
గిరి రైతుల ఆర్గానిక్‌ఉత్పత్తులకు గిరాకీ
● ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడ
పాడేరు : గిరిజన రైతులు సాగు చేస్తున్న ఆర్గాని క్ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తెలిపారు. ఐటీడీఏ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, పరిశ్రమల శాఖ అధికారులు, ఎంపీడీవోలతో గ్రామీణ పరిశ్రమల పార్క్ ఏర్పాటుపై గురువారం ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జి.మాడుగుల మండలం సొలభంలో రూరల్ ఇండస్ట్రీయల్ పార్క్‌ఏర్పాటు చేసేందుకు యో చిస్తున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి జి.రవిశంకర్, వెటర్నరీ ఏడీ నర్సింహు లు, ఎల్డీఎం మాతునాయుడు పాల్గొన్నారు.