
ఉగ్రదాడుల్లో మృతులకు నివాళి
రంపచోడవరం/మోతుగూడెం/వై.రామవరం/గంగవరం/కూనవరం: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో ఉగ్రవాదుల దాడుల్లో మృతులకు ఘన నివాళులర్పించారు. రంపచోడవరం, మోతుగూడెం, వై.రామవరం, గంగవరం, కూనవరం ప్రాంతాల్లో శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు మాట్లాడుతూ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని అంత మొందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వెంకట్, కిరణ్, వాణిశ్రీ,, నిర్మల, రాణి, ప్రేమ్‌స్వరూప్, రామచంద్రనాయుడు, రామ్‌ప్రసాద్, వల్లీఖాన్ నూకరాజు, కనకరాజు, సుబ్బలక్ష్మి, శారదదేవి, సోమాలమ్మ, నాగమణి, సిద్దు, రమణ,నాగూర్, మణి, సాయి, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రదాడుల్లో మృతులకు నివాళి

ఉగ్రదాడుల్లో మృతులకు నివాళి

ఉగ్రదాడుల్లో మృతులకు నివాళి

ఉగ్రదాడుల్లో మృతులకు నివాళి