
సమర యోధుల మ్యూజియాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి
● రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు
చింతపల్లి: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టుగా తాజంగిలో చేపట్టిన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌చైర్మన్ శంక ర్రావు అధికారులకు సూచించారు. చింతపల్లి మండలంలో సోమవారం ఆయన పర్యటించా రు.అసంపూర్తిగా నిలిచిపోయిన మ్యూజియం పనులను పరిశీలించారు. నిర్మాణా ల్లో జాప్యానికిగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, ఈవిషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు చొరవ తీసుకోవాలని కమిషన్ తరఫున కోరతామన్నారు.జేసీ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ డీఈఈ రఘు,ఏఈఈ కిషోర్,ఏటీడ బ్ల్యూజయలక్ష్మి,తహసీల్దారురవికుమార్‌పాల్గొన్నారు.
లంబసింగిలో విత్తన ప్రదర్శన
సిఫా, వాసన్, ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు ఉమ్మడిగా లంబసింగిలో ఆదివాసీ విత్తన పండగను నిర్వహించారు. ఈసందర్భంగా పలు రకాల విత్తనాలను ప్రదర్శనలో ఉంచారు. ఈకార్యక్రమానికి హాజరైన చైర్మన్ శంకర్రావు విత్తనాలను పరిశీలించారు. అంతరించిపోతున్న సంపదను కాపాడుకోవాలని ఆయన తెలిపారు.