
వ్యవసాయంలో గిరి మహిళల పాత్ర కీలకం
చింతపల్లి: వ్యవసాయంలో గిరి మహిళల పాత్ర చాలా కీలకమని, వ్యవసాయ పనుల ప్రారంభం నుంచి మార్కెటింగ్ వరకు వారికి భాగస్వామ్యం కల్పిస్తే మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు అవకాశం ఉంటుందని మండల ఉద్యానవనశాఖాధికారి కంఠా బాలకర్ణ అన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో డిజిటల్ గ్రీన్, విజయవాహిని, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)ఆధ్వర్యంలో గిరి మహిళా రైతులతో గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో సాగులో భాగస్వామ్యం వహిస్తున్న గిరి మహిళలను కూడా రైతులుగా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యవసాయంలో అందిస్తున్న సాంకేతికపై గిరి మహిళలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా 60మంది మహిళా రైతులకు శిక్షణ ఇచ్చారు. డిజిటల్ గ్రీన్ ప్రతినిధి రేఖ,ఐఐఎంఆర్ ప్రతినిధి అప్పలరాజు పాల్గొన్నారు.
మండల ఉద్యానవనశాఖాధికారి
కంఠా బాలకర్ణ