ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
పాడేరు రూరల్: మెగా డీఎస్సీతో పాటు ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదివాసీ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తక్షణం ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ ప్రకటించి వంద శాతం ఆదివాసీలతోనే ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆదివాసీ నిరుద్యోగులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా పోతుందన్నారు. దీనిపై పాడేరు ఐటీడీఏ పాలక వర్గం సమవేశంలో స్పష్టమైన వైఖరి ప్రకటించి తీర్మా నం చేయాలన్నారు. మన్యంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఆదివాసీ నిరుద్యోగులతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.


