. డబ్ల్యూఏపీ–7 (నం.39145)తో రూపొందించిన ఎలక్ట్రిక్ లోకోను బుధవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి డీఆర్ఎం లలిత్‌బోరా జెండా ఊపి ప్రారంభించారు. ఏడీఆర్ఎం (ఇన్ఫ్రా) ఈ సీతారామ్, ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ బి.షణ్ముఖరావు నేతృత్వంలో రూపొందించిన ఈ లోకోమోటివ్ను బెంగళూరు–భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానించారు. త్రివర్ణపతాకం..విశాఖ వైభవం వాల్తేరు ఎలక్ట్రిక్ లోకో షెడ్ 39145 నంబర్ గల గిఅఖీఉ గిఅ్క–7 లోకోను రూపొందించినప్పుడు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా.. త్రివర్ణ పతాకంతో శోభిల్లేలా లోకో మొత్తం ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అంతేకాదు విశాఖ నగరపు ప్రత్యేకతలను ప్రపంచానికి తెలియజేసేలా కొన్ని ముఖ్యమైన చిహ్నాలను కూడా దీనిపై ముద్రించారు. ఈ లోకో ఇంజిన్‌పై తూర్పు నౌకాదళానికి గుర్తుగా జలాంతర్గామి, విశాఖపట్నం పోర్టు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలం ఆలయం, పారిశ్రామిక హబ్‌గా గుర్తింపు పొందిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్ బొమ్మలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన లోకో విశాఖ నగరానికి, భారతీయ రైల్వేకు గర్వకారణంగా నిలుస్తోంది. ఎలక్ట్రికల్ రైల్వే వ్యవస్థకు వందేళ్లు థీమ్ బేస్డ్ ఇంజిన్ రూపొందించిన లోకోషెడ్ విశాఖ ఘనత చాటేలా ప్రత్యేక శ్రద్ధ కర్బన ఉద్గారాల నియంత్రణలో కీలకం.. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు ఇండియన్ రైల్వేస్ ఈ ఎలక్ట్రిక్ లోకోలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అద్భుత ఘట్టానికి వందేళ్లు పూర్తవ్వగా, ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విశాఖ విజయరథం రూపొందించడం శుభపరిణామం. వాల్తేరు ఎలక్ట్రిక్ లోకో షెడ్ 336 లోకోల నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. నిరంతరం ఎంతో పని ఒత్తిడి ఉన్నా.. వందేళ్ల ఉత్సవానికి గుర్తుగా అద్భుతమైన లోకోను తీర్చిదిద్దినందుకు షెడ్ సిబ్బందికి కృతజ్ఞతలు. ఎలక్ట్రిక్ లోకోల రాకతో భారతీయ రైల్వే ప్రయాణ వేగాన్ని క్రమంగా పెంచుకుంటూ దూసుకుపోతోంది. – లలిత్‌బోరా, వాల్తేరు డీఆర్ఎం -
పాస్‌పోర్టు కేంద్రం సేవలనుసద్వినియోగం చేసుకోవాలి
అరకులోయటౌన్: మండల కేంద్రంలోని పోస్టాఫీస్‌లో ఏర్పాటుచేసిన పాస్‌పోర్ట్ కేంద్రం ద్వారా సేవలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఎమ్మెల్యే మత్స్యలింగం పాస్‌పోర్ట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ గతంలో పాస్‌పోర్ట్ సేవ కేంద్రం లేక స్థానికులు ఎంతో వ్యయ ప్రయాసాలతో సుదూర ప్రాంతాలైన విశాఖపట్నం, అనకాపల్లికి వెళ్లి పాస్‌పోర్ట్ పోందేవారన్నారు. ఇప్పడు అటువంటి సమస్య లేకుండా అరకులోయలో ఈ కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిశీలించి, త్వరితగతిన పాస్‌పోర్టు అందిస్తున్నారన్నారు. అరకులోయ, పాడేరు ఏజేన్సీ ప్రాంత ప్రజలంతా ఈ పాస్‌పోర్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. పాస్‌పోర్ట్ ఇన్స్పెక్టర్ కిషోర్, మేనేజర్ నితీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
ఎస్‌ఓపీతో సజావుగా చందనోత్సవం
సింహాచలం: వచ్చే నెల 30న జరగనున్న చందనోత్సవంలో స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ)ను రూపొందించినట్లు రాష్ట్ర దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ తెలిపారు. బుధవారం సింహాచలం వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకుని, స్థానిక మీడియాతో మాట్లాడారు. సింహాచలం క్షేత్రంలో చందనోత్సవం చాలా పెద్ద ఉత్సవమని, రోజులో కొన్ని గంటలు మాత్రమే ఉంటుందన్నారు. ఏటా లక్ష 50 వేలమంది భక్తులతో పాటు వీఐపీలు కూడా స్వామివారి నిజరూప దర్శనానికి వస్తారన్నారు. ఇప్పటి వరకు జరిగిన పలు చందనోత్సవాల్లో ఎదురైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎస్ఓపీ రూపొందించామన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. చందనోత్సవం నిర్వహణపై వచ్చేనెల మొదటి వారంలో ప్రభుత్వ స్థాయిలో దేవదాయశాఖ, హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రులతో ఒక సమావేశం జరుగుతుందన్నారు. దేవదాయశాఖలో ఎన్ఎంఆర్ల పర్మినెంట్ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. దర్శనార్థం ఆలయానికి వచ్చిన ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక, శేషవస్త్రాన్ని ఈవో కె.సుబ్బారావు అందించారు. రాష్ట్ర దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ -
12వ పీఆర్సీ చైర్మన్ నియామకం ఎప్పుడు?
అనకాపల్లి: 2023 జూలై 1 నుంచి రావాల్సిన 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ని నేటివరకూ ప్రభుత్వం నియమించలేదని, కూటమి ప్రభుత్వం తక్షణమే నియమించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జిల్లా యూటీఎఫ్ ఆఫీస్ బేరర్స్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన గత ప్రభుత్వం 12వ పీఆర్సీ చైర్మన్ నియమించినప్పటికీ అతనికి ఎలాంటి విధివిధానాలు రూపొందించకపోవడం వల్ల రిజైన్ చేసి వెళ్లిపోయారని, వచ్చిన కొత్త ప్రభుత్వం తొమ్మిది నెలలు పూర్తవుతున్నా నేటి వరకూ 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించలేదన్నారు. చైర్మన్ నియామకం విధివిధానాలను రూపొందించి, సంఘాలతో చర్చించి వివిధ రకాలైన ప్రతిపాదనలు పెట్టడానికి చాలా సమయం తీసుకుంటుంది కనుక, తక్షణం చైర్మన్‌ని నియమించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ 29 శాతాన్ని ప్రకటించాలని ఆయన కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పాత బకాయి రూ.7వేలు కోట్లు చేసినప్పటికీ, నేటికీ రూ.25 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ బకాయిలలో సరెండర్ లీవ్ ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం సరికాద ఆయన విమర్శించారు. జీవో 117 కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,512 ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని, ఈ జీవోను తక్షణమే రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ పాఠశాలను అన్ని అంగులతో ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సు శ్రీకాకుళం కేంద్రంలో మార్చి 31న జరుగుతుందని, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు వెంకటరావు, సహాధ్యక్షుడు రొంగలి అక్కు నాయుడు, జిల్లా కార్యదర్శులు జి.ఎస్. ప్రకాష్, ఎన్.శేషు కుమార్, మాకిరెడ్డి రాజనాయుడు, రమేష్ రావు, కోశాధికారి జోగా రాజేష్, రాష్ట్ర కౌన్సిలర్ ఎల్లయ్య బాబు, ఎం.వి.అప్పారావు, గేదెల శాంతి దేవి పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు -
రక్తదానంతో ప్రాణదానం
కొయ్యూరు: రక్తదానం ఆపదలో ఉన్న ఎందరికో ప్రాణదానం చేస్తుందని మర్రిపాలెం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె.సుధ అన్నారు. యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. డిగ్రీ కళాశాలలో కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాల మేరకు రెడ్‌క్రాస్ సొసైటీ, కళాశాల ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో బుధవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 70 మంది వరకు రక్తదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో ఎస్.కె.వి.ప్రసాద్ మాట్లాడుతూ యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. పాడేరు వైద్యులు కె.జె.రాఘవేంద్ర, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి గౌరి శంకర్, వైస్ చైర్మన్ గంగరాజు, సభ్యులు రాజు, వీఆర్వో కుమారి, డౌనూరు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
● పార్లమెంట్లో గిరిజన మహిళా ప్రజాప్రతినిధికి అగౌరవం ● చింతపల్లి ఎంపీపీ అనూషదేవి
ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై ధ్వజం చింతపల్లి: భారత ప్రజాస్వామ్య విలువలు కాపాడే పార్లమెంటులోనే గిరిజన మహిళా ప్రజాప్రతినిధి పట్ల ప్రొటోకాల్ పాటించకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూషదేవి అన్నారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు. మన్య ప్రాంతంలో ఆర్గానిక్ కాఫీగా పేరు గాంచి, పార్లమెంటులోనే అరుకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేసి ఆ ప్రారంభ కార్యక్రమానికి అదే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అరుకు పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజారాణిని ఆహ్వానించక పోవడంపై ఎంపీపీ అనూషదేవి తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్లమెంటు సాక్షిగా జరిగిన ఈ సంఘటనపై ఎన్డీఏ ప్రభుత్వ తీరును యావత్ దేశం తప్పు పడుతుందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న ఎంపికే తెలియకుండా కార్యక్రమాలు చేపట్టడం దారుణమన్నారు. దేశ స్థాయిలోనే ఇటువంటి కార్యక్రమాలు జరిగితే రాష్ట్ర, జిల్లా, గ్రామీణస్థాయిలో ప్రజాప్రతినిధులు పట్ల ఎటువంటి గౌరవం ఉంటుందో ఆలోచించాలన్నారు.ఇటువంటి చర్యలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శన మన్నారు. పార్లమెంటు ఆవరణలో ప్రారంభోత్సవానికి అరుకు ఎంపీ తనూజారాణిని ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అనూషదేవి డిమాండ్ చేశారు. -
కళాశాలలో ప్రవేశాలపై విస్తృత ప్రచారం
సీలేరు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఏప్రిల్ 1 వతేది నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ వి.శంకరరావు తెలిపారు. అనుభవం గల అధ్యాపకులచే డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జాతీయ సేవా పథకం ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. కంప్యూటర్ కోర్సుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని, విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవగాహన తరగతులు నిర్వహిస్తామన్నారు. పదో తరగతి హాల్‌టికెట్లు, రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు, మార్కులిస్టు పత్రం, కులధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుతో జతచేసి కళాశాల కార్యాలయంలో అందజేయాలని సూచించారు. కళాశాలలో ప్రవేశాలకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. -
క్షణికావేశంతో వివాహిత ఆత్మహత్య
నాతవరం : భర్త మందలించాడన్న కారణంతో భార్య కిరోసిన్ పెట్రోల్ కలిపి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో నెలకొంది. నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ అందించిన వివరాల మేరకు మండలంలో ఎం.బి.పట్నం గ్రామానికి చెందిన పల్లి వెంకటలక్ష్మి (30) మంగళవారం ఉదయం తన కుమార్తె అల్లరి చేయడంతో కొట్టింది, అప్పటికే జ్వరంతో ఉన్న కుమార్తెను ఎందుకు కొట్టావంటూ భర్త పల్లి గోవింద్ భార్య వెంకటలక్ష్మి తీవ్రంగా మందలించడమే కాకుండా చెయ్యి చేసుకున్నాడు. దీంతో ఇరువురూ ఇంటి వద్ద ఘర్షణ పడ్డారు. కొంత సేపటి తర్వాత గోవింద్ తన జీడిమామిడి తోటలో పిక్కలు సేకరించడం కోసం వెళ్లిపోయాడు. జ్వరంతో ఉన్న పాపకు మధ్యాహ్నం వెంకటలక్ష్మి భోజనం పెట్టి ఇంటి వద్దే ఉంది. భర్త మండలించాడన్న కోపంతో వెంకటలక్ష్మి వ్యవసాయ ఇంజిన్ మోటారులో వేసేందుకు తీసుకువచ్చి ఇంట్లో ఉంచిన కిరోసిన్, పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్మ చేసుకుంది. కుమార్తె ఇంట్లో జ్వరంతో పడుకోని ఉండడంతో ఇంటి వెనుకకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది, మృతురాలికి బాబు, పాప ఉన్నారు. వెంకటలక్ష్మి, గోవింద్‌కు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. క్షణికావేశంతో వెంకటలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబీకులు భోరున విలపించారు. సంఘటన స్థలానికి నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ప్రత్యామ్నాయం చూపాలి
ఆరిలోవ(విశాఖ): జీవీఎంసీ 13వ వార్డు పరిధి ముడసర్లోవ వద్ద రైల్వే జోన్ పనులను మంగళవారం శ్రీకృష్ణాపురానికి చెందిన గిరిజనులు అడ్డుకున్నారు. ముడసర్లోవ ప్రాంతంలో 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేజోన్ కోసం కేటాయించిన సంగతి తెలిసిందే.ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థ భూసార పరీక్షలు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పొక్లెయిన్ ద్వా రా పనులు జరగనివ్వకపోవడంతో కాంట్రాక్టర్ పను లు నిలిపివేశారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఈ భూములు రైల్వేకు కేటాయించారని, వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. 1976లో అప్పటి కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణాపురంలో 66 గిరిజన కుటుంబాలకు 66 ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించిందని వారు తెలిపారు. ఆ భూమిని ఇప్పుడు రైల్వేకు కేటాయించడం అన్యాయమన్నారు. ఈ భూములు తీసుకున్నందుకు తమకు ప్రత్యామ్నాయం చూపాలని, అప్పటివరకు పనులు జరగనివ్వమని హెచ్చరించారు.రైల్వే జోన్ పనులు అడ్డుకుని, శ్రీకృష్ణాపురం గిరిజనుల ఆందోళన -
విత్తనాల నమోదును బాధ్యతగా తీసుకోవాలి
చింతపల్లి: గిరిజన రైతాంగం సంప్రదాయంగా సాగు చేస్తున్న పంటల విత్తనాలను నమోదు చేయడాన్ని బాధ్యతగా తీసుకోవాలని హైదరాబాద్ అటారి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ.వి.ఆర్. రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానంలో బీసీటీ,కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మొక్కలు రకాలు, పరిరక్షణ, రైతులు హక్కుల చట్టం–2001 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో పంటల వైవిధ్యం ఉన్పప్పటికీ పంటల రకాలు, విత్తన నమోదు చాలా తక్కువగా ఉందన్నారు. స్థానిక ఏడీఆర్ అప్పలస్వామి మాట్లాడుతూ విత్తనాలపై రైతులు హక్కులను కాపాడడమే కాకుండా అవసరమైతే రైతులు తరఫున పోరాడడానికి రైతుల చట్టం ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. రైతు క్లబ్బుల ఏర్పాటుకు ఎంతో తోడ్పాటు నిస్తుందన్నారు.ఈ సందర్భంగా సంజీవని స్వచ్ఛంద సంస్థ సంచాలకులు దేముళ్లు,బీవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శైలజ, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బయ్యపురెడ్డి,డాక్టర్ బాలహుస్సేన్రెడ్డిలు పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు బండి నాగేంద్ర ప్రసాద్,డాక్టర్ వాన ప్రసాదరావు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడి వలస కార్మికుడు మృతి
రాజవొమ్మంగి: పొట్టచేత పట్టుకొని వలస వెళ్లి, తిరిగి స్వగ్రామం వస్తున్న క్రమంలో మండలంలోని బడదనాంపల్లి గ్రామానికి చెందిన పాశిలి మురళీకృష్ణ(23) రైలు నుంచి జారి పడి సోమవారం మరణించాడు. మురళీకృష్ణ నెల్లూరు జిల్లా శివారు ప్రాంతాలకు కొంత మందితో కలసి ఉపాధి కోసం వెళ్లాడు. తిరిగి అక్కడ నుంచి స్వగ్రామం వస్తుండగా మార్గమధ్యలో గూడూరు వద్ద రైలు నుంచి జారి పడినట్టు తోటి కూలీలు తెలిపారు. మురళీకృష్ణ సంఘటన స్థలంలో మృతి చెందగా, మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామం తరలించి అంత్యక్రియలు జరిపారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు గంగరాజు, నారాయణమ్మలు భోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరు ఇంటర్మీడియెట్ వరకు చదివారు. చిన్న కుమారుడు మురళీకృష్ణ రైలు ప్రమాదంలో మరణించాడు. -
ధ్రువీకరణ పత్రాలపైఅవగాహన కల్పించాలి
● డీఆర్వో పద్మాలత పాడేరు : ధ్రువీకరణ పత్రాల ఉపయోగం, పొందే విధానం, వినియోగంపై గిరిజనులకు అవగాహన కల్పించాలని డీఆర్వో పద్మాలత తెలిపారు. ఐటీడీఏ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా న్యాయసేవల సంస్థ ఆధ్వర్యంలో నెలవారీ అవగాహన సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సమా వేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో అత్యధికంగా గిరిజనులే ఉండటం, వారిలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటంవల్ల అవగాహ న క్యాంపులు, సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. కుల,ఆదాయ,జనన, మరణ ధ్రువీ కరణ పత్రాలజారీలో నిర్లక్ష్యం, జాప్యం లేకుండా సేవలు అందించాలన్నారు.ధ్రువీకరణపత్రాల జారీలో ఏ విధమైన కోర్టు కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపా రు. ఈ పత్రాల జారీ విషయంలో పంచాయ తీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లలకు, గ్రా మ రెవెన్యూ అధికారులకు మార్గదర్శకాలతో కూడిన సర్క్యులర్ జారీ చేయాలని జిల్లా పంచాయతీ, డివిజనల్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. డీపీవో లవరాజు, డివిజనల్ పంచాయతీ అధికారి పి.ఎస్.కుమార్, డివిజనల్ అభివృద్ధి అధికారి తేజ్ రతన్, ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ కె.రమేష్ పాల్గొన్నారు. -
సీహెచ్‌సీలో నిలిచిన అల్ట్రాసౌండ్ పరీక్షలు
ముంచంగిపుట్టు: స్థానిక సీహెచ్‌సీలో గత ఐదు నెలలుగా గర్భిణులకు అల్ట్రాసౌండ్ పరీక్షలు నిలిచిపోయాయి.దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రతి మంగళ, గురు వారాల్లో సీహెచ్‌సీలో గర్భిణులకు ఉచితంగా అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసి శిశువు ఆరోగ్య పరిస్థితి, హృదయ స్పందన తదితర వివరాలు తెలుసుకుంటారు. దీంతో గర్భిణులు ముందుగా జాగ్రత్త పడేందుకు ఆస్కారం ఉంటుంది. గతంలో పాడేరు జిల్లా ఆస్పత్రి నుంచి గైనికాలజిస్ట్ వచ్చి సీహెచ్‌సీలో అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసేవారు. గైనికాలజిస్ట్ లేక నవంబర్ నెల పరీక్షలు చేయకపోవడంతో గర్భిణులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ప్రతి వారం 40 నుంచి 50మంది గర్భిణులు 52కిలో మీటర్ల దూరంలో ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రికి వెళ్లి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.అల్ట్రాసౌండ్ పరీక్షల నిర్వహణకు స్థానిక సీహెచ్‌సీలో అన్ని సౌకర్యాలు ఉన్నా గైనికాలజిస్ట్ లేక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తక్షణమే వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి గైనికాలజిస్ట్‌ను నియమించాలని మండల వాసులు కోరుతున్నారు.ఈ విషయంపై స్థానిక వైద్యాధికారి గీతాంజలిని వివరణ కోరగా గైనికాలజిస్ట్ లేకపోవడం వల్ల అల్ట్రాసౌండ్ పరీక్షలు ఐదు నెలల నుంచి నిలిచాయని చెప్పారు. ఉన్నతాధికాలకు సమస్యను తెలియజేసినట్టు ఆమె తెలిపారు. గైనికాలజిస్ట్ లేక ఇబ్బందులు పాడేరు వెళ్లేందుకు అవస్థలు పడుతున్న గర్భిణులు -
వడగళ్ల వానతో జీడిమామిడికి నష్టం
రాజవొమ్మంగి: మండలంలోని లాగరాయి, లబ్బర్తి, కిండ్ర, కొత్త కిండ్ర గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన వడగళ్లవానకు పది మందికి చెందిన దాదాపు మూడు వందల ఎకరాల్లోని జీడిమామిడి తోటల్లో పిందెలు రాలిపోయాయి. ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. వడగళ్లు పడడంతో పూత, పిందె రాలిపోయి కోలుకోలేని విధంగా దెబ్బతిన్నామని రైతులు గుమ్మిడి అచ్చమ్మ, పాము అప్పారావు, పొట్టబోయిన తాతబ్బాయి, యాదల రాజు తదితరులు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు వారాల్లో పంట చేతికి వస్తుందన్న ధీమాతో అప్పులు చేశామని, వాటిని ఏ విధంగా తీర్చాలో తెలియడం లేదని వారు వాపోయారు. ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. -
నైపుణ్యంతో కూడిన విద్య అవసరం
అడ్డతీగల: భవిత కేంద్రంలోని ప్రత్యేకావసరాల విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖ అకడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ కె.భాస్కరరావు చెప్పారు. మంగళవారం అడ్డతీగలలోని భవిత కేంద్రం, ఎమ్మార్సీ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిత విద్యార్థులకు ఆట, పాటలతో పాటు చిత్రలేఖనం, తదితర అంశాల్లో కూడా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి రోజు ఐఈఆర్టీలు విధుల కు హాజరై విద్యార్థులకు తగిన రీతిలో తర్ఫీదు ఇవ్వాలన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఎమ్మార్సీ సిబ్బందితో సమావేశం నిర్వహించి విద్యా శాఖ కార్యక్రమాలతో పాటు ఉపాద్యాయుల విధులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్రోడీకరించుకుని అప్టుడేట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఐదేళ్లలో చదివినఖైదీలను పరిశీలిస్తే..
ఇక్కడ ప్రతి సంవత్సరం చదువుకున్న ఖైదీల సంఖ్య మారుతూ ఉంటుంది. కొత్త వారు రావడం, శిక్ష పూర్తయిన వారు వెళ్లిపోవడం వల్ల ఈ సంఖ్యలో మార్పు ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో మొత్తం 55 మంది ఖైదీలు ఓపెన్ పదో తరగతిలో చేరారు. 20 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. డిగ్రీ స్థాయిలో బీఏ కోర్సును 29 మంది పూర్తి చేయగా, ఒకరు పీజీలో ఎంఏ పరీక్షలు రాశారు. ● 2020–21లో 80 మంది ప్రాథమిక విద్య, 26 మంది ఓపెన్ టెన్త్, 14 బీఏ చదువుకున్నారు. ● 2021–22లో 90 మంది ప్రాథమిక విద్య, 10 మంది ఓపెన్ టెన్త్, 9 మంది బీఏ విద్యనభ్యసించారు. ● 2022–23లో 82 మంది ప్రాథమిక విద్య, ఆరుగురు బీఏ, ఒకరు ఎంఏ చదివారు. ● 2023–24లో 80 మంది ప్రాథమిక విద్య, 9 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ చదివారు. ● 2024–25 (ప్రస్తుతం)లో 90 మంది ప్రాథమిక విద్య కొనసాగిస్తుండగా, 19 మంది ఓపెన్ టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. 11 మంది ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. -
114 అంగన్వాడీపోస్టుల భర్తీకి చర్యలు
● నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ సాక్షి,పాడేరు: జిల్లా లోని పాడేరు, రంపచోడవరం, చింతూ రు ఐటీడీఏల పరిధిలో 114 అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ మంగళవారం తెలిపారు.అంగన్వాడీ కార్యకర్తలు 7, ఆయాలు 56, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 27, పీఎం జనమన్ పథకంలో కొత్తగా మంజూరైన అంగన్వాడీ కేంద్రాలలో 24 ఆయాల పోస్టులను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు.అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు బుధవారం నుంచి ఏప్రిల్ 10వతేదీ సాయంత్రం ఐదు గంటల లోగా సంబంధిత ఐసీడీఎస్ అధికారికి నేరుగా గాని, పోస్టు ద్వారాగాని దరఖాస్తులు అందజేయాలని చెప్పారు. పై పోస్టులకు దరఖాస్తు చేసే మహిళలంతా తప్పనిసరిగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, వివాహితలైన, స్థానికంగా నివాసం ఉన్నవారు అర్హులని తెలిపారు. 2025 జులై 1నాటికి అభ్యర్థుల వయస్సు 21ఏళ్ల నుంచి 35సంవత్సరాల లోపు ఉండాలని పేర్కొన్నారు. ఈ వయ స్సు అభ్యర్థులు లేని పక్షంలో 18ఏళ్లు నిండిన అభ్యర్థు దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు. ఇది కేవలం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలకే వర్తిస్తుందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణతకు 50 మార్కులు, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, ప్రీ స్కూల్ మేనేజ్మెంట్, ఇంటర్మీడియట్ బోర్డు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల ద్వారా పొందిన ధ్రువీకరణ పత్రాలకు 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, మైనర్ పిల్లలు ఉన్న అభ్యర్థులకు 5 మార్కులు, పూర్తిగా అనాథ,క్రెచ్ హోమ్,ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ సత్ప్రవర్తన కలిగిన వారికి 10 మార్కులు,దివ్యాంగులకు 5 మార్కులు,మౌఖిక పరీక్షకు 20 మార్కులు కలిపి మొత్తం 100 ఉంటాయన్నారు.మార్కుల ఆధారంగా పూర్తి పారదర్శకతతో ఈ పోస్టుల భర్తీ చేయనున్న ట్టు చెప్పారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని కలెక్టర్ తెలిపారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మధ్యవర్తులు,దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. పోస్టుల వివరాలు,దరఖాస్తు ప్రక్రియకు అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాల్లో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. -
నాలుగేళ్ల బాలికౖపైలెంగిక దాడి
– పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు ఎటపాక: మండలంలోని గౌరిదేవిపేట పంచాయతీ పరిధిలోని బాడిశవారి గుంపు గ్రామంలో నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఈఘటనపై ఆలస్యంగా మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందడంతో చింతూరు ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. గ్రామంలోని నాలుగేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన మడకం చిట్టిబాబు(38) అనే వ్యక్తి ఈనెల 18న లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈఘటనపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించినా న్యాయం జరగక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కన్నపరాజు చెప్పారు. -
నూకాలమ్మ జాతర
పోదాం పదే యాతర భక్తులకు మూలవిరాట్ దర్శనం లేనట్టే.. అనకాపల్లి టౌన్: ఉత్తరాంధ్రలోనే ప్రఖ్యాతి గాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 28, 29 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనుంది. 28న జాతర, 29న కొత్త అమావాస్య పండగ, 30న ఉగాది వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెల రోజులపాటు జరగనున్న జాతర ఏప్రిల్ 27వ తేదీతో ముగుస్తుంది. అమ్మవారు కొలువై ఉన్న బాలాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేసవి కావడంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లను సిద్ధం చేశారు. మంచినీటి కూలర్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్ విజయ కృష్ణన్ సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ గొల్లబాబు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను నిరంతరం పరిశీలిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో మరింత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది ఆలయ పరిసరాల్లోనే ఈ పండగ వాతావరణం కనిపించేది. ఈసారి పట్టణం నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో కూడా ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాగణంలో భారీ వేదిక రూపొందించి భక్తులందరికీ కనిపించేలా అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. ఈ అమ్మవారి విగ్రహానికి రెండు పూటలా ప్రత్యేక పూజలు చేయడానికి కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే స్టేడియం పరిసరాలను పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతున్నారు. జెయింట్‌వీల్, మూవింగ్ ట్రైన్, రన్నింగ్ షిప్, పిల్లలు ఆడుకొనే వివిధ రకాల వస్తువులు, తినుబండారాల స్టాల్స్ నెలకొల్పనున్నారు. ఆధ్యాత్మికత ప్రతిఫలించేలా సంకీర్తనలు, కోలాటం, జానపద నృత్యాలను నెల రోజులపాటు నిర్వహించనున్నారు. నెల రోజుల జాతర కోసం ఎన్టీఆర్ స్టేడియంలో నెలకొల్పే 12 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం గవరపాలెం పురవీధుల గుండా ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. నెల రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు రాష్ట్ర పండగగా ప్రకటించిన నేపథ్యంలో అధికారుల ప్రత్యేక పర్యవేక్షణ అమ్మవారి దేవస్థానం పునర్నిర్మాణ పనులు గడిచిన రెండేళ్లుగా నిర్విరామంగా చురుగ్గా సాగుతున్నాయి. మధురైలోఉన్న మీనాక్షి అమ్మవారి గుడి తరహాలో నిర్మాణం చేపడుతున్నారు. సుమారు రూ.10 కోట్ల నిధులతో ఆలయం ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. గతంలో ఒకవైపు ప్రధాన గోపురం ఉండేది. ఇప్పుడు మిగిలిన మూడు వైపులా రాజగోపురాలు, అంతరాలయం, అలివేటి మండపం నిర్మిస్తున్నారు. అన్ని హంగులు పూర్తయ్యాక దసరాకు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో గర్భాలయంలో అమ్మవారి మూలవిరాట్ దర్శనం ఈ ఏడాది కూడా లేనట్టయింది. ఈ నేపథ్యంలో భక్తులు బాలాలయంలోనే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. -
జాతీయ రహదారి పనుల అడ్డగింత
రాజవొమ్మంగి: జాతీయ రహదారి 516ఇ నిర్మాణ పనులను దూసరపాము గ్రామస్తులు మంగళవారం రాత్రి అడ్డుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ గ్రామ సరిహద్దులో ఉన్న మూడు ఇళ్లను తొలగించాలని అధికారులు గుర్తించారు. దాదాపు రూ.కోటి వరకు నష్టపరిహారం ఇస్తామని ఆరు నెలల కిందట హామీ ఇచ్చారు. అదే సమయంలో ఈ గ్రామానికి వచ్చిన సబ్‌కలెక్టర్ కల్పశ్రీ రహదారి పనులు ముందుకు సాగేందుకు సహకరించాలని నిర్వాసితులను కోరారు. ఒక నెలలోనే నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నెలరోజుల కిందట ఆ మూడు ఇళ్లను తొలగించి, రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందకపోవడంతో ఇళ్లు కోల్పోయిన బాధితులు, గ్రామస్తులు రహదారి నిర్మాణపనులను, లారీలను అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎస్ఐ నరసింహమూర్తి, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులకు ఎస్ఐ సర్ది చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని సర్పంచ్ శివ, ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ గ్రామస్తులకు నచ్చజెప్పడంతో వారు శాంతించారు.రోడ్డుపై బైఠాయించిన నిర్వాసితులు, గ్రామస్తులు -
26న ఆర్ ఆండ్ ఆర్ గ్రామసభలు
కూనవరం: మండల పరిధి లోని వాల్ఫర్డ్‌పేట, కొండ్రాజుపేట, పంద్రాజుపల్లి, కూళ్లపాడు గ్రామాల్లో ఈ నెల 26వ తేదీ ఉదయం 11.00 గంటలకు ఆర్అండ్ఆర్ గ్రామసభలు నిర్వహించనున్నట్టు చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ సోమవారం తెలిపారు. ఫేజ్ 1బీలో ముంపునకు గురవుతున్న 10 గ్రామాలకు గాను బుధవారం పైన పేర్కొన్న నాలుగు గ్రామాల్లో సభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సభల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వివరాలు, భూమికి భూమి, ఆర్అండ్ఆర్ కాలనీలకు భూమి కేటాయింపు తదితర అంశాలను వివరించనున్నట్టు పేర్కొన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పొందేందుకు అర్హుల, అనర్హుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అదే గ్రామసభల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు అర్జీ సమర్పించవచ్చన్నా రు. ఆయా గ్రామస్తులందరూ సభల్లో పాల్గొనాలని పీవో కోరారు. వచ్చే వారం మిగతా మండలాల్లో ముంపునకు గురవుతున్న గ్రామా ల్లో కూడా గ్రామసభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఐటీడీఏ పీవో తెలిపారు. -
వలస జీవన సౌందర్యం
విలక్షణం.. శ్రమలోనే ఉంది అసలైన జానపదం.. శ్రమలోనే ఉంది ఐకమత్యం.. శ్రమలోనే ఉంది అలుపెరగని జీవనపోరాటం.. శ్రమయేవ జయతే.. అదే వీరి నినాదం. అందుకే రాష్ట్రాలు దాటి వీరి ప్రయాణం..పని కోసం భారం, దూరం లెక్క చేయని నైజం.. పనిలోనే ఆనందాన్ని దర్శిస్తూ సాగుతుంది ఒడిశా ఆదివాసీల జీవనయానం.. ● రాష్ట్రాలు దాటి పనికోసం.. ఆదివాసీల ప్రయాణం ● వాగులు, వంకలు, ఇసుక తిన్నెల్లోనే నివాసాలు ● మూడు నెలలు ఇక్కడే పనులు ● తిరుగు ప్రయాణంలో కూలీలు ● సుమారు 10వేల మంది ప్రతి ఏటా రాక వలస కూలీల బతుకు చిత్రం ఎటపాక: కాయకష్టం వారికిష్టం..చిన్నా పెద్దా తేడాలుండవు..సమష్టిగా పనిచేయడం వచ్చిన దానినే అంతా సమానంగా పంచుకోవడం వీరి నైజం. కల్మషం లేని హృదయాలు వీరివి. వీరంతా వలస కూలీలు. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్,ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా కూలి పనుల కోసం ఇక్కడకి వలస వచ్చి, మూడునెలల పాటు ఇక్కడే జీవనం సాగిస్తారు. ఎటపాక,కూనవరం,వీఆర్‌పురం మండలాలతో పాటు తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల,వెంకటాపురం,వాజేడు మండలాలు,ఏలూరు జిల్లాలోని కుక్కునూరు,వెలేరుపాడు మండలాల్లో మిర్చి పంటను సుమారు10 వేల ఎకరాల్లో సాగుచేస్తారు. అయితే మిర్చి కోతలకు జనవరి నెల ప్రారంభంలోనే కుటుంబ సమేతంగా తిండిగింజలు పట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వస్తారు. వీరిని ఇక్కడకు తీసుకొచ్చేందుకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.ఎందుకంటే వీరొస్తేనే మిర్చి, పొగాకు పంటలు చేతికొచ్చేది. వేల మంది వలస కూలీలు ఈ నెలాఖరు వరకు ఇక్కడే ఉండి కూలి పనులు చేసుకుంటారు. -
మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ
వై.రామవరం: స్థానిక వారపుసంతలో మండల లోతట్టు గ్రామాలనుంచి వచ్చిన ప్రజల ఆధ్వర్యంలో సోమవారం మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. తమకు మావోయిజం వద్దని, అభివృద్ధే ముఖ్యమని నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. గతంలో మావోయిస్టులు అడ్డుకోవడంతో మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, సెల్ టవర్ల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకో వద్దని కోరారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఇకపై ఎవరూ మావోయిస్టు పార్టీలోకి వెళ్లమని ప్రతిజ్ఞ చేశారు. -
కుటుంబ సభ్యుల చెంతకు మతిస్థిమితం లేని యువకుడు
ఎటపాక : మతిస్థిమితం లేని ఓ యువకుడు తిరుమలలో తప్పిపోయి నెల్లిపాకలో దొరికాడు. వివరాలు.. తిరుమల కొండపై ఓ దుకాణం నిర్వాహకురాలైన బద్రిముని అమ్ములు రాణికి ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు దిలీప్(21) ఈ నెల 17న తిరుమల కొండదిగి వచ్చి ఇంటికి తిరిగి వెళ్లలేదు. అప్పటి నుంచి ఆ యువకుడి ఆచూకీ కోసం చుట్టు పక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది. దిలీప్ వద్ద సెల్‌ఫోన్ ఉన్నప్పటికీ అతడు ఎక్కడ ఉన్నదీ సరిగా చెప్పలేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు. ఈనెల 23న ఎటపాక మండలం నెల్లిపాక శివారు ప్రాంతం జాతీయ రహదారిపై నడుచుకుంటూ అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని నెల్లిపాక గ్రామానికి చెందిన ముదిగొండ వినయ్‌కుమార్ ప్రశ్నించగా తనది తిరుమల అని భద్రాచలం వచ్చి తిరుగుతున్నట్టు చెప్పాడు. కాగా యువకుడికి మతిస్థిమితం లేదని గ్రహించి అతడి వద్ద స్విచ్ఆఫ్ అయిన సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టి అందులోని మిస్డ్ కాల్‌కు ఫోన్ చేయగా అతడి తల్లి ఫోన్ లిఫ్ట్‌చేసి తన కుమారుడు ఎక్కడ ఉన్నదీ తెలుసుకుని, పరిస్థితిని వివరించింది. దీంతో ఆ యువకుడిని చేరదీసి రాత్రంతా ఉంచి ఉదయం భద్రాచలంలోని సిటీస్టైల్ జిమ్ నిర్వాహకుడు గొంగడి వెంకటరామిరెడ్డి వద్దకు చేర్చాడు. సోమవారం ఉదయం సదరు యువకుడి సోదరుడు ప్రసాద్.. తిరుమల నుంచి భద్రాచలం రావడంతో అతడికి దిలీప్‌ను అప్పగించడంతో వారు కృతజ్ఞత లు తెలిపారు. -
వాగులు, వంకల వద్ద వీరి నివాసం
కూలి పనులకు వచ్చిన వీరంతా గుంపులు గుంపులుగా వాగుల వద్ద,గోదావరి ఇసుక దిబ్బలపై నివాసం ఉంటారు. నీటి సౌకర్యం ఉన్న చోట గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తారు. వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను వండుకుని, సూర్యుడు ఉదయించక ముందే వారి వెంట తీసుకుని మిర్చి తోటల్లో కాయలు కోసేందుకు వెళ్లిపోతారు. కొద్ది గంటలు పనులు చేశాక వారి వెంట తెచ్చుకున్న భోజనాన్ని సమానంగా పంచుకుని తోటల్లోనే తింటారు.ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే కొంత సమయం చెట్ల నీడనే సేదతీరి ఆ వెంటనే మళ్లీ పనులకు ఉపక్రమిస్తారు. మళ్లీ సూర్యుడు అస్తమించాక వీరి నివాస ప్రాంతాలకు వెళ్లిపోతారు. -
ఆహారపు అలవాట్లు
వలస కూలీలు వారి వెంట తెచ్చుకున్న దంపుడు,రేషన్ బియ్యాన్నే అన్నం వండేందుకు వాడతారు.అన్నంలో వేసుకునేందుకు చింత పండు పులుసునే నిత్యం తయారు చేసుకుంటారు. ఘాటుగా ఉండే పచ్చిమిరపకాయలను బండపై నూరి దానినే అన్నంలో కలుపుకొనిఎంతో ఇష్టంగా తింటారు.రైతులు దయతలచి వారానికోమారు ఇచ్చే జుట్టు కోళ్లను(లగ్గారం) కోసుకుని తింటారు. వీరికి నీటి గుంటలు,సెల యేళ్లు,సాగునీటి పైపుల వద్ద నీటితోనే స్నానాలు చేయడం అలవాటు. కొందరు ఆ నీటినే తాగుతుంటారు.రాత్రి భోజనాల అనంతరం వారి సంప్రదాయ నృత్యాలతో సందడిచేసి నిద్రకు ఉపక్రమించడం వీరి దినచర్య. ఇలా వారు పిల్లా పాపలతో కలిసి మిర్చి కోతలు పూర్తి అయిన తరువాత కూలి పనులకు వచ్చిన సొమ్ములు,మిర్చి కాయలను భద్రంగా దాచుకుని తిరిగి వారి స్వ గ్రామాలకు పయనమవుతారు.ఇలా వలస కూలీలనే నమ్ముకుని ఇక్కడి రైతులు మిర్చి,పొగాకు సాగు చేస్తుంటారు.వీరు ఇక్కడ కూలి పనులకు ఉన్నంత కాలం పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. చిరు దుకాణాల వ్యాపారాలు మంచిగా సాగుతాయి. -
ఈదురు గాలులు..వడగళ్లు
కొయ్యూరు/రాజవొమ్మంగి: ఒక వైపు ఎండలు మండుతుంటే జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రెండు గ్రామాల్లో వడగళ్లు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకూ చండప్రచండగా సూరీడు నిప్పులు చెరగగా, మరిన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా వాన పడింది. కొయ్యూరు మండలం మంప పంచాయతీ పైడిపనుకులలో సుమారు అరగంట పాటు వడగళ్ల వర్షం కురిసింది. మండలంలో కొన్నిచోట్ల భారీగా, మరికొన్నిచోట్ల ఒక మోస్తారు వర్షం పడింది. ఈదురు గాలులు వీచడంతో చాలా చోట్ల జీడి పిందెలు రాలిపోయాయి. దాదాపుగా ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బలిఘట్టం నుంచి కృష్ణదేవిపేట మధ్యలో లైన్ పాడైపోవడంతో ప్రత్యామ్నాయంగా రాజవొమ్మంగి నుంచి విద్యుత్ సరఫరా చేశారు. రాజవొమ్మంగి మండలం కొత్త కిండ్రలో వడగళ్ల వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల గంటకు పైగా వర్షం పడింది. ఈ వర్షం ప్రస్తుతం మండలవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో సాగవుతున్న రబీ పొగాకు పంటకు మేలు చేస్తుందని రైతులు తెలిపారు. పాడేరు : పట్టణంలో కురిసిన వర్షంతో ప్రజలు ఉమశమనం పొందారు. కొన్ని రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్నం 3గంటల సమయంలో అరగంట పాటు వర్షం కురవడంతో పట్టణవాసులు సేదతీరారు. గూడెంకొత్తవీధి: గూడెంకొత్తవీధి మండలంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకూ ఎండ కాసింది. సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. విద్యుత్ సరఫరా కొద్దిసేపు నిలచిపోయింది. ఈ వర్షాలు కాఫీ తోటలకు అనుకూలమని ఆర్వీనగర్ కాఫీ పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలు తెలిపారు. జి.మాడుగుల(పాడేరు రూరల్): మండలంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం పడింది.కొత్తపల్లి జలపాతం ప్రాంతంతో పాటు జి.మాడుగుల, బంధవీధి, సొలభం, గడుతురు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం రెండు ప్రాంతాల్లో వడగళ్ల వాన గాలులకు రాలిన జీడిమామిడి పిందెలు -
అదనపు డబ్బులివ్వలేదు..
రంపచోడవరం మండలం చెరువూరుకి చెందిన నాకు 2021–22 సంవత్సరంలో హౌసింగ్ స్కిమ్‌లో ఇల్లు మంజూరు చేశారు. ఇంటి నిర్మాణం కోసం కొండరెడ్డిలకు రూ.1.80 లక్షలు ఇచ్చారు. చాలా మంది ఇళ్ల నిర్మాణాలను మధ్యలో నిలిపివేశారు. అయితే నేను రూ.1.50 లక్షలు అప్పు చేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాను. మధ్యలో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిన వారికి ఇటీవల అదనంగా డబ్బులు మంజూరు చేశారు. నాకు మాత్రం ఇవ్వలేదు. స్పందనలో అర్జీ ఇస్తే ఇంటి నిర్మాణం పూర్తయింది కాబట్టి అదనపు డబ్బులు రావంటున్నారు. నేను అప్పుచేసి ఇల్లు నిర్మించడమే పాపమైందా... మాకు న్యాయం చేయాలి . – చోళ్ల చిలకరెడ్డి, చెరువూరు, రంపచోడవరం మండలం -
ఆర్థిక తగాదాలతో తమ్ముడిని హత్యచేసిన అన్న
మారేడుమిల్లి: ఆర్థికలాదాదేవీల్లో ఏర్పడిన తగాదాల కారణంగా సొంత తమ్ముడిని ఓ అన్న హత్యచేశాడు. ఎస్ఐ సాధిక్ తెలిపిన వివరాలు.. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ పరిధిలోని నీలవరం గ్రామానికి చెందిన తుమ్ముడు సుగ్గిరెడ్డి (40), తుమ్మడు లచ్చిరెడ్డి అన్నదమ్ములు. వీరు 2002 సంవత్సరంలో ఉమ్మడిగా ఓ వ్యాన్‌ను కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ వ్యాన్ ప్రమాదానికి గురైంది. వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో ఇద్దరికీ నష్టం వచ్చింది. నష్టాన్ని ఇద్దరూ సమానంగా భరించాలని ఒప్పంద కుదుర్చుకున్నారు. అయితే అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలపై తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సుగ్గిరెడ్డి, లచ్చిరెడ్డి గ్రామ సమీపంలోని జీలుగు కల్లు చెట్టు వద్దకు వెళ్లి కల్లు తాగారు. ఈ సమయంలో వారి మధ్య ఆర్థిక లావాదేవీలపై మళ్లీ గొడవ జరిగింది. అనంతరం ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. కొంత సమయం తరువాత సుగ్గిరెడ్డిని అన్నయ్య లచ్చిరెడ్డి జీలుగు కల్లు చెట్టు వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ బాణంతో సుగ్గిరెడ్డిని కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సుగ్గిరెడ్డి మృతి చెందాడు. ఈ విషయం సోమవారం పోలీసులకు తెలిసింది. సీఐ గోపాల్ కృష్ణ, మారేడుమిల్లి, గుర్తేడు ఎస్ఐలు సాధిక్, పార్ధసారథి సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి, నిందితుడు లచ్చిరెడ్డిని అరెస్టు చేశారు. పోస్టుమార్టానికి సుగ్గిరెడ్డి మృతదేహాన్ని రంపచోడదవరం ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ సాధిక్ తెలిపారు. -
రైతు ఉత్పత్తిదారులసంఘాలకు చేయూత
● నాబార్డు డీడీఎం చక్రధర్ చింతపల్లి: గిరిజన ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు నాబార్డు ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు నాబార్డు జిల్లా మేనేజరు చక్రధర్ తెలిపారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానంలో ఏడు రోజులపాటు తేనెటీగల పెంపకం, తేనె సేకరణపై ఇచ్చిన శిక్షణ సోమవారంతో ముగిసింది. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాబార్డు డీడీఎం పలు సూచనలు చేశారు. అనంతరం శిక్షణపొందిన రైతులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. తేనెటీగల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసుకుంటే రైతులకు మంచి లాభదాయకమని ఏడీఆర్ అప్పలస్వామి తెలిపారు. శాస్త్రవేత్తలు సందీప్‌నాయక్, వెంకటేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
● విశాఖ తీరంలో మరో ఆకర్షణ
ఏయూక్యాంపస్: సాగరతీరంలో మరో పర్యాటక ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. బీచ్ రోడ్డులో ఇప్పటికే ఉన్న టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం పక్కనే యూహెచ్–3 హెచ్ హెలికాప్టర్ మ్యూజియం తుది మెరుగులు దిద్దుకుంటోంది. వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో దాదాపు రూ. 2.2 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. భారత నావికాదళంలో 17 ఏళ్లపాటు అవిరళంగా సేవలందించిన ఈ హెలికాప్టర్‌ను కొద్ది నెలల కిందట విశ్రాంతినిచ్చారు. విపత్తుల సమయంలోనూ, తీర ప్రాంత భద్రతలోనూ ఇది ఎంతో కీలక పాత్ర పోషించింది. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించిన వీఎంఆర్డీఏ .. భారత నావికాదళ సత్తాను చాటి చెప్పేలా, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఈ మ్యూజియాన్ని తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో సుందరీకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. రానున్న రెండు వారాల్లో దీనిని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హెలికాప్టర్ చుట్టూ పచ్చని లాన్లు, ప్రత్యేకమైన మొక్కలు, ఆకర్షణీయమైన నీటి ఫౌంటెన్లను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల్లో మరింత అందంగా కనిపించేలా దీని చుట్టూ అద్దాల నిర్మాణం చేపట్టారు. త్వరలోనే సందర్శన వేళలు, టికెట్ ధరల వివరాలను వీఎంఆర్డీఏ ప్రకటించే అవకాశం ఉంది. నేటి యువతరం సెల్ఫీలు, ఫొటోల పట్ల చూపిస్తున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మ్యూజియం లోపలి భాగాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. తుది దశకు హెలికాప్టర్ మ్యూజియం పనులు -
మౌలిక వసతుల కోసం గిరిజనుల నిరసన
రావికమతం: కనీస మౌలిక వసతులు కల్పించాలంటూ మండలంలో చీమలపాడు పంచాయతీ సామాలమ్మ కొండపై జీలుగులోవ గ్రామంలో పీవీటీజీ తెగకు చెందిన 8 గిరిజన కుటుంబాలు ఆదివారం ఆందోళనకు దిగాయి. కనీస సౌకర్యాలు లేవని గతంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు గిరిజన గ్రామాన్ని సందర్శించి కొండ కిందకు వస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి గిరిజనులు అంగీకరించారు. వీరికి చీమలపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 169లో 30 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అయితే ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో చాలా ఇబ్బందులకు గురై గతంలో సీదరి వెంకట్రావు(50), కొర్రా బాబూరావు(45)మృతి చెందారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించానలి డిమాండ్ చేస్తూ ఆదివారం గిరిజనులు రోడ్డెక్కారు. మంగళవారం రావికమతం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందరావు, కొర్రా బాలరాజు, సీదరి బాలరాజు తెలిపారు. -
అప్పన్నకు ఘనంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం 7 నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపారు. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. ఆలయ ఏఈవో ఎన్.ఆనంద్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. వైభవంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టింపజేశారు. ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు. -
కదం తొక్కిన ఉక్కు కాంట్రాక్టు కార్మికులు
గాజువాక : స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపును నిరసిస్తూ ఆదివారం భారీ పాదయాత్ర నిర్వహించారు. ఉపాధి రక్షణ యాత్ర పేరుతో విశాఖ ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పాదయాత్రలో కాంట్రాక్టు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కొత్తగాజువాక జంక్షన్లో ప్రారంభమైన ఈ పాదయాత్ర గాజువాక మెయిన్‌రోడ్, పాతగాజువాక, శ్రీనగర్ మీదుగా కూర్మన్నపాలెంలోని ఉక్కు కార్మికుల దీక్షా శిబిరం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించడం దారుణమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి పార్టీలను నమ్మి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చిన కార్మికులకు కూటమి ప్రజాప్రతినిధులు మద్దతు నిలవకపోవడం సరికాదన్నారు. కష్టంలో ఉన్న కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలవాలని సూచించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మడానికి, కార్మికులను తొలగించడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తి సాధించడానికి ఆ ప్యాకేజీ వల్ల ఎలాంటి ఉపయోగంలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుతామని, నిర్వాసితులకు ఉపాధి ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కూటమి నాయకులు ఎన్నికల్లో గెలిచిన తరువాత మొహం చాటేస్తున్నారన్నారు. ఉక్కు పరిరక్షణ కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ ప్లాంట్ కోసం కార్మికులు 1500 రోజుల నుంచి ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం రూ.11,400 కోట్లు ప్యాకేజీ ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులను రోడ్డుపైకి నెట్టేయడం కోసం ప్రయత్నిస్తోందన్నారు. అందులోభాగంగా ఇప్పటికే వెయ్యి మందిని బయటకు పంపేసిందన్నారు. సెయిల్‌లో కలపడానికి గాని, సొంత గనులు కేటాయించడానికి గాని కేంద్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదని, అయినప్పటికీ ప్రభుత్వం ఆ పని చేయకుండా ఉద్యోగులను తొలగిస్తోందన్నారు. కార్మికుల తొలగింపును ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, విశాఖ స్టీల్‌ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. గాజువాక నుంచి కూర్మన్నపాలెం వరకు ఉపాధి రక్షణ పాదయాత్ర తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ -
ఇన్పుట్ ట్యాక్స్ స్వాహా!
సిబ్బంది చేతివాటం ? ఫేక్ ఇన్వాయిస్లు సృష్టిస్తున్న కొందరు నకిలీ వ్యాపారులకు కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ కార్యాలయాల్లోని కొందరు దిగువ స్థాయి సిబ్బంది సహకారం అందుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫేక్ ఇన్వాయిస్లను పక్కాగా ఎలా తయారు చేయాలి..? వాటిని ఏ సమయంలో సమర్పిస్తే.. ఎవరికీ అనుమానం రాకుండా పూర్తిస్థాయిలో వెరిఫికేషన్ జరగదు.. ఎలా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని సొంతం చేసుకోవచ్చు.. ఇలా.. సమగ్ర వివరాలతో స్కెచ్ వేస్తూ.. సక్రమంగా అమలయ్యేటట్లుగా ప్లాన్ చేస్తున్నారు. ఫైల్స్ తమ దగ్గర నుంచే వెళ్లేలా చూస్కోని ఎవరికీ అనుమానం రాకుండా ఇన్‌పుట్‌ని కొట్టేస్తూ.. చెరిసగం పంచేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : నకిలీ ఇన్వాయిస్ల పేరుతో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఫేక్ కంపెనీల పేరుతో పన్నుల చెల్లింపును ఎగవేసేలా వ్యూహాల్ని అమలు పరుస్తున్నారు. కొన్ని కంపెనీలు చిన్న చిన్న తప్పులతో దొరికిపోతుంటే.. చాలా మంది వ్యాపారులు మాత్రం దర్జాగా ఇన్పుట్ క్రెడిట్‌ని తమ ఖాతాల్లోకి జమ చేసుకుంటున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్(డీజీజీఐ) విశాఖపట్నం జోనల్ యూనిట్ పరిధిలో దాదాపు 380కి పైగా నకిలీ కంపెనీల గుట్టు రట్టు చేసి రూ.300 కోట్లుకు పైగానే రికవరీ చేశారు. అయినా ఫేక్ కంపెనీలు నకిలీ ఇన్వాయిస్లతో రెచ్చిపోతున్నాయి. ఖజానాకు చిల్లు! ముఖ్యంగా స్టేట్ ట్యాక్స్ కార్యాలయంలోని కొందరు సిబ్బందితో పాటు సూర్యాబాగ్, సిరిపురం, ద్వారకానగర్, డాబాగార్డెన్స్, కురుపాం మార్కెట్, గాజువాక, అనకాపల్లి, చినవాల్తేరు సర్కిల్స్ పరిధిలో ఈ తరహా నకిలీ ఇన్వాయిస్లు ఎక్కువగా సృష్టించి.. ఇన్పుట్ క్రెడిట్ కుంభకోణంతో ఖజానాకు చిల్లు పెడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కంపెనీల్ని గుర్తిస్తున్నా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మాత్రం.. ఏదో ఒక రూపంలో.. మోసం చేస్తూనే ఉన్నారు. కేవలం వ్యాపారుల వైపు నుంచి మాత్రమే ఉన్నతాధికారులు దృష్టిసారిస్తుండటంతో.. ఇంటిదొంగలెవరూ పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫేక్ కంపెనీలతో నకిలీ ఇన్వాయిస్ల సృష్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని సొంతం చేసుకునేందుకు వ్యాపారుల కుయుక్తులు విశాఖ డివిజన్ పరిధిలో రూ.కోట్లలో మోసాలు సహకరిస్తున్న కొందరు జీఎస్టీ సిబ్బంది ‘ఇన్పుట్’ను చెరో సగం పంచుకుంటున్న వైనం