
ప్రశాంతంగా గురుకుల ప్రవే
పాడేరు : గురుకుల విద్యాలయాల్లో ప్రవేశం కల్పించేందుకు జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. స్థానిక గిరిజన గురుకుల బాలికల పాఠశాల, శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, తలార్‌సింగి సీఏహెచ్ బాలుర పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 5,6,7,8 తరగతులకు సంబంధించి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 5,6,7,8 తరగతులకు సంబంధించి 312 మంది విద్యార్థులకు గాను 176 మంది హాజరు కాగా, 136 మంది గైర్హాజరయ్యారు. ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షకు 843 మందికి గాను 591 మంది హాజరు కాగా, 252 మంది హాజరు కాలేదు. ఈ పరీక్ష కేంద్రాలను డీఆర్వో పద్మలత, జిల్లా విద్యాశాఖా ధికారి బ్రహ్మాజీరావు, పరీక్షల అసిస్టెంట కమిషనర్ ఆర్. శశికుమార్ తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.