
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాజవొమ్మంగి: మండలంలోని పాకవెలితి గ్రామంలో కరెంట్ షాక్‌కు గురైన పప్పుల శివప్రసాద్ (18)ను చికిత్స కోసం తీసుకొని వెళ్తుండగా శనివారం రాత్రి మార్గమధ్యలోనే మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో విద్యుత్ వైర్లు కలుపుతు షాక్ గురై 90 శాతం కాలిన గాయాలతో అపస్మారక స్థితి చేరుకొన్న సంగతి తెలిసిందే. కాగా అతనిని మెరుగైన చికిత్స కోసం ఏలేశ్వరం సీహెచ్‌సీకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు ఈ విధంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు చిన్నయ్య, సావిత్రిల దుఃఖానికి అంతులేకుండా పోయింది. ఈ సంఘటనలో పాకవెలితిలో విషాదం అలముకొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చిన్నబాబు చెప్పారు. ప్రత్తిపాడు ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్టు తెలిపారు.