
ఉపాధి కూలీగా మారిన ఎస్‌ఐ
ముంచంగిపుట్టు: స్థానిక ఎస్‌ఐ జె.రామకృష్ణ ఉపాధి కూలీగా మారి గంటపాటు పనిచేశారు. సుజనకోట పంచాయతీ కొత్తసుజనకోట గ్రామ గిరిజనులు ఉపాధిహామీ పనులుచేస్తుండగా శని వారం ఉదయం పనిప్రదేశానికి వెళ్లిన ఎస్‌ఐ వారి సమస్యలు తెలుసుకుంటూ, పారతో మట్టిని తవ్వారు. మట్టిని తట్టలో వేసి మోసుకుంటూ గంట పాటు ఉపాధి పనిచేశారు. ఉపాధి కూలీలతో కలిసి కాసేపు ముచ్చటించారు.పోలీసుశాఖ ద్వా రా చేస్తున్న సేవలు వారికి వివరించి,గంజాయి జోలికి పోకుండా మంచి జీవితం గడపాలని కూలీలకు సూచించారు. ఎస్‌ఐ వారితో కలిసి పని చేయడంతో కొత్తసుజనకోట గ్రామ గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు.