ఘనంగా అమ్మవారి విగ్రహ ఊరేగింపు
సీలేరు: జీకే వీధి మండలం సీలేరు గ్రామ దేవత మారెమ్మ అమ్మవారి ఆలయ 53వ వార్షికోత్సవాల సందర్భంగా శనివారం అమ్మవారి ఊరేగింపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి గరగను, ఉత్సవ విగ్రహాలను సీలేరు వీధుల్లో అంగరంగా వైభవంగా ఊరేగించారు. భక్తులు అమ్మవారికి పసుపు,కుంకుమ సమర్పించి, హారతులిచ్చారు. తాడేపల్లిగూడేంకు చెందిన అమ్మవారి శక్తి వేషాలు, తీన్మార్ డప్పులు, థింసా నృత్యాలు, డీజే సౌండ్స్‌తో ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో సీలేరు పూర్వ విద్యార్థులు, పూర్వ జెన్‌కో ఉద్యోగులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జీకే వీధి సీఐ వరప్రసాద్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్‌ఐ రవీంద్ర భారీ బందోబస్తు నిర్వహించారు.


