
ఏవోబీలో విస్తృతంగా తనిఖీలు
ముంచంగిపుట్టు: ఆంధ్ర,ఒడిశా సరిహద్దు ప్రాంతంలో శనివారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వారపు సంతతో పాటు జోలాపుట్టు,డుడుమ మార్గాల్లో ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కర్రెగుట్టలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అధిక సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడంతో పాటు పెద్ద సంఖ్యలో మావోయిస్టులు తప్పించుకున్నట్టు వచ్చిన వార్తలతో సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని ప్రధాన జంక్షన్‌లు వద్ద తనిఖీలు చేస్తున్నారు.ప్రయాణికుల లగేజీలు పరిశీలించి,అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ప్రశ్నిస్తూ వాహన రికార్డులతో పాటు గుర్తింపు కార్డులు పరిశీలించి, విడిచి పెట్టారు. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాలు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు.