
మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకు చెందిన గృహం స్వాధీనం
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో పని చేస్తున్న అధికారుల కోసం నిర్మించిన నివాస గృహం ఆక్రమణకు గురైంది.ప్రాజెక్టులో గతంలో పనిచేసిన ఆనందో నందో కుమారుడు అనిల్‌కుమార్ నందో ప్రాజెక్టు నివాస గృహాన్ని ఆక్రమించి,ఆధునిక హంగులతో పనులు చేయిస్తున్నాడు.ప్రాజెక్టు అధికారులు పలుమార్లు ఇంటిని ఖాళీ చేయమని,పనులు ఆపాలని చెప్పినా వినిపించుకోలేదు.దీంతో అధికారులు పోలీసులకు తెలియజేశారు.పోలీసులు సైతం చెప్పినా పనులు చేస్తూ ఉన్నాడు. దీంతో ప్రాజెక్టు అధికారులు ప్రాజెక్టు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.ఉన్నత అధికారులు కొరాపుట్ సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు అదనపు తహసీల్దార్ ఉదవ్ సబర్,ప్రాజెక్టు ఎస్‌ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావులు రెవెన్యూ అధికారులు గురువారం రాత్రి తాళాలు పగలగొట్టి గృహాన్ని స్వాధీనం చేసుకున్నారు.