బెల్ట్ దుకాణాలను నియంత్రించాలి
ప్రధాన జంక్షన్లు, గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం ప్రభుత్వానికి తగదు. గ్రామాల్లో నిరంతరం లభ్యమవుతుండడంతో పేద గిరిజనులు మద్యానికి బానిసలవుతున్నారు. మండల కేంద్రాల్లో రోడ్డు పక్కనే ఉన్న మద్యం దుకాణాల వద్దే మందు తాగిస్తుండడంతో రోడ్డుపై నడిచి వెళ్లే మహిళలకు ఇబ్బందిగా మారుతోంది. సాయంత్రం మందు బాబుల బెడద మరింత ఎక్కువగా ఉంటోంది. బెల్ట్‌షాపులను ప్రభుత్వం నియంత్రించాలి
– వి.వి.జయ, ఐద్వా రాష్ట్ర కమిటీ, సభ్యురాలు
అరకులోయ


