
అడవుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు
చింతపల్లి డీఎఫ్‌వో నర్సింహారావు
చింతపల్లి: డివిజన్‌పరిధిలో అడవుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చింతపల్లి డీఎఫ్‌వో నర్సింహారావు తెలిపారు. స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శనివారం జరిగిన డివిజన్ సమావేశంలో 2025–26కు సంబంధించి అటవీశాఖ అధికారులు అమలు చేయాల్సిన కార్యక్రమాలు, పనులపై డీఎఫ్‌వో పలు సూచనలు చేశారు. అడవుల పరిరక్షణకు సిబ్బందికి ప్రత్యేక లక్ష్యాలను నిర్ణయించినట్టు చెప్పారు. అడవుల్లో విలువైన కలప అక్రమ నరికివేత, రవాణా వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయాలని తెలిపారు. త్వరలో చెక్‌పోస్టుల వద్ద సీసీకెమె రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రంగురాళ్ల తవ్వ కాలు జరగకుండా క్వారీల వద్ద నిరంతరం నిఘా ఉంచేందుకు సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. రంగురాళ్ల తవ్వకాలకు పాల్పడకుండా గిరిజనులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించా రు. ఇటీవల పలు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పో యిన అటవీశాఖ సిబ్బందికి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు అటవీ శాఖ ఉద్యోగుల సంక్షేమ నిధినుంచి ఆర్థిక సాయం అందజేశారు. ఈకార్యక్రమంలో రేంజ్ అధికారులు, క్షేత్రస్థాయి ఉద్యోగులు పాల్గొన్నారు.