
తన బాల్యమిత్రుడైన కుచేలుడు పిడికెడు అటుకులిస్తేనే మురిస
చందనాన్ని అరగదీస్తున్న నాల్గవ తరగతి సిబ్బంది
ఒక్కో ఉద్యోగి తీసిన చందనాన్ని
తూకం వేస్తున్న
వైదికులు(ఫైల్)
నాలుగు విడతలుగా చందన సమర్పణ
సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందన స్వరూపుడు. ఏటా నాలుగు విడతల్లో స్వామికి పచ్చి చందనాన్ని సమర్పిస్తారు. వైశాఖ శుద్ధ తదియ(అక్షయ తృతీయ)ను పురస్కరించుకుని జరిగే చందనోత్సవంరోజు స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. నిజరూప దర్శనం పూర్తికాగానే అదే రోజు రాత్రి స్వామికి తొలివిడతగా మూడు మణుగు(సుమారు 125 కిలో)ల పచ్చి చందనాన్ని సమర్పి స్తారు. ఆ తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి పర్వదినాల్లో మరో మూడేసి మణుగులు చొప్పున పచ్చి చందనాన్ని పూస్తారు. ఆయా సమర్పణల పర్వదినాలకు ముందు మూడు నుంచి ఐదు రోజుల పాటు ఆలయ బేడా మండపంలో అరగదీత కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఇందుకు ఉపయోగించే గంధపు చెక్కలను తమిళనాడు నుంచి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్ని స్వామివారి కోసం వినియోగిస్తారు.
కిలో చందనం..
మూడు కిలోల బియ్యం
ఒక కేజీ చందనం అరగదీస్తే మూడు కిలోల బియ్యాన్ని దేవస్థానం ఈ నాల్గవ తరగతి సిబ్బందికి అందిస్తుంది. అరగదీసిన చందనాన్ని కిలోల లెక్కన వైదికులు తూకం వేసి, వారి ఖాతాలో రాస్తారు. ఇలా ఒక్కో ఉద్యోగి వ్యక్తిగతంగా ఎన్ని కిలోల చందనం అరగదీస్తే అన్ని మూడేసి కిలోల చొప్పున బియ్యాన్ని దేవస్థానం నుంచి తీసుకుంటారు. ఈ బియ్యాన్ని స్వామివారి మహా ప్రసాదంగా వీరంతా స్వీకరిస్తారు. తరతరాలుగా ఎంతో మంది నాల్గవ తరగతి ఉద్యోగులు చందనం అరగదీతలో పాల్గొని తరిస్తున్నారు. చందనం అరగదీసే రోజుల్లో ఆలయమంతా చందన పరిమళాలను వెదజల్లడం ఒక మంచి అనుభూతిని అందిస్తుందని, అనందంగా చెప్తారు.
నాల్గవ తరగతి ఉద్యోగులే కీలకం
ఆలయంలో విధులు నిర్వర్తించే నాల్గవ తరగతి ఉద్యోగులే చందనం అరగదీతను చేపడతారు. దేవస్థానం అందించే నూతన పంచెలను ధరించి, నోటికి వస్త్రాన్ని కట్టుకుని, ఎంతో భక్తి శ్రద్ధలు, నియమనిష్టలతో చందనాన్ని అరగదీస్తారు. ఒక్కో విడతలో కావాల్సిన సుమారు 125 కిలోల చందనాన్ని వీరే సిద్ధం చేస్తారు. ఇలా అరగదీసిన చందనంలో సుగంధ ద్రవ్యాలను కలిపి ఆయా పర్వదినాల్లో వైదికులు స్వామికి సమర్పిస్తారు. స్వామిపై ఉన్న చందనం తమ చేతుల మీదుగా అరగదీయడాన్ని ఈ ఉద్యోగులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. తమకు మాత్రమే దక్కిన ఈ మహా భాగ్యానికి ఆనందంతో పరవ శిస్తారు.

తన బాల్యమిత్రుడైన కుచేలుడు పిడికెడు అటుకులిస్తేనే మురిస

తన బాల్యమిత్రుడైన కుచేలుడు పిడికెడు అటుకులిస్తేనే మురిస