సాగునీటి వనరులపై గణన
చింతపల్లి: గిరిజన ప్రాంతంలో రైతులకు అందుబాటులో ఉన్న సూక్ష్మ నీటిపారుదల వనరుల గణన నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉప గణాంకాల అధికారి(డీఎస్‌వో)రాజేశ్వరి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల గ్రామ రెవెన్యూ అధికారులు, అసిస్టెంట్ వీఆర్‌వోలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో రైతులకు వ్యవసాయానికి అందుబాటులో ఉన్న సూక్ష్మ నీటిపారుదల వనరులను గుర్తించాలన్నారు.ప్రధానంగా చెరువులు,చెక్‌డ్యాంలు, జలాశయాలు తదితర నీటిపారుదల సౌకర్యాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని తెలిపారు.ఆ ప్రణాళిక నివేదికను సకాలంలో అందజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎస్‌వో జి.రాంబాబు పాల్గొన్నారు.


