
పీజీఆర్‌ఎస్‌కు 104 అర్జీలు
పాడేరు : ప్రజల సమస్యలను గడువులోగా పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కార వేది క కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో పద్మలతతో కలిసి సబ్ కలెక్టర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 104 అర్జీలు స్వీకరించా రు. రహదారుల నిర్మాణ, తాగునీటి సమస్య, పింఛన్లు, అటవీ హక్కుల పత్రాలు మంజూరు చేయాలని, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ అధిక వినతులు వచ్చాయి.డీఎంహెచ్‌వో డాక్టర్ జమల్‌బాషా, టీడబ్ల్యూ ఇన్‌చార్జి డీడీ కమల, డీఈవో బ్రహ్మాజీరావు, డీఎస్‌డీవో జగన్‌మోహన్‌రావు, జిల్లా రవాణా అధికారి లీలాప్రసాద్, కార్మిక శాఖ అధికారి సుజాత, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రోహిణి పాల్గొన్నారు.